• తాజా వార్తలు

ఆన్‌లైన్‌కు వెళ్ల‌కుండా వాట్స‌ప్ మెసేజ్‌లు రీడ్ చేయ‌డం ఎలా?

చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే క‌చ్చితంగా వాట్స‌ప్ ఉండాల్సిందే. ఎవ‌రికి మెసేజ్‌లు చేయాల‌న్నా, వీడియోలు షేర్ చేయాల‌న్నా ఈ యాప్‌కు మించింది ఉండ‌దు. అయితే యాప్‌తో మ‌న‌కు ఎన్ని ఉప‌యోగాలు ఉన్నాయో.. కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. మ‌న ప‌ర్మిష‌న్ లేకుండా కొంత‌మంది గ్రూప్‌ల‌లో మ‌న నంబ‌ర్లు యాడ్ చేయ‌డం, లేదా ప‌నికి రాని మెసేజ్‌ల‌ను షేర్ చేయ‌డం లాంటి వాటిని భ‌రించాల్సి వ‌స్తుంది. అంతేకాదు ఎవ‌రైనా పంపిన మెసేజ్ మనం చ‌ద‌వితే బ్లూటిక్ వ‌స్తుంది. ఐతే ఏదైనా సంద‌ర్భంలో మ‌నం ఎదుటివాళ్ల‌కు తెలియ‌కుండా వాట్స‌ప్ మెసేజ్‌లు చ‌ద‌వాలంటే? అదెలా సాధ్యం అంటారా? ఆన్‌లైన్‌లోకి వెళ్ల‌కుండా వాట్స‌ప్ మెసేజ్‌లు ఎలా చ‌ద‌వొచ్చో తెలుసా?

అన్‌సీన్ యాప్‌
మ‌నం ఎదురువారు పంపిన మెసేజ్‌లు చ‌ద‌వినా బ్లూటిక్‌లు రాకుండా ఒక యాప్ నిరోధిస్తుంది. దాని పేరు అన్‌సీన్‌. కేవ‌లం వాట్స‌ప్‌లో మాత్ర‌మే కాదు ఫేస్‌బుక్ మెసెంజ‌ర్‌, టెలిగ్రామ్‌, వీబ‌ర్‌ల‌లో సైతం వేరే వాళ్లు పంపిన మెసేజ్‌లు చ‌దివితే... ఆ విష‌యం పంపిన వాళ్ల‌కు తెలియ‌దు. ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఈ యాప్ వేసుకుంటే చాలు మ‌నం ఈ ప్ర‌యోజ‌నం పొందొచ్చు. అయితే బ్లూ టిక్‌లు వ‌చ్చినా.. ఎదుటివాళ్ల‌కు క‌నిపించ‌కుండా చేయ‌డ‌మే ఈ యాప్ చేసే ప‌ని. అంటే అన్‌సీన్ యాప్ ఓపెన్ చేసుకుంటే చాలు మీరు వాట్స‌ప్‌ను ఉప‌యోగించ‌కుండానే వాట్స‌ప్‌లో ఉన్న మెసేజ్‌ల‌ను చ‌దివే అవ‌కాశం ఉంటుంది.  ఇన్‌కాగ్నిటో మోడ్‌లో ఇది వాట్స‌ప్‌, ఫేస్‌బ‌క్‌, టెలిగ్రామ్ లాంటి సోష‌ల్ మీడియా సైట్ల‌లోని మెసేజ్‌లు గ్ర‌హిస్తుంది. 

ఇన్‌క‌మింగ్ వీడియోలు, పిక్చ‌ర్‌లు కూడా
మ‌న‌కు సోష‌ల్ మీడియా సైట్ల‌లో వ‌చ్చే మెసేజ్‌ల‌తో పాటు వీడియోలు, పిక్చ‌ర్ల‌ను కూడా ముందుగా మ‌నం అన్‌సీన్ యాప్‌లో చూసుకోవ‌చ్చు. మీరు చేయాల్సింద‌ల్లా ఆయా సైట్ల‌కు సంబంధించిన చాట్‌ల‌ను ఓపెన్ చేసి చూసుకోవ‌డ‌మే. దీని వ‌ల్ల మ‌నం మెసేజ్‌లు చ‌దివిన విష‌యం ఎదుటివాళ్ల‌కు తెలియ‌దు. లీగల్ నోటిసులు లాంటి వాటిని అందుకునే స‌మ‌యంలో ఈ ఫీచ‌ర్ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఎందుకంటే బ్లూ టిక్‌లు వ‌స్తే లీగ‌ల్ నోటీసులు అందుకున్న‌ట్లేన‌ని కోర్టు తీర్పు ఇచ్చిన నేప‌థ్యంలో ఈ యాప్ ఉప‌యోగ‌ర‌కం. ప్లే స్టోర్ నుంచి ఉచితంగా ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. 

జన రంజకమైన వార్తలు