• తాజా వార్తలు
  •  

ఫొటోలు తీసేట‌ప్ప‌డు లొకేష‌న్ ఎనేబుల్  చేయ‌డంలో ఉన్న మంచీ చెడూ 

 మీ స్మార్ట్‌ఫోన్‌లో ఫొటోలు తీస్తున్నారా?  అయితే గూగుల్ ఫొటోస్‌లో  జియో లొకేష‌న్ ఆన్ అయి ఉందేమో చూసుకోండి..  ఎందుకంటే జియో లొకేష‌న్ ఫీచ‌ర్ సోష‌ల్ నెట్‌వ‌ర్క్‌తో క‌నెక్ట్ అవుతుంది. కాబట్టి దీంతో మంచి ఎంతుందో చెడు కూడా అంతే ఉంది. 
 ఫొటోస్ కి జియో లొకేష‌న్ ఎనేబుల్ చేయ‌డం వ‌ల్ల లాభాలు 
* మీరు ఎక్క‌డున్నారో క‌చ్చితంగా అవ‌త‌లి వ్య‌క్తికి చెప్పాల‌నుకున్న‌ప్పుడు ఈ ఫీచ‌ర్ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది.  
* ఏదైనా ప్లేస్ గురించి  డైరెక్ష‌న్స్  ఇవ్వాల‌నుకున్న‌ప్పుడు జియో టాగింగ్ చేసిన ఫొటో అయితే లొకేష‌న్ చాలా ఈజీగా ట్రేస్ అవుట్ చేయొచ్చు. 
అవత‌లి ప‌ర్స‌న్ జీపీఎస్ డేటా ద్వారా డైరెక్ష‌న్ మాత్ర‌మే కాదు.. రీచ్ కావాల్సిన ప్లేస్‌కు సంబంధించిన క్లియ‌ర్ పిక్చ‌ర్ జియో లొకేటెడ్ ఫొటో ద్వారా అందుకుంటారు.  
* బిజినెస్ అడ్వ‌ర్టైజింగ్‌కు ఈ ఫీచ‌ర్ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. జియోటాగ్డ్ ఫొటోస్‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఆ ప్రొడ‌క్ట్‌, స‌ర్వీస్ న‌చ్చిన‌వాళ్లు నేరుగా ఆ ప్లేస్‌కు రావ‌డానికి ఈ జియోలొకేష‌న్ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది.  
న‌ష్టాలు కూడా 
* మీరు ఫొటో ఎక్క‌డ తీసుకున్నారో పిన్‌పాయింటెడ్‌గా చెప్పేస్తుంది. ఇది మీ ప్రైవ‌సీని దెబ్బ‌తీస్తుంది. మిమ్మ‌ల్ని ట్రాక్ చేసే అవ‌కాశం ఇస్తుంది. ముఖ్యంగా లేడీస్ విష‌యంలో ఇది సెక్యూరిటీ ప్రాబ్ల‌మ్‌గా మారుతుంది. 
* సెల‌బ్రిటీస్ విష‌యంలో ఇది మ‌రింత ఇబ్బంది.  ఫ్యాన్స్ త‌మ ఫేవరెట్ యాక్ట‌ర్‌, ప్లేయ‌ర్‌, రైట‌ర్‌, లీడ‌ర్ లాంటి వారు ఎక్క‌డున్నారో  తెలుసుకుని అక్క‌డికి వ‌చ్చేస్తే వాళ్ల ప్రైవ‌సీ దెబ్బ‌తింటుంది. అందుకే హ్యారీపోట‌ర్ ఫేమ్ ఎమ్మా వాట్స‌న్ ఫాన్స్ త‌న‌ను సెల్ఫీ తీయ‌డానికి కూడా ఒప్పుకోదు. తాను ఎక్క‌డున్నానో జియో లొకేష‌న్ ద్వారా తెలుసుకుంటే ఫ్యాన్స్ అంతా అక్క‌డికి వ‌చ్చి ప్రైవ‌సీ దెబ్బ తీస్తార‌ని ఆమె భ‌యం. లీడ‌ర్స్ కూడా ఇంత పిన్‌పాయింటెడ్‌గా ఎక్క‌డున్నారో తెలిస్తే టెర్ర‌రిస్ట్‌ల వంటి వారు ఎటాక్ చేసే ప్ర‌మాదం ఎక్కువ‌గా ఉంటుందట‌. 
* మీరు వెకేష‌న్‌లో ఉండ‌గా తీసిన ఫొటో షేర్ అయితే జియోలొకేష‌న్ బ‌ట్టి మీరు ఎక్క‌డున్నారో అర్ధ‌మ‌వుతుంది.  మీరు ఇంట్లో లేర‌ని తెలిస్తే దొంగ‌లు మీ ఇంటిమీద ప‌డే ప్ర‌మాదం ఉంద‌ట‌. ఇలాంటి డేటాను ఉప‌యోగించుకుని అమెరికాలో చాలా దొంగ‌త‌నాలు జ‌రుగుతున్నాయి. 
* మీరు ఎవాయిడ్ చేయాల‌నుకున్న వ్య‌క్తుల‌కు కూడా మీరెక్క‌డున్నారో తెలిస్తే అది ఇబ్బందే క‌దా..  
ఫైన‌ల్‌గా చెప్పేదేమిటంటే మీరు ఎక్క‌డున్నారో, ఏ ఫొటో ఎక్క‌డ తీసుకున్నారో షేర్ చేసుకోవాల‌నుకుని మీరు అనుకుంటేనే త‌ప్ప గూగుల్ ఫొటోస్‌లో ఉన్న జియోలొకేష‌న్ ఆఫ్‌లో ఉంచ‌డ‌మే  బెట‌ర్‌.  
 

జన రంజకమైన వార్తలు