• తాజా వార్తలు
  •  

వాట్సాప్ చేయలేని ఆ పనిని హైక్ చేసింది

వాట్సాప్ ప్రపంచాన్ని ఎలా ఆకట్టుకుందో తెలుసు కదా. నిత్యం కొత్త కొత్త ఫీచర్లతో యూజర్లలో ఉన్న ఆ క్రేజ్ ను అలాగే పట్టిం ఉంచుతున్న వాట్సాప్ కు ఇండియాలో త్వరలో గట్టి పోటీ తప్పేలా లేదు. ఇండియన్ మెసేజింగ్ యాప్ హైప్ శరవేగంగా విస్తరిస్తుండడం.. పైగా వాట్సాప్ లో లేని ఎన్నో కొత్త ఫీచర్లను యాడ్ చేసకుంటూ పోతుండడంతో ఇండియా వరకు వాట్సాప్ కు గట్టి పోటీ ఎదురయ్యే పరిస్థతులు కనిపిస్తున్నాయి.
వాట్సాప్ పేమెంట్స్ ఫీచర్ ను యాడ్ చేయకముందే, హైక్ తన ప్లాట్ ఫామ్ పై ఈ పేమెంట్స్ ఫీచర్ ను లాంచ్ చేసింది. ఈ ఫీచర్ తో 10 కోట్లకు పైగా ఉన్న తమ యూజర్లు, హైక్ ద్వారానే నగదు ట్రాన్స్ ఫర్స్, మొబైల్ బిల్స్ చెల్లించడం, రీఛార్జ్ చేసుకోవడం వంటి చేయవచ్చని కంపెనీ తెలిపింది. యూపీఐ ద్వారా ఉచితంగా, వెనువెంటనే బ్యాంకు నుంచి బ్యాంకుకు ట్రాన్స్ ఫర్లు, ఎలాంటి బ్యాంకు అకౌంట్లు లేకుండా వాలెట్ నుంచి వాలెట్ కు తక్షణ నగదు ట్రాన్స్ ఫర్ వంటివి చేసుకోవచ్చని హైక్ మెసెంజర్ వ్యవస్థాపకుడు, సీఈవో కవిన్ భారతి మిట్టల్ చెప్పారు.
రీచార్జి కూడా చేసుకోవచ్చు
ఇంకో విషయం ఏంటంటే హైక్ యాప్ నుంచి రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు. గత ఆరు నెలలుగా తమ యూజర్లకు కొత్త అనుభవాన్ని అందించడం కోసం ఎంతో తాపత్రయపడ్డామని కంపెనీ అంటోంది.
ఇండియాలో ఇదే ఫస్ట్ టైం
కాగా భారత్ లో మెసేజింగ్ ప్లాట్ ఫామ్ పై పేమెంట్ సౌకర్యాన్ని తీసుకొచ్చిన తొలి యాప్ హైక్ ఒక్కటే. దీంతో పాటు యాప్ కెమెరాకు కొత్త ఫీచర్లను యాడ్ చేశారు.
కాగా మరోవైపు హైక్ కు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న వాట్సాప్ డిజిటల్ పేమెంట్ సర్వీసులు అందజేయడం కోసం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. కానీ, ఇప్పటికీ ఇంకా అందుబాటులోకి తేలేకపోయింది.

జన రంజకమైన వార్తలు