• తాజా వార్తలు
  •  

వాట్సప్ యూజర్లు తెలుసుకోవాల్సిన వినూత్న యాప్ షో, హైడ్

వాట్సప్.. మనకు  రోజు వారీ జీవితంలో భాగంగా మారిపోయింది. చాలా విషయాలకు వాట్సప్‌పై బాగా ఆధార‌ప‌డుతున్నాం. ఫొటోలు, వీడియోలు షేర్ చేసుకోవడంతో పాటు చాటింగ్‌ల‌లో విలువైన స‌మాచారాన్ని షేర్ చేసుకుంటున్నాం. అయితే మ‌నం ఉద‌యం వాట్స‌ప్ ఆన్ చేయ‌గానే కుప్ప‌లు తెప్ప‌లుగా వీడియోలు, ఫొటోలు వ‌చ్చి ప‌డుతూనే ఉంటాయి. దీని వ‌ల్ల మ‌న ఫోన్‌లో మెమ‌రీ కూడా అయిపోతూ ఉంటుంది.  అంతేకాదు ఫైల్ సెర్చ్  స‌మ‌యం కూడా పెరుగుతుంది.  అయితే ఇలాంటి అవ‌న‌స‌ర‌మైన వీడియోల‌ను, ఇమేజ్‌ల‌ను అవ‌స‌ర‌మైన‌ప్పుడు హైడ్ చేస్తూ మ‌ళ్లీ కావాల్సిన‌ప్పుడు చూపించే యాప్ ఒక‌టుంది. అదే షో, హైడ్ వాట్స‌ప్ ఇమేజ‌స్‌ అదేంటో చూద్దాం..


అవ‌స‌ర‌మైన వాటినే..
మ‌న‌కు వాట్స‌ప్‌లో అన్ని అవ‌స‌రం ఉండ‌వు. ముఖ్యంగా ఫొటోలు, వీడియోల విష‌యంలో ఈ ఇబ్బంది ఉంటుంది. అయితే షో, హైడ్ యాప్‌తో ఈ ఇబ్బందిని సుల‌భంగా అధిగ‌మించొచ్చు.  ట్వికింగ్ టెక్నాల‌జీస్ త‌యారు చేసిన ఈ యాప్‌తో వాట్స‌ప్ ఫైల్స్‌ను సులభంగా మేనేజ్ చేయ‌చ్చు. అంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫైల్స్‌ను హైడ్ చేయ‌చ్చు.. లేదా బ‌య‌ట‌కు తీసుకు రావొచ్చు. ఈ యాప్ ఫోటోలు, వీడియోల‌తో పాటు ఆడియా ఫైల్స్‌, జీఐఎఫ్, ఇత‌ర డాక్యుమెంట్ల‌ను కూడా మేనేజ్ చేస్తుంది. ఒక‌సారి ఈ యాప్‌ను ఉప‌యోగించి ఒక ఫైల్‌ను హైడ్ చేస్తే.. అది ఇక గ్యాల‌రీలో క‌నిపించ‌దు. 

యాప్ వ‌ల్ల ఉప‌యోగాలు

మేనేజ్ గ్యాల‌రీ
షో, హైడ్ వాట్స‌ప్ ఇమేజ‌స్ యాప్‌ను ఉపయోగించి గ్యాల‌రీని సుల‌భంగా మేనేజ్ చేసుకోవ‌చ్చు. అంటే మీకు అవ‌స‌రం లేని అన్ని ఫైల్స్ (లైబ్ర‌రీతో స‌హా)ను సుల‌భంగా మేనేజ్ చేస్తుంది.  వీటిని హైడ్‌, షో చేసుకోవ‌చ్చు. 

ఫైల్ సెర్చ్ టైమ్ త‌గ్గించ‌డం
అన్ని యాప్‌ల‌ను, ఫైల్స్‌ను దాయ‌డం వ‌ల్ల ఫైల్ సెర్చ్ టైమ్ గ‌ణ‌నీయంగా త‌గ్గిపోతుంది. ముఖ్యంగా లైబ్ర‌రీలో ఉన్న ఫైల్స్‌ను హైడ్ చేయ‌డం వ‌ల్ల మ‌న‌కు  సెర్చింగ్ టైమ్ బాగా త‌గ్గిపోతుంది. 

స‌మ‌యం ఆదా అవుతుంది
గ్యాల‌రీని మేనేజ్ చేయ‌డం, ఫైల్ సెర్చ్ టైమ్ త‌గ్గించ‌డం వ‌ల్ల మీకు స‌మ‌యం చాలా ఆదా అవుతుంది. మీరు మీకు అవ‌స‌ర‌మైన ఫైల్స్‌ను సుల‌భంగా వెతుక్కునే అవ‌కాశం ఉంటుంది.

ప్రైవ‌సీ పెరుగుతుంది
ఈ టూల్ ద్వారా మీ ఫోన్ ప్రైవ‌సీ కూడా బాగా పెరుగుతుంది. మీకు సంబంధించిన విలువైన స‌మాచారాన్ని ఎవ‌రూ త్వ‌ర‌గా త‌స్క‌రించ‌లేరు. క‌నీసం చూడ‌లేరు. అంతేకాదు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ ఫైల్స్‌ను చూసుకునే అవ‌కాశం ఉంటుంది.

జన రంజకమైన వార్తలు