• తాజా వార్తలు

డిలీట్ చేసిన ఫైల్ లను రికవర్ చేయడం ఎలా?

మనం మన కంప్యూటర్ లేదా ల్యాప్ ట్యాప్ లలో ఉన్న అనవసరమైన ఫైల్ లను అప్పుడప్పుడూ డిలీట్ చేస్తూ ఉంటాము. అయితే అవి కొన్నిసార్లు అవసరం అనిపిస్తాయి. అలాంటి సందర్భాలలో అరెరే అనవసరంగా డిలీట్ చేశామే అని అనిపిస్తుంది. మళ్ళీ వాటిని తిరిగి పొందాలి అంటే ఎలా? వేరే మార్గం ఏదీ లేదా అని కంగారుపడుతూ ఉంటారు. అయితే ఇకపై ఆ కంగారు అవసరం లేదు. ఈ ఆర్టికల్ చదవండి. డిలీట్ అయిన ఫైల్ లను రికవర్ చేసుకోండి.డిలీట్ చేసిన తర్వాత ట్రాష్ లో కానీ రీ సైకిల్ బిన్ లో కానీ ఉన్న ఫైల్ లను తిరిగి పొందడం ఎలా అనే అంశంపై మా కంప్యూటర్ విజ్ఞానం పాఠకుల కోసం ఈ వ్యాసాన్ని అందిస్తున్నాం.

అవును ఇది ఖచ్చితంగా సాధ్యం. మీరు డిలీట్ చేసిన ఫైల్ లు విండోస్ లో అయితే రీ సైకిల్ బిన్ లోనూ మాక్ లో అయితే ట్రాష్ లోనూ ఉంటాయి. వీటిని రికవర్ చేసుకోవాలి అంటే మనం కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి.

*డిలీట్ చేసిన ఫైల్ లపై ఓవర్ రైట్ చేయవద్దు

వాస్తవానికి మీ కంప్యూటర్ లో మీరు డిలీట్ చేసిన ఫైల్ లు శాశ్వతంగా డిలీట్ అవ్వవు. ఇది కేవలం అక్కడ ఉన్న స్పేస్ ను ఖాళీ చేసి అందుబాటులో ఉంచుతుంది. మీరు జాగ్రత్తగా డిస్క్ డ్రిల్ ను ఉపయోగించి వెదికినట్లయితే అలా డిలీట్ చేయబడిన ఫైల్ లు మీకు కనపడతాయి. ఇక అక్కడనుండి వాటిని వెనక్కి తీసుకురావడం పెద్ద కష్టమేమీ కాదు. మీరు మొదటగా చేయవలసింది ఏమిటంటే ఏదైనా ముఖ్యమైన సమాచారం డిలీట్ చేయబడినపుడు , మీరు ఆ సిస్టం పై పనిచేయడం ఆపివేసి ఎక్స్టర్నల్ సోర్స్ నుండి కానీ లేక డాకింగ్ సిస్టం నుండి కానీ దానికి హార్డ్ డ్రైవ్ ను కనెక్ట్ చేయాలి. డిస్క్ డ్రిల్ యొక్క ఫ్రీ వెర్షన్ 100 ఎంబీ వరకూ రికవర్ చేయగలిగిన సామర్థ్యాన్ని కలిగిఉంటుంది. ఇంకా ఎక్కువ చేయాలి అంటే దీనియొక్క ప్రో వెర్షన్ కు మారవచ్చు.

*ఇది ఎలా పనిచేస్తుంది?

ఇది చాలా సింపుల్ గా పనిచేస్తుంది. మీ కంప్యూటర్ లో ఈ డిస్క్ డ్రిల్ యాప్ ను ఓపెన్ చేయండి. రికవర్ బటన్ పై క్లిక్ చేయండి. ఇది మీ హార్డ్ డ్రైవ్ పేరు పక్కనే ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే చాలు. మీకు కావాల్సిన ఫైల్ ను సెలెక్ట్ చేసుకుని రికవర్ పై క్లిక్ చేస్తే చాలు. మీ ఫైల్ రికవర్ అయినట్లే.

*మీ కంప్యూటర్ ను స్కాన్ చేయండి

డిస్క్ డ్రిల్ సహాయంతో మీరు మీ హార్డ్ డ్రైవ్ ను స్కాన్ కూడా చేసుకోవచ్చు. ఇలా స్కాన్ చేయడం ద్వారా మీ కంప్యూటర్ లో ఉన్న అన్ని రకాల ఫైల్ లను చెక్ చేసుకోవడం వీలు అవుతుంది. స్కానింగ్ పూర్తీ అయిన తర్వాత మీరు రికవర్ చేసిన ఫైల్ లను సపరేట్ హార్డ్ డిస్క్ లో కానీ లేక యూఎస్బి లోకానీ సేవ్ చేసుకోవాలి. ఇది FAT32 మరియు NTFS ఫైల్ సిస్టమ్స్ రెండింటిలో నూ చక్కగా పనిచేస్తుంది. కాబట్టి ఏ బాధా లేదు. డిలీట్ అయిన ఫైల్ లను ఈ డిస్క్ డ్రిల్ ఉపయోగించి అతి సులువుగా రికవర్ చేసుకోవచ్చు.

*రీ సైకిల్ బిన్ నుండి ఫైల్ రికవరీ

డిలీట్ చేయబడిన ఫైల్ లు రీ సైకిల్ బిన్ లో ఉంటాయి అనే సంగతి మనకు తెలిసినదే.మీరు డిలీట్ చేసిన ఫైల్ లను ఒక లిస్టు రూపం లో ఈ డిస్క్ డ్రిల్ చూపిస్తుంది. వీటి అన్నింటినీ ఒక విండో లో చూపిస్తుంది. అక్కడ మీరు ప్రివ్యూ చూసుకోవచ్చు. మీరు వాటిని సెలెక్ట్ చేసి అవి ఎక్కడ సేవ్ అవ్వాలో చూపిస్తే చాలు ఆటోమాటిక్ గా అవి రికవర్ అవుతాయి.

 

జన రంజకమైన వార్తలు