• తాజా వార్తలు
  •  

    అమెజాన్ నుంచి సోషల్ నెట్ వర్కింగ్ సైట్.. స్పార్క్

    
    సోషల్ నెట్ వర్కింగ్ సైట్లకు దక్కుతున్న పాపులారిటీ.. అవి పోషిస్తున్న పాత్ర దిగ్గజ సంస్థలను సైతం ఆకర్షిస్తోంది. అందులో భాగంగానే తాజాగా ఈ-కామ‌ర్స్ దిగ్గ‌జం అమెజాన్ కూడా సోషల్ నెట్ వర్కింగ్ లోకి అడుగు పెట్టింది. ‘అమెజాన్ స్పార్క్‌’ పేరుతో ఓ సోష‌ల్ నెట్‌వ‌ర్క్ వెబ్‌సైట్‌ను లాంఛ్ చేసింది.
    షాపింగ్ ప్రాధాన్యంగా రూపొందించిన ఈ సోష‌ల్ నెట్‌వ‌ర్క్ ఇంత‌కుముందే అందుబాటులో ఉన్న పింట్రెస్ట్‌, ఇన్‌స్టాగ్రాంల లాగే ఉండ‌టంతో నెటిజ‌న్ల నుంచి ఎలాంటి ఆదరణ పొందుతుందో చూడాలి. 
    ప్ర‌స్తుతం ఇది ఆపిల్ వినియోగ‌దారుల‌కు మాత్ర‌మే అందుబాటులో ఉంది. ఈ యాప్‌ను ఉప‌యోగించాలంటే అమెజాన్ ప్రైమ్ స‌భ్య‌త్వం ఉండాలి. త‌మ షాపింగ్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, ఆస‌క్తులు, రివ్యూలు పోస్ట్ చేసుకునే సౌక‌ర్యం ఈ యాప్‌లో ఉంది. అలాగే వినియోగ‌దారులకు, అమ్మేవారికి వార‌ధిగా ఈ యాప్ ప‌నిచేస్తుంద‌ని అమెజాన్ చెప్తోంది.
 

జన రంజకమైన వార్తలు