• తాజా వార్తలు

వెరైటీగా ట్వీట్స్ చేసి అవార్డులు కొట్టేసిన యూఎస్ పోలీస్‌

మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్ట‌ర్‌ను మ‌న ద‌గ్గ‌ర సెల‌బ్రిటీలే ఎక్కువ వాడుతున్నారు. కానీ యూఎస్‌, యూకే లాంటి దేశాల్లో ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కూడా ట్విట్ట‌ర్ అకౌంట్ మెయింటెయిన్ చేస్తారు. వీళ్ల‌కు పోలీసు ట్విట్ట‌ర్ అవార్డులు కూడా ఇస్తారు. ఇదో యూకే బేస్డ్ కాంపిటీష‌న్‌.  దీనిలో గార్డ్‌న‌ర్ అనే పోలీస్ ఆఫీస‌ర్  అవార్డ్ సాధించేశాడు. అత‌ను ట్వీట్ చేసిన‌వ‌న్నీవెరైటీ ట్వీట్సే. 
శీతాకాలం వ‌చ్చింది.. వెహిక‌ల్ జాగ్ర‌త్త‌
@TrooperBenKHP ప్రొఫైల్ నేమ్‌తో గార్డ్‌న‌ర్  ట్వీట్స్ చేస్తుంటాడు. Look around your ride! పేరుతో అత‌ను చేసిన ఓ ట్వీట్ చూస్తే చాలా ఫ‌న్నీగా ఉంటుంది. ఓ కారు మీద ఓ పెద్ద ఆవు కూర్చుని ఉన్న ఫొటో అది.  శీతాకాలం వ‌చ్చేసింది. జంతువులు వెచ్చ‌ద‌నం కోసం మీ వాహ‌నాలను వాడేసుకుంటాయి. కాస్త చూసుకోండి అని దాని కింద ట్యాగ్ లైన్‌తో గార్డ్‌న‌ర్ చేసిన ట్వీట్‌కు సూప‌ర్ రెస్పాన్స్ వ‌చ్చింది. అస‌లు అత‌ను చేసేవ‌న్నీ ఇలాంటి ట్వీట్సేన‌ని, అందుకే గార్డ్‌న‌ర్‌కు ట్విట్ట‌ర్‌లో ఏకంగా 32వేల మంది ఫాలోయ‌ర్స్ ఉన్నార‌ని అవార్డు క‌మిటీ చెప్పింది. అందుకే బెస్ట్ ఇంట‌ర్నేష‌న‌ల్ ట్విట్ట‌ర్ అకౌంట్‌గా అత‌ని ట్విట్ట‌ర్ అకౌంట్‌కు అవార్డు కూడా ప్ర‌క‌టించేసింది.

 ప్ర‌జ‌ల‌తో రిలేష‌న్స్ మెయిన్‌టెన్ చేయ‌డానికి

 ప్ర‌జ‌ల‌తో రిలేష‌న్స్ మెయిన్‌టెన్ చేయ‌డానికి ట్విట్ట‌ర్ త‌న‌కు బాగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని, అందుకే ఇలా ఫ‌న్నీ ట్వీట్స్‌తోనే ఇన్ఫ‌ర్మేషన్ పాస్ చేస్తుంటాన‌ని గార్డ్‌న‌ర్ చెప్పారు. అత‌నితో పాటుప‌ని చేస్తున్న మ‌రో ఇద్ద‌రు పోలీసుల‌కు కూడా అవార్డుల వ‌చ్చాయి.

జన రంజకమైన వార్తలు