ట్విటర్ అకౌంట్ ఓపెన్ చేయగానే మనకు ప్రొఫైల్‌లో ఒక లోగో కనిపిస్తుంది. కోడుగుడ్డు ఆకారంలో ఉండే లోగోలో మనం ఫొటో అమర్చుకుని ఫ్రొఫైల్ పిక్చర్‌గా వాడుకోవచ్చు దాదాపు ట్విటర్ ఆరంభం అయిన నాటి నుంచి ఆ లోగోను అలాగే కొనసాగిస్తున్నారు. కానీ చాన్నాళ్ల తర్వాత ఆ కోడిగుడ్డు లోగోను మార్చారని ట్విటర్ నిర్ణయించుకుంది. 2010 నుంచి ఈ కోడిగుడ్డు ఆకారాన్ని కొనసాగిస్తున్న ఈ మైక్రో బ్లాగింగ్ కంపెనీ మనిషి ఆకారాన్ని పోలిన లోగోతో భర్తీ చేయాలని భావిస్తోంది. ఫేస్బుక్ తరహాలో ప్రొపైల్ పిక్‌ను రూపొందించి వినియోగదారులను ఆకట్టుకోవాలనేది ట్విటర్ ప్రయత్నం. ఇకపై ట్విటర్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ప్రొఫైల్ పిక్చర్ ఆప్షన్ ఉన్న చోట మన ఫొటోని డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు. ట్విటర్ వినియోగదారులకు ఒక కొత్త అనుభూతిని తీసుకు రావడం కోసమే లోగోను మార్చినట్లు ట్విటర్ తెలిపింది.
ట్విటర్ కోడిగుడ్డు ఆకారంలో ప్రొఫైల్ పిక్చర్‌ను డిజైన్ చేయడం వెనుక ఒక కథ ఉంది. అది ఏంటంటే కోడిగుడ్డు ఆకారంలో ఉండే పిక్చర్ ట్వీట్ల రూపంలో పిల్లలను పొదుగుతుంది అనేది సారాంశం. అందుకే ఈ లోగోను మార్చడానికి ట్విటర్ అంత త్వరగా ఇష్టపడలేదు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా తాము కూడా సైట్లో మార్పులు చేయలని ఆ సంస్థ నిర్ణయించుకుంది. కేవలం ప్రొపైల్ పిక్చర్ మాత్రమే కాదు పదాలపై ఉన్న ఆంక్షలను కూడా సడలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అనవసర ట్విటర్ ట్రోలింగ్ నుంచి వినియోగదారులకు రక్షణ కల్పించేందుకు కూడా ఆ సంస్థ కొత్త మార్పులు చేస్తోంది. ఫేక్ అకౌంట్లను నియంత్రించడానికి నిబంధనలను కఠినతరం చేస్తోంది.