• తాజా వార్తలు
  •  

టాక్స్ ఎగ‌వేత‌గాళ్ల‌ను సోష‌ల్ మీడియా ద్వారా పట్టుకునేందుకు 650 కోట్ల కాంట్రాక్ట్ షురూ..

ట్యాక్స్ క‌ట్టేంత ఆదాయం ఉండీ ప‌న్ను క‌ట్ట‌కుండా త‌ప్పించుకు తిరిగేవాళ్ల కోసం ఇన్‌క‌మ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ గ‌ట్టిగానే దృష్టి పెట్టింది.  ప‌న్ను ఎగ్గొట్టే వాళ్ల  సోష‌ల్ ప్రొఫైల్‌, సోష‌ల్ మీడియాలోవాళ్ల యాక్టివిటీ ని బ‌ట్టి వాళ్ల ఆదాయం ఎంతో కాలిక్యులేట్ చేసి ఆదాయ ప‌న్ను క‌ట్ట‌మ‌ని నోటీసులు పంపించేందుకు ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్‌తో ఏకంగా 650 కోట్ల‌తో కాంట్రాక్ట్ కూడా కుదుర్చుకుంది. ఎల్ అండ్ టీ సీఎండీ సంజ‌య్ జెలోనా ఈ విష‌యాన్ని అనౌన్స్ చేశారు. 
ఇలా ప‌ట్టుకుంటారు
సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT)  ఎల్ అండ్ టీకి ఈ ప్రాజెక్ట్‌ను  ఇచ్చింది. దీని ప్ర‌కారం ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ ఎక‌నామిక్ వెబ్‌పేజీల‌ను త‌యారు చేస్తుంది.   ఈ వెబ్‌పేజీలు కంప్యూట‌ర్ ఆటోమేటిక్‌గా రీడ్ చేయ‌గ‌లిగేలా ఉంటాయి. ఈ సిస్ట‌మాటిక్ వెబ్‌పేజీలు ప‌ర్స‌న్స్ సోష‌ల్ మీడియా యాక్టివిటీని ఎప్ప‌టిక‌ప్పుడు మానిటర్ చేసి క్రియేట్ చేస్తారు.  ఉదాహ‌ర‌ణ‌కు ఒక వ్య‌క్తి ఫారిన్ టూర్ వెళ్లాన‌ని ఫేస్‌బుక్‌లో పెట్టొచ్చు. లేదంటే  ఆయ‌న భార్యో, కూతురో ఫ‌లానా జ్యూయ‌ల‌రీ షాప్‌లో షాపింగ్ చేస్తున్న‌ట్లు ఇన్‌స్టాగ్రామంలో ఫొటోనో లేక‌పోతే వాట్సాప్ స్టేట‌సో పెట్టొచ్చు. లేదంటే కొత్త కారుకు పూజ చేస్తున్న ఫొటోనూ, వెకేష‌న్‌కు ఎక్క‌డికో వెళ్లిన వీడియోలో అప్‌లోడ్ చేయొచ్చు. వీటిని బేస్ చేసెకుని వెబ్‌పేజీలు క్రియేట్ చేస్తారు.  కంప్యూట‌ర్ దీని ద్వారా ప‌ర్స‌న్ ఇన్‌కం ఎంతుంటుందో అన‌లైజ్ చేసి సీబీడీటీకి పంపిస్తుంది. దీన్ని బ‌ట్టి అత‌ను ఇన్‌కం ట్యాక్స్ క‌ట్టాడో లేదా ఆరా తీస్తారు. కట్ట‌క‌పోతే ఇవే సాక్ష్యాలుగా నోటీసులిస్తారు. 

జన రంజకమైన వార్తలు