• తాజా వార్తలు
  •  

స్కైప్ కాల్‌కి ఎంత బ్యాండ్ విడ్త్ అవ‌స‌ర‌మో తెలుసా?

వాట్స‌ప్ కాలింగ్ లాంటి ఆప్ష‌న్లు రాక‌ముందే మ‌న‌కు స్కైప్ కాలింగ్ గురించి తెలుసు. దూర ప్రాంతాల్లో ఉన్న బంధువులు, స్నేహితులతో మాట్లాడాలంటే స్కైప్ కాలింగ్‌నే ఉప‌యోగించేవాళ్లు. ఇప్ప‌టికి విదేశాల‌కు కాల్ చేయ‌డం కోసం స్కైప్‌నే వాడుతున్నారు. స్కైప్ కాల్ చేయాలంటే త‌ప్ప‌నిస‌రిగా ఇంట‌ర్నెట్ అవ‌స‌రం. అదీనూ కొంచెం బ‌ల‌మైన ఇంట‌ర్నెట్ కావాలి. ఏదో మొబైల్ డేటాతో లాగించేద్దా అనుకుంటే కుదుర‌దు. అవాంత‌రాలు లేని ఇంట‌ర్నెట్ అవ‌స‌రం. దీని కోసం బ్రాడ్ బ్యాండ్ అంతా వాడుతుంటారు. అయితే మీకు  స్కైప్ కాల్ చేయ‌డానికి ఎంత బ్యాండ్ విడ్త్ అవ‌స‌రం అవుతుందో ఎప్పుడైనా తెలుసుకున్నారా? అయితే తెలుసుకోండి.

  స్కైప్ ఎంతగా ఉప‌యోగ‌ప‌డుతుంది?
ఒక‌ప్పుడంటే మ‌న‌కు స్కైప్ త‌ప్ప వేరే ఆప్ష‌న్ లేదు వీడియో కాల్ చేయాలంటే.. ఇప్పుడు ఎన్నో ఆప్ష‌న్లు అందుబాటులోకి వ‌చ్చాయి. స్కైప్ లేక‌పోయినా సుల‌భంగా త‌క్కువ డేటాతో కూడా కాల్స్ చేసేస్తున్నారు. ఒక స్మార్ట్‌ఫోన్ ఉండి, అందులో డేటా ఉంటే చాలా ఏదోలా బ‌ఫ‌ర్ అవుతున్నా కూడా కాల్ క‌నెక్ట్ చేస్తున్నారు. మ‌రి ఈ స్థితిలో మ‌న‌కు స్కైప్ ఎంత వ‌ర‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది?  స్కైప్ కాలింగ్‌కు మినిమం డౌన్‌లోడ్ స్పీడ్ 30 కేబీపీఎస్‌కు త‌క్కువ‌గా ఉండ‌కూడ‌దు. మాగ్జిమమ్ డౌన్‌లోడ్ స్పీడ్ 100 కేబీపీఎస్ ఉండాలి. వీడియో కాలింగ్‌కు అయితే మినిమం 128 కేబీపీఎస్‌, డౌన్‌లోడ్ స్పీడ్ 300 కేబీపీఎస్ కావాలి.  హై క్వాలిటీ వీడియో కాలింగ్ కోసం 400 కేబీపీఎస్ అప్‌లోడ్, 1.5 ఎంబీపీఎస్ అప్‌లోడ్ స్పీడ్ ఉండాలి. హెడ్‌డీ వీడియో కాలింగ్ 1.2 ఎంబీపీఎస్ అప్‌లోడ్ కోసం, 1.5 ఎంబీపీఎస్ డౌన్‌లోడ్ స్పీడ్ ఉండాలి.  గ్రూప్ వీడియో (క‌నీసం ముగ్గురు)కు  512 కేబీపీఎస్ అప్‌లోడ్ స్పీడ్ త‌ప్ప‌నిస‌రి. 

కాల్‌కు ఎంత బ్యాండ్‌విడ్త్ కావాలో తెలుసుకోండిలా..
స్కైప్ ఎప్ప‌టిక‌ప్పుడు ఒక కాల్‌కు సంబంధించిన అప్‌లోడ్‌, డౌన్‌లోడ్ బ్యాండ్ విడ్త్ వివ‌రాల‌ను తెలియ‌జేస్తుంది.  కాల్ టెక్నిక‌ల్ ఇన్ఫోలో ఈ వివ‌రాలు ఉంటాయి. క‌న్వర్షేష‌న్ స్టేట‌స్‌, పార్టిసిపెంట్స్‌, ఎంత అప్‌లోడ్‌, ఎంత డౌన్‌లోడ్ అన్ని వివ‌రాలు ఇందులో ఉంటాయి.  రియ‌ల్ టైమ్‌లో కూడా మీరు ఈ వివ‌రాలు తెలుసుకోవ‌చ్చు. డైగ‌నొస్టిక్ చెక్ ద్వారా కూడా మీరు ఈ వివ‌రాలు తెలుసుకోవ‌చ్చు. మీరు కాల్ చేయాల‌నుకున్న ఒక కాంటాక్ట్‌ను సెల‌క్ట్ చేసుకుని, క‌న్వ‌ర్షేష‌న్ విండోలో చెక్ సెట్టింగ్స్‌పై క్లిక్‌చేయాలి. ఇందులో గ్రీన్ క‌ల‌ర్‌లో ఉండే ఇండికేట‌ర్ మీ బ్యాండ్ విడ్త్ బ‌లాన్ని తెలియజేస్తుంది 
 

జన రంజకమైన వార్తలు