• తాజా వార్తలు

త్వరలో వాట్సాప్ లోనే యూట్యూబ్ వీడియోలు చూసేయొచ్చు

    వాట్సాప్ లో యూట్యూబ్ వీడియోలను నేరుగా చూడడం కుదరదన్న సంగతి తెలిసిందే కదా.. అయితే ఐఫోన్ 2.17.40 వెర్షన్ యాప్ లో యూట్యూబ్ ప్లే బ్యాక్ సపోర్టు వస్తోంది. ప్రస్తుతం బీటా వెర్షన్లో ఉంది. ఇంకా... పబ్లిక్ యూసేజ్ కు అందుబాటులోకి రాలేదు. 
    ప్రస్తుతం ఈ ఫీచర్ ప్రయోగాల దశలో ఉందని WABetaInfo వెల్లడించింది. ఈ ఫీచర్ వాట్సాప్ లో యూట్యూబ్ వీడియలోను పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్ లో చూసుకోవడానికి వీలు కల్పిస్తుంది.  ఒకవేళ అదేసమయంలో వాట్సాప్ చాట్ చేస్తుండే వీడియోను సైడ్ ప్యానెల్ లో హైడ్ చేయొచ్చు. అయితే.. ఛాట్ చేంజ్ అయితే వీడియో ప్లేబ్యాక్ సపోర్టు ఉండదు.
ఐఫోన్ 6, ఆ తరువాత మోడళ్లకే..
    అయితే.. ఈ ఫీచర్ ఐఫోన్ 6, ఆ తరువాత మోడళ్లలోనే ఉంటుంది. తొలుత ఐ ఓఎస్ లో రానున్న ఈ ఫీచర్ ఆ తరువాత ఆండ్రాయిడ్ లోనూ రానుంది. ఒక వేళ ఈ ఫీచర్ తో ఇబ్బందులేమైనా ఉన్నట్లు గుర్తిస్తే తప్ప లేదంటే త్వరలో ఇది అందుబాటులోకి రావడం ఖాయం.

జన రంజకమైన వార్తలు