• తాజా వార్తలు
  •  

ట్విట్ట‌ర్ చేయ‌లేని ప‌నుల్ని ఈ కాలేజీ కుర్రాళ్లు ఎలా చేస్తున్నారు? 

సెల‌బ్రిటీలంద‌రూ త‌ప్ప‌క వాడే సామాజిక మాధ్య‌మం  ట్విట్ట‌ర్.  ఫేస్‌బుక్ అంత కాక‌పోయినా  దీనిలో కూడా చాలా లూప్ హోల్స్ ఉన్నాయి.  ట్వీట్ చేస్తున్న  అస‌లు వ్య‌క్తి ఎవ‌ర‌న్న‌ది క‌చ్చితంగా తెలుసుకోలేం. ఎందుకంటే ట్విట్ట‌ర్ అకౌంట్ ప్రారంభించాలంటే ఫోన్ నెంబ‌ర్ ఉంటే చాలు.   అందుకే సెల‌బ్రిటీల పేరు మీద కూడా ఫేక్ ట్విట్ట‌ర్ అకౌంట్లు కనిపిస్తుంటాయి.  ప్ర‌ధాన‌మంత్రులు, దేశాధినేతలు కూడా ప్ర‌జ‌ల‌తో ట‌చ్‌లో ఉండ‌డానికి ఫేస్‌బుక్‌నే సాధ‌నంగా వాడుకుంటున్నారు. మ‌న మోడీ, అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌.. ఇలా ట్వీట్ తార‌ల జాబితా త‌క్కువేమీ లేదు. కానీ  ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్రాపగాండా చేయ‌డం, నెగిటివ్ కామెంట్లు పెట్ట‌డం వంటివి కంట్రోల్ చేయ‌డంలో ట్విట్ట‌ర్  స‌క్సెస్ కాలేక‌పోతోంది. అలాంటిది ఓ ఇద్ద‌రు కాలేజీ కుర్రాళ్లు ట్వీట్లు చేస్తున్న‌ది మ‌నిషా లేదంటే బోట్ల‌ను పెట్టి కావాల‌ని వ్య‌తిరేక ప్ర‌చారం చేస్తున్నారా అని ప‌సిగ‌ట్టే మెథ‌డ్ కనిపెట్టారు.
గూగుల్ క్రోమ్ బ్రౌజ‌ర్ ఎక్స్‌టెన్ష‌న్‌తో..
అమెరికాలోని బ‌ర్క్‌లీ కాలేజ్ స్టూడెంట్స్ య‌ష్ భ‌ట్‌, రోహ‌న్ ప‌డ్తే దీనికి ప‌రిష్కారం క‌నిపెట్టారు.  వీళ్లు ఒక గూగుల్ క్రోమ్ బ్రౌజ‌ర్ ఎక్స్‌టెన్ష‌న్ ను లాంచ్ చేశారు. దీనిలో ఉండే ఓ బ‌ట‌న్ మీరు ఓపెన్ చేసిన ట్విట్ట‌ర్ ప్రొఫైల్‌ను, ట్వీట్ల‌ను రీడ్ చేస్తుంది. అప్పుడు Botcheck.me. అనే ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే మొత్తం ఆ ట్విట్ట‌ర్ అకౌంట్‌ను డయాగ్నైజ్ చేసి అది వ్య‌క్తులు  ర‌న్ చేస్తున్నారా లేక బోట్ లేదా ఏదైనా ఆటోమేష‌న్‌తో ర‌న్ అవుతుందా తేల్చి చెప్పేస్తుంది.  అమెరికా రాజకీయాల్లో ట్విట్ట‌ర్‌కు చాలా ప్రాధాన్యం ఉంది. అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీప‌డేవారు సైతం ట్విట్ట‌ర్ వేదిక‌గానే త‌మ వాయిస్ వినిపిస్తుంటారు.  ఇటీవ‌ల‌ జరిగిన అమెరికా ఎన్నిక‌ల్లో అమెరికా చిర‌కాల ప్ర‌త్య‌ర్థి అయిన ర‌ష్యా స‌పోర్ట్ ఉందంటూ కాండేట్లు విమ‌ర్శ‌లు చేసుకున్నారు. అలా అమెరిక‌న్ల‌లో విష‌బీజాలు నాటేందుకు  ర‌ష్యా నుంచి బోట్స్ ఆప‌రేట్ చేస్తున్న‌ట్విట్ట‌ర్ అకౌంట్లు చాలా ఉన్నాయ‌ని ఇంటిలిజెన్స్ ఏజెన్సీలు చెబుతున్నాయి. అలాంటి వాటిని క‌నుక్కునేందుకు భ‌ట్‌, ప‌డ్తే ఈ ఎక్సెటెన్ష‌న్‌ను త‌యారు చేశారు.  @PatriotJen అని ట్రంప్ ట్వీట్ల మీద ట్వీట్లు చేసే ఓ ట్విట్ట‌ర్ అకౌంట్‌ను ర‌ష్యా బేస్డ్ బోట్సే న‌డుపుతున్నాయ‌ని వీళ్లు దీని ద్వారా ప్రూవ్ చేశారు.  దీంతోపాటు బోట్స్ న‌డిపే ట్విట్ట‌ర్ అకౌంట్‌ను గుర్తించి ఫేక్ ఏంటో తేల్చ‌డానికి ఒక వెబ్‌సైట్‌నే ర‌న్ చేస్తారు. కొన్ని వంద‌ల అకౌంట్ల‌ను వారు ఇలాంటివి ప్రూవ్ చేశారు. 
ట్విట్ట‌ర్ ఎందుకు చేయ‌లేక‌పోతోంది? 
ట్విట్ట‌ర్ కూడా దీనిపైన  దృష్టిపెట్టింది.  వంద‌ల కొద్దీ అకౌంట్ల‌ను ఫేక్‌గా గుర్తించి తొల‌గించింది. అయితే మొత్తం అకౌంట్ల‌లో 5% మించి బోట్స్ న‌డిపేవి లేదా ఆటోమేటెడ్‌వి ఉండ‌వ‌ని ట్విట్ట‌ర్ వాదిస్తోంది. కానీ వాస్త‌వానికి 50%  కంటే ఎక్కువే ఉంటాయ‌ని రీసెర్చ‌ర్స్ చెబుతున్నారు. అయితే ఇదంతా ప్రోప‌గాండా అని, ఇలాంటి న‌కిలీ ట్విట్ట‌ర్ అకౌంట్ల‌ను గుర్తించ‌డానికి త‌మకంటే బ‌య‌టి వ్య‌క్తులు వాడే మెథ‌డ్స్ కాద‌ని ట్విట్ట‌ర్ వాదిస్తోంది. గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోకుండా ఇలా అడ్డగోలుగా వాదించ‌డం వ‌ల్ల ట్విట్ట‌ర్ వీటిని క‌నిపెట్ట‌డంలో యాక్టివ్‌గా ముందుకు వెళ్ల‌లేక‌పోతుంద‌ని రీసెర్చ‌ర్స్  అంటున్నారు.  
 

జన రంజకమైన వార్తలు