• తాజా వార్తలు
  •  

మీ ఫ్రెండ్స్ లొకేష‌న్‌ను ఎలా ఫేక్ చేస్తున్నారో తెలుసుకోండిలా?

మ‌నం యూట్యూబ్‌లో వీడియోల‌ను సెర్చ్ చేస్తున్న‌ప్పుడు అన్ని వీడియోలు మ‌న‌కు ల‌భ్యం కావు. కొన్ని వీడియోలు దొరికినా ఈ కంటెంట్ మీ దేశంలో ప్లే కాదు అనే మెసేజ్‌లు క‌న‌బ‌డ‌తాయి. వీడియో ఒకటే అయిన‌ప్పుడు.. యూట్యూబ్ కూడా అన్ని దేశాల‌కు ఒక‌టే అయిన‌ప్పుడు ఇలా మ‌న‌కు ఎందుకు అడ్డంకులు ఎదుర‌వుతున్నాయి. నిజానికి యూట్యూబ్‌లో పెట్టే వీడియోల‌ను ప్ర‌పంచ వ్యాప్తంగా చూడొచ్చు. దీనికి ఎలాంటి అడ్డంకులు లేవు. కానీ వీడియోల‌ను అప్‌లోడ్ చేసేవాళ్లు కొన్ని ప్ర‌త్యేక‌మైన ప్రాంతాల్లో ఆ వీడియోలు ప్లే కాకుండా అడ్డుకోవ‌చ్చు. దీన్నే జియో వీడియో బ్లాకింగ్ అంటారు. కానీ ఈ విష‌యం మ‌న‌కు తెలియ‌దు. వీడియోలు మాత్ర‌మే కాదు మ‌నం ఎక్క‌వ ఉన్నామో కూడా తెలియ‌కుండా మ‌న లొకేష‌న్‌ను ఎవ‌రికి క‌నిపించ‌కుండా చేయ‌చ్చు. ఇలాంటి ప‌రిస్థితుల్లో మ‌నం గుర్తించ‌డం ఎలా?

వీపీఎన్ స‌ర్వీసు ఉప‌యోగించి..
వీపీఎన్ స‌ర్వీసు ఉప‌యోగిస్తే మీరు ఎలాంటి అడ్డంకులు ఉన్నా కంటెంట్‌ను చూసే అవ‌కాశం ఉంటుంది. కంట్రీ రిస్ట్రిక్ష‌న్స్‌ను దాటి మ‌నం ఎలాంటి కంటెంట్ నైనా చూసేందుకు, చ‌దివేందుకు వీపీఎన్ స‌ర్వీసు వీలు క‌ల్పిస్తుంది. మీరు చేయాల్సింద‌ల్లా ముందుగా క్రోమ్ ఎక్స్‌టెన్ష‌న్ ఉప‌యోగించి ఒక అకౌంట్‌ను క్రియేట్ చేయాలి. వేరే కంట్రీకి సంబంధించిన రిస్ట్రిక్టిడ్ కంటెంట్‌ను చూడాల్సిన వ‌చ్చిన‌ప్పుడు ట‌న్నెల్ ఆప్స‌న్ ఉప‌యోగించాలి. ట‌న్నెల్ బేర్ వీపీఎన్‌... 20 దేశాల్లో ఉప‌యోగించొచ్చు. మ‌రో ఉప‌యోగం ఏమంటంటే మీరు ఏ లొకేష‌న్‌లో ఉన్నారో కూడా తెలియ‌కుండా దాయ‌చ్చు.

మాన్యువ‌ల్ జియో లొకేష‌న్ క్రోమ్ ఎక్స్‌టెన్ష‌న్‌
వీపీఎన్ సర్వీసుల ద్వారా మ‌న లొకేష‌న్‌ను హైడ్ చేయ‌చ్చు. అయితే ఇది అన్ని వేళ‌లా న‌మ్మ‌ద‌గింది కాదు. మీ బ్రౌజ‌ర్ లొకేష‌న్‌ను వెబ్ సైట్ల వాళ్లు చెక్ చేస్తే.. తెలిసిపోయే అవ‌కాశం ఉంది. దీనింతో ఆ వెబ్‌సైట్ మీ స‌ర్వీసుల‌ను బ్లాక్ చేసే అవ‌కాశం ఉంది.  అయితే మాన్యువ‌ల్ జియో లొకేష‌న్ క్రోమ్ ఎక్స్‌టెన్ష‌న్ ద్వారా మీరు లొకేష‌న్‌ను హైడ్ చేయ‌చ్చు. క్రోమ్ ఎక్స్‌టెన్ష‌న్ ఓపెన్ చేసి ఎనేబుల్ చేయాలి. ఆ ఏరియా లాటిట్యూడ్‌, లాంగిట్యూడ్ వివ‌రాలు ఫిల్ చేసిన .. మీరు కోరుకున్న ప్రాంతంలో పిన్ డ్రాప్ చేయాలి.

డిజేబుల్ లొకేష‌న్‌
మ‌నం ఏరియాలో ఉన్నామో అంద‌రికి తెలియ‌కుండా చేయాలంటే మ‌రో సుల‌భ‌మైన చిట్కా. లొకేష‌న్ డిజేబుల్ చేయ‌డం. డిఫాల్ట్‌గా గూగుల్ క్రోమ్ అన్ని సైట్ల‌కు అనేబుల్డ్‌గా ఉంటుంది. అయితే మీ లొకేష‌న్‌లో ఫ‌లానా సైటు లేదా స‌ర్వీసు వ‌ద్ద‌ని భావిస్తే ఆ స‌ర్వీసును లేదా సైట్‌కు మీరు చిక్క‌కుండా లొకేష‌న్ డిసేబుల్ చేయాలి. మీకు ఆ సైట్ లేదా స‌ర్వీసు కావాల‌న‌కుకుంటే డిజేబుల్ లొకేష‌న్ ఆఫ్ చేసుకోవాలి.

జన రంజకమైన వార్తలు