• తాజా వార్తలు
  •  

ట్విట్టర్ ద్వారా డ్రంక్ అండ్ డ్రైవ్ ను వినూత్నంగా టార్గెట్ చేస్తున్న ఢిల్లీ పోలీస్

“ మద్యపానం ఆరోగ్యానికి హానికరం , దయ చేసి మద్యం సేవించి డ్రైవింగ్ చేయకండి” ఇలాంటి స్లోగన్ లు ఎన్ని ఇచ్చినా మందుబాబులు మాట వినడం లేదని చిర్రెత్తుకొచ్చిన ఢిల్లీ పోలీస్ డిపార్టుమెంటు ఒక వినూత్న తరహాలో ఆలోచించింది. మద్యం సేవించి డ్రైవింగ్ చేసే వారికి అవగాహన కల్పించడానికి ట్విట్టర్ ను వేదికగా ఉపయోగించుకుంటుంది. ఢిల్లీ పోలీస్ డిపార్టుమెంటు యొక్క అఫీషియల్ ట్విట్టర్ ఎకౌంటు ద్వారా మద్యపానానికి వ్యతిరేకంగా ప్రేరేపించే పోస్టులను పోస్ట్ చేయడం ద్వారా ఒక వినూత్న పంథా కు శ్రీకారం చుట్టింది. గత కొన్ని రోజుల నుండి ఢిల్లీ పోలీసుల ట్విట్టర్ ఖాతా నుండి వెలువడుతున్న ట్వీట్ లు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. అవేంటో మనం కూడా చూద్దాం రండి.

డిసెంబర్ 26

ఢిల్లీ పోలీసుల అధికారిక ట్విట్టర్ ఎకౌంటు ఒక కలర్ ఫుల్ ఇమేజ్ ను పోస్ట్ చేసింది. చూడగానే ఆకట్టుకునే రీతిలో ఉన్న ఆ పోస్ట్ లో ఒక ట్రక్ వెనుకవైపు “ మత్ లగావో రోడ్ పే రేస్ , యాక్సిడెంట్ మే బిగ్డేగా ఫేస్ “ అని రాసి ఉంది. దీని అర్థo “ రోడ్ పై రేస్ పెట్టుకోవద్దు , ప్రమాదం జరిగితే గాయపడతారు “ అని.  తాత్కాలిక ఆనందం కోసం మీ జీవితాన్ని ఫణంగా పెట్టొద్దు, అతివేగంగా డ్రైవ్ చేయవద్దు అని కూడా పోస్ట్ చేసింది.

తర్వాతి రోజు

వెంటనే మరుసటి రోజు డ్రంక్ అండ్ డ్రైవింగ్ కు వ్యతిరేకంగా మరొక ఇమేజ్ ను పోస్ట్ చేసింది. ఈ ఇమేజ్ లో “దారూ పే హై భారీ, తో లో క్యాబ్ కీ సవారీ “ అని ఉన్నది. ఎక్కువ ఆల్కహాల్ తీసుకున్నారా? అయితే క్యాబ్ ను వాడండి అని దీని అర్థం. పార్టీ లలో ఫుల్ గా మందు కొట్టి డ్రైవింగ్ చేయవద్దు, దానికి బదులుగా క్యాబ్ లో వెళ్ళండి అని ఎంతో చక్కగా పోస్ట్ చేసారు.

మరుసటి రోజు

ఈ పోస్ట్ ల పరంపర మరుసటి రోజు కూడా కొనసాగింది. మరొక ఆసక్తికరమైన ఇమేజ్ లో “ పార్టీ కి వెళ్తున్నారా అయితే మీ వాహనాలు ఇంటి దగ్గరే ఉంచి వెళ్ళండి అని అర్థం వచ్చేలా   ప్లాన్ హై దారూ చక్నా తో గాడీ ఘర్ హై రక్నా  అంటూ  మరొక ఇమేజ్ ను పోస్ట్ చేసింది.

ఈ మూడు పోస్ట్ లను ఒకసారి గమనించినట్లైతే మనకు కొన్ని ఆసక్తికరమైన విషయాలు కనిపిస్తాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ ను ఎలాగైనా సరే అరికట్టాలి అనే ఢిల్లీ పోలీసుల తపనను మనం గమనించవచ్చు. ప్రతీ పోస్ట్ లో కూడా ఢిల్లీ పోలీసుల హెల్ప్ లైన్ నెంబర్ అయిన 1095 ను కూడా మనం చూడవచ్చు. ఇక ఈ పోస్ట్ ల పట్ల పబ్లిక్ లో అనూహ్యమైన స్పందను ను కూడా ఇక్కడ మనం చూడవచ్చు. లక్షల సంఖ్య లో లైక్ లు మరియు రీ ట్వీట్ లను ఇక్కడ మనం గమనించవచ్చు. అంటే ఢిల్లీ పబ్లిక్ ఈ పోస్ట్ ల పట్ల ఎంత ఆకర్షితులు అయ్యారో తెలుసుకోవచ్చు. మరి వీటిని ఎంత మంది ఆచరిస్తారు అనే విషయం పై ఈ కార్యక్రమం యొక్క విజయం ఆధారపడి ఉంది,

 

జన రంజకమైన వార్తలు