• తాజా వార్తలు

మాన్‌సూన్ కోసం గొడుగు ఎమోజీ విడుద‌ల చేసిన ట్విట‌ర్‌

టెక్ ప్ర‌పంచంంలో వ‌స్తున్న మార్పుల‌ను బట్టి, వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌లో తాను మార్పు చేర్పులు చేసుకోవ‌డంలో సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ట్విట‌ర్ ముందుంటుంది. ఐపీఎల్ జ‌రుగుతున్న‌ప్పుడు వివిధ జ‌ట్ల‌కు సంబంధించిన ప్ర‌ధాన స్టార్ల ఎమోజీల‌ను విడుద‌ల చేసిన ట్విట‌ర్ తాజాగా మ‌రో ఎమోజీని విడుదుల చేసింది. మాన్‌సూన్ కావ‌డంతో గొడుగు ఎమోజీని ట్విట‌ర్ విడుద‌ల చేసింది. వానా కాలాన్ని, వాన‌ను సూచించేందుకు ఇక‌పై వినియోగ‌దారులు ఈ ఎమోజీల‌ను వాడొచ్చ‌ని ట్విట‌ర్ తెలిపింది. నీలం రంగు ఆకారంలో ఉన్న ఈ అంబ‌రిల్లా ఎమోజీలు అంద‌ర్ని విశేషంగా ఆక‌ట్ట‌కుంటున్నాయి.

ఆగ‌స్టు 31 వ‌ర‌కు యాక్టివ్‌గా..
ట్విట‌ర్ కొత్త‌గా ప్ర‌వేశ‌పెట్టిన గొడుగు ఎమోజీలు జూన్ 16 నుంచి ఆగ‌స్టు 31 వ‌ర‌కు యాక్టివ్‌గా ఉండ‌నున్నాయి. మాన్‌సూన్‌ను సెల‌బ్రెట్ చేయ‌డం కోస‌మే తాము ఈ కొత్త ఎమోజీల‌ను ప్ర‌వేశ‌పెట్టిన‌ట్లు.. ఇవి వాడ‌డంలో వినియోగ‌దారులు క‌చ్చితంగా ఆనందాన్ని పొందుతార‌ని ఆ సంస్థ వెల్ల‌డించింది. మంచి సంభాష‌ణ‌ల్లో ఇలాంటి ఎమోజీలు ఫ‌న్‌ను క్రియేట్ చేస్తాయ‌ని ట్విట‌ర్ చెప్పింది. మాన్‌సూన్‌2017, ఇండియారైన్స్‌, బారిష్‌, ముంబ‌యిరెయిన్స్‌, దిల్లీరెయిన్స్‌, బెంగ‌ళూరురెయిన్స్‌, హైద‌రాబాద్‌రెయిన్స్ ఇలా హాష్‌ట్యాగ్ పెట్టి ట్విట్ చేసేట‌ప్పుడు హాష్‌ట్యాగ్ ప‌క్క‌నే బ్లూ అంబ‌రిల్లా గుర్తు క‌నిపిస్తుంది.

సెల‌బ్రెష‌న్ టైమ్‌
మాన్‌సూన్‌కు మాత్ర‌మే కాదు ట్విట‌ర్ చాలా సంద‌ర్భాల్లో ఇలా ఎమోజీల‌ను సృష్టించి అభిమానుల కోసం అన్‌వీల్ చేసింది. దివాలీ, గ‌ణేశ్ చ‌తుర్థి, ఇండిపెండెన్స్ డే, రిప‌బ్లిక్ డే, ఇంట‌ర్నేష‌న‌ల్ యోగా డే, అంబేద్క‌ర్ జ‌యంతి ఇలా సెల‌బ్రేష‌న్ స‌మ‌యాల్లో ట్విటర్ ప్ర‌త్యేక ఎమోజీల‌ను రూపొందించి విడుద‌ల చేసింది. సాధార‌ణంగా పండ‌గ‌లు, ఇత‌ర ముఖ్య‌మైన దినోత్స‌వాల‌ప్పుడు మాత్ర‌మే గతంలో ఎమోజీల‌ను విడుద‌ల చేసిన ట్విట‌ర్‌.. తొలిసారిగా వాతావ‌ర‌ణం గురించి ఒక ఎమోజీని విడుద‌ల చేసింది. త్వ‌ర‌లో వాతావ‌ర‌ణానికి సంబంధించిన మ‌రిన్ని ఎమోజీలు రానున్న‌ట్లు ట్విట‌ర్ తెలిపింది. ఎండాకాలం, వింట‌ర్ సీజ‌న్‌ల‌కు సంబంధించిన ఎమోజీలు కూడా వ‌స్తే ట్విట‌ర్ వినియోగ‌దారుల‌కు పండ‌గే.

జన రంజకమైన వార్తలు