• తాజా వార్తలు
  •  

 ఇన్‌క‌మ్ ట్యాక్స్ వారి త‌ర్వాత టార్గెట్ మీ ఫేస్‌బుక్ అకౌంటే.. ఎందుకంటే?

Income tax department, Facebook account, social media posting, Project Insight, ప్రాజెక్ట్ ఇన్‌సైట్‌,  ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌,ట్యాక్స్ రిట‌ర్న్స్‌, 


కొత్త కారు కొన్నాం, ఇంటి గృహ‌ప్ర‌వేశం చేసుకుంటున్నాం, విదేశాల‌కు టూర్ వెళ్లాం.. ఇలా  ఫేస్‌బుక్‌లో పోస్ట్‌లు పెట్టడం ఇటీవ‌ల బాగా పెరిగింది. త‌మ ఆనందాన్ని ప‌రిచ‌య‌స్తులంద‌రితో ఒకేసారి పంచుకోవ‌డానికి ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోష‌ల్ నెట్‌వ‌ర్క్ వంటివి ఎక్కువ‌గా వాడుతున్నారు. ఇలాంటి వాటన్నింటిపైనా ఇన్‌కంట్యాక్స్ డిపార్ట్‌మెంట్ క‌న్నేస్తోంద‌ని తెలుసా?  మీ ఖ‌ర్చును బ‌ట్టి మీ ఇన్‌కం ఎంతో లెక్క‌కట్టేందుకు ఆదాయ‌పు ప‌న్ను శాఖ  ప్రాజెక్ట్ ఇన్‌సైట్  అనే కొత్త ప్రోగ్రామ్‌ను స్టార్ట్ చేసింది.  మీ ఖ‌ర్చును బ‌ట్టి మీకు ట్యాక్స్ వేసేందుకు ఇది మొద‌టి అడుగు మాత్ర‌మే.
ప‌న్ను క‌ట్టేవాళ్లు త‌క్కువ‌
125 కోట్లకు పైగా జ‌నాభా ఉన్న ఇండియాలో 3 కోట్ల 70 ల‌క్ష‌ల మంది మాత్ర‌మే ఐటీ రిట‌ర్న్స్ ఫైల్ చేస్తున్నారు. వీరిలో కేవ‌లం ల‌క్షా 72 వేల మంది మాత్ర‌మే త‌మ‌కు ఇయ‌ర్లీ ఇన్‌క‌మ్ 5ల‌క్ష‌ల‌కుపైగా ఉంద‌ని ప‌న్ను క‌డుతున్నారు. మ‌రోవైపు ఏడాదికి 2 కోట్ల మంది విదేశాల‌కు వెళుతున్నారు. ఏడాదికి రెండు కోట్ల 60 ల‌క్ష‌ల మంది కొత్త‌గా కారు కొంటున్నారు. అంటే  ఆదాయం ఎక్కువ ఉన్న‌వారు కోట్ల‌లో ఉన్నా ట్యాక్స్ క‌ట్టేవా రు ల‌క్ష‌ల్లో ఉన్నార‌ని ఐటీ డిపార్ట్‌మెంట్ గుర్తించింది. అందుకే ఇలాంటి వారిని గుర్తించే ట్యాక్స్ వేసేందుకు ప్రాజెక్ట్ ఇన్‌సైట్‌ను ప్రారంభించింది.
ప్రాజెక్ట్ ఇన్‌సైట్ ఏంటి? 
మీ సోష‌ల్ నెట్‌వ‌ర్క్స్‌లో మీ పోస్టింగ్‌ల‌ను బ‌ట్టి మీరు ఎంత ఖ‌ర్చు పెడుతున్నారో చూసి దాన్ని బ‌ట్టి మీ ఇన్‌కంను అంచ‌నావేస్తారు. ఇందుకోసం  అడ్వాన్స్‌డ్ మెషీన్ లెర్నింగ్‌, డేటా  మైనింగ్‌, బిగ్ డేటాల‌ను ఉప‌యోగించుకుంటారు.  ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ కు ప్రాజెక్ట్ ఇన్‌సైట్ ప్రాజెక్ట్‌ను ఐటీ డిపార్ట్‌మెంట్ అప్ప‌గించింది. ప్రాజెక్ట్ కాస్ట్ 1000 కోట్లు.  ఈ ప్రాజెక్ట్ మూడు స్టేజ్‌ల్లో ప‌ని చేస్తుంది.
1. క్రెడిట్ కార్డ్ స్పెండింగ్‌, స్టాక్ మార్కెట్లో పెట్టుబ‌డులు, ఆస్తుల క్ర‌య‌విక్ర‌యాలు వంటివ‌న్నీ మీ ట్యాక్స్ డిక్ల‌రేష‌న్‌కు అటాచ్ చేసి టాలీ చేస్తారు.  మీ ఆదాయం ఎక్కువ ఉంటే ట్యాక్స్ క‌ట్ట‌మ‌ని మెయిల్స్ పంపిస్తారు.  డ‌
2. డేటా ఎన‌లిటిక్స్‌, డేటా మైనింగ్‌, బిగ్ డేటాల‌ను ఉప‌యోగించి ప్ర‌జ‌లంద‌రి individual spending profiles త‌యారు చేస్తారు. ఇందుకోసం మీ ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోష‌ల్ సైట్ల ఇన్ఫోను వాడ‌తారు. ఇది డిసెంబ‌ర్ నుంచి స్టార్ట‌వుతుంది. 
3. 2018 మే నుంచి ప్రాజెక్ట్ 2018 స్టార్ట్ చేస్తారు. ఇన్‌క‌మ్ సోర్సెస్‌ను ప్రెడిక్ట్ చేయ‌డం, వ్య‌క్తులు, సంస్థ‌ల ఖ‌ర్చుల‌ను బ‌ట్టి వారి ఆదాయాన్ని అంచ‌నావేయడం చేస్తారు. ఈ ప్రాజెక్ట్ క‌రెక్ట్‌గా వ‌ర్క‌వుట్ అయితే ట్యాక్స్ చెల్లించాల్సిన వారి సంఖ్య 30 నుంచి 40 శాతం పెరుగుతుంద‌ని ఎక్స్‌ప‌ర్ట్‌ల అంచ‌నా. 
 

జన రంజకమైన వార్తలు