స్మార్ట్‌ఫోన్, డేటా కనెక్షన్ ఉంటే చాలు వాట్సాప్‌ను మించిన సమాచార సాధనం లేదు.. అనేంతంగా అల్లుకుపోయింది. దీనికి ఉన్న సీన్ చూసే ఫేస్బుక్ దాన్ని కొనేసింది. ఆ తర్వాత వారానికో కొత్త ఫీచర్‌తో వాట్సాప్‌ను ఎప్పటికప్పుడు అప్టు డేట్‌గా మారుస్తూ యూజర్లకు అందిస్తోంది. వాయిస్, వీడియో కాలింగ్, స్టేటస్, ఫొటో బండ్లింగ్, ఎనీఫైల్ సెండింగ్.. ఇలా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు తెస్తున్నా ఇంకా వాట్సాప్ కొన్ని విషయాల్లో వెనకబడే ఉందని తెలుసా? వాట్సాప్ మాదిరిగానే ఉండే టెలిగ్రామ్, గూగుల్ అల్లో, హైక్, వీచాట్ వంటి మెసెంజర్ యాప్‌ల్లో ఉండి వాట్సాప్‌లో లేని కొన్ని ఫీచర్ల గురించి తెలుసుకోండి.
1. స్టిక్కర్స్
వాట్సాప్‌లో ఎమోటికాన్స్ ఉన్నాయి. థంబ్ సింబల్, స్మైలీ లాంటివి ఎమోటికాన్స్ మనందరికీ తెలుసు. కానీ ఫేస్బుక్ మెసెంజర్, వైబర్, హైక్ లలో ఉన్నట్లు చాటింగ్ ను మరింత ఇంట్రస్ట్‌గా మార్చే స్టిక్కర్స్ ఫీచర్ వాట్సాప్ లో లేదు.
2. జిఫ్ సెల్ఫీ
సెల్ఫీల కాలం దాటిపోయింది. వాటి స్థానంలో చాలామంది ఇప్పటికే గూగుల్ అల్లోలో ఉన్న జిఫ్ సెల్ఫీ ఫీచర్‌ను వాడుతున్నారు. మన ఫోన్ ఫ్రంట్ కెమెరాతో ఇమేజ్ లేదా చిన్న వీడియో తీసి దానికి జిఫ్ యాడ్ చేయొచ్చు. ఇది యాప్‌లోనే బిల్ట్ ఇన్ ఫీచర్. అల్లోలో ఉన్న ఈ ఫీచర్ వాట్సాప్‌లో ఇంకా రాలేదు.
3. ప్రైవేట్ చాట్
ఎవరితోనైనా కన్వర్షన్‌ను ఎవరికీ కనపడకుండా రహస్యంగా ఉంచాలంటే ఇన్కాగ్నిట్ లేదా ప్రైవేట్ చాట్ మోడ్ చాలా మెసెంజర్ యాప్‌ల్లో ఉంటుంది. లైన్, వీచాట్,అల్లోల్లో ఉన్న ఈ ఫీచర్ మెసేజ్‌ను రీడ్ చేయగానే ఆటోమేటిగ్గా డిటలీట్ చేస్తుంది. వాట్సాప్ యూజర్లకు ఇంకా అందుబాటులోకి రాలేదు. కాబట్టి వాట్సాప్‌లో చాటింగ్‌ను మనం హైడ్ చేసే ఆప్షన్ లేదు.
4. పోక్ ఈచ్ అదర్
ఈ ఫీచర్‌ను మీరు ఫేస్బుక్లో కూడా చూసి ఉంటారు. ఎవర్నయినా పలకరించడానికి ఇదో ఆప్షన్. దీనితో మెసేజ్ పెట్టకుండా పోక్ సింబల్‌ను క్లిక్ చేస్తే ఫలానా వ్యక్తి మిమ్మల్ని పోక్ చేశారని యాప్ మనకు చూపిస్తుంది. ఈ ఫీచర్ కూడా వాట్సాప్‌లో లేదు.
5. వాలెట్
ఇప్పటికే చాలా మెసేజింగ్ యాప్‌లు ఇన్ యాప్ వాలెట్ సర్వీస్‌ను ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. హైక్ మెసెంజర్ మరో అడుగు ముందుకేసి గత నెలలోనే వాలెట్‌ను ప్రవేశపెట్టింది. ఇది ఇండియన్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) బేస్డ్గా పని చేస్తుంది. బ్యాంక్ నుంచి బ్యాంక్‌కు మనీ ట్రాన్స్ఫర్ ఫ్రీగా చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌లోనూ వాట్సాప్ వెనకబడింది.
6. లైవ్ ఫిల్టర్స్
ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ల్లో లైవ్ఫిల్టర్స్ బాగా పాపులర్. ఇమేజ్ను తీస్తున్నప్పుడే దాన్ని ఎడిట్ చేయొచ్చు. వాట్సాప్ కూడా ఏదైనా ఫైల్ సెండ్ చేసేటప్పుడు వాటిని డూడుల్స్, టెక్స్ట్, ఎమోటికాన్స్ యాడ్ చేసే ఫీచర్ తెచ్చినా అవి లైవ్ ఫిల్టర్స్ అంత ఎఫెక్టివ్ గా లేవు.
7. ఆటో రిప్లై
మీరు చాలా బిజీగా ఉండి అవతలి వ్యక్తితో చాట్ చేయడానికి అవకాశం లేనప్పుడు ఆటో రిప్లై ఇచ్చే ఫీచర్ ఫేస్బుక్ మెసెంజర్, అల్లో వంటి వాటిలో ఉంది. మీ ఫ్రెండ్‌కు క్వశ్చన్ అడిగితే యాప్ ఆటోమేటిగ్గా దానికి ఆన్సర్ రడీ చేస్తుంది. మీరు క్లిక్ చేస్తే వాళ్లకు సెండ్ అవుతుంది. ఈ ఫీచర్ కూడా వాట్సాప్‌లో లేదు.