• తాజా వార్తలు
  •  

సెలబ్రిటీల ట్విట్ట‌ర్ అకౌంట్లు న‌డుపుతున్న‌ది సెల‌బ్రిటీలేనా లేక బోట్సా? 

సినిమా యాక్ట‌ర్స్ నుంచి స్పోర్ట్స్ ప‌ర్స‌న్స్ వ‌ర‌కు, పొలిటీషియ‌న్స్ నుంచి ఫేమ‌స్ రైట‌ర్ల వ‌ర‌కు.. సెల‌బ్రిటీలు అంద‌రికీ ట్విట్ట‌ర్‌లో అకౌంట్లు ఇప్పుడు త‌ప్ప‌నిస‌రి అయిపోయాయి. ఏదో విష‌యం మీద వారు ట్వీట్ చేయ‌డం, దాన్ని ఫాన్స్ రీట్వీట్ చేయ‌డం పెద్ద ఫ్యాష‌న్ గా మారింది. ఒక సెల‌బ్రిటీని మ‌రో సెల‌బ్రిటీ పొగిడినా, తిట్టినా ఆ ట్వీట్ పెద్ద వైర‌ల్ అయిపోతుంది. ట్వీట్లు, రీట్వీట్ల‌తో ట్విట్ట‌ర్ వేడెక్కిపోతుంది. అస‌లు ఇంత‌కీ సెల‌బ్రిటీస్‌కు ట్విట్ట‌ర్ అకౌంట్‌ను వారే న‌డుపుతున్నారా లేక‌పోతే బోట్స్ (bots) ను వాడుతున్నారా అనే సందేహంతో యూనివ‌ర్సిటీ ఆఫ్ కొలంబియా ఇటీవ‌ల ఓ రీసెర్చి చేసింది.   10 మిలియ‌న్లు (కోటి)  కంటే ఎక్కువ మంది ఫాలోయ‌ర్స్ ఉన్న సెల‌బ్రిటీ అకౌంట్లలో ఎక్కువ భాగం  బోట్ లైక్ బిహేవియ‌ర్‌ను చూపిస్తున్నాయ‌ని రీసెర్చ్‌లో గుర్తించారు.  ట్విట్ట‌ర్ అకౌంట్స్ డేటాను తీసుకుని మ‌నుషులు వాడిన‌ప్పుడు ఆ అకౌంట్స్ ఎలా ఉంటాయిబోట్స్ ఆ అకౌంట్స్ న‌డుపుతుంటే ఎలా ఉంటుంది అనే విష‌యాల‌తో రీసెర్చ్ చేశారు. 

ప్ర‌మాద‌క‌రం కాదు

ట్విట్ట‌ర్ ఖాతాను బోట్ ద్వారా న‌డ‌ప‌డం ప్ర‌మాద‌కరం కాద‌ని  ఈ రీసెర్చ్‌ను లీడ్ చేస్తున్న పీహెచ్‌డీ స్టూడెంట్ జాఫ‌ర్ గిలానీ చెప్పారు.  అయితే ఇవి మనుషుల మాదిరిగా కాకుండా డిఫ‌రెంట్‌గా బిహేవ్ చేస్తున్నాయా అనేది అబ్జ‌ర్వ్ చేస్తున్నామ‌ని, దీనివల్ల అకౌంట్‌ను బోట్స్ నిర్వ‌హిస్తున్నాయా మ‌నుషులే న‌డుపుతున్నారా ఈజీగా గుర్తించ‌వ‌చ్చ‌ని అన్నారు.  అకౌంట్ క్రియేష‌న్ డేట్‌, ట్వీట్ ఫ్రీక్వెన్సీపోస్ట్ చేసిన కంటెంట్, అకౌంట్ డిస్క్రిప్ష‌న్‌, వేరే ట్వీట్స్‌కు రిప్ల‌యి ఇవ్వ‌డం, లైక్స్ ఇలాంటివ‌న్నీ అన‌లైజ్ చేశారు.   మొత్తం 3,535 ట్విట్ట‌ర్ అకౌంట్స్‌ను అన‌లైజ్ చేశారు. ఇందులో 1,525 బాట్స్ మాదిరిగా బిహేవ్ చేస్తే మిగిలిన 2,010 మాత్రం మ‌నుషులు న‌డుపుతున్న‌వాటి మాదిరిగా ఉన్నాయ‌ని గుర్తించారు.

40 -60% బోట్సే న‌డుపుతున్నాయి.

బోట్స్ ర‌న్ చేస్తున్న అకౌంట్స్ మ‌నుషులు ఆప‌రేట్ చేస్తున్న ట్విట్ట‌ర్ అకౌంట్ కంటే ఎక్కువ యాక్టివ్ గా ఉంటాయి. వాటికంటే ఎక్కువ ట్వీట్ చేస్తాయి.  బోట్స్ న‌డిపే ట్విట్ట‌ర్ అకౌంట్లు మొత్తం అకౌంట్ల‌లో 40 నుంచి 60 శాతం వ‌ర‌కు ఉంటాయ‌ని అంచ‌నా.  అయితే బోట్స్ చేసే ట్వీట్ క్వాలిటీ మ‌నుషుల ట్వీట్ క్వాలిటీ కంటే త‌క్కువ‌గా ఉంటుంది.  మ‌నుషుల ట్వీట్లు  బోట్స్ చేసే ట్వీట్ల కంటే 19 రెట్లు ఎక్కువ‌ లైక్స్‌, 10 రెట్లు ఎక్కువ రీట్వీట్స్ చేస్తున్నాయ‌ని  రీసెర్చ్ తేల్చింది.   

జన రంజకమైన వార్తలు