• తాజా వార్తలు

వాట్స్ అప్ ఫేస్ చేస్తున్న 7 ప్రధాన సమస్యలు ? ఇక ముందు ఏమవుతుంది ?

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం అయిన ఫేస్ బుక్ పై కేసు వేయడం ద్వారా బ్లాక్ బెర్రీ ఈ మధ్య వార్తల్లో నిలిచింది. ఫేస్ బుక్ తన మెసేజింగ్ యాప్ ల కోసం బ్లాక్ బెర్రీ యొక్క టెక్నాలజీ ని అనుమతి లేకుండా వాడుకుంటుందని బ్లాక్ బెర్రీ ఆరోపిస్తుంది. అసలు ఈ కేసు నేపథ్యం ఏమిటి? దీనిద్వారా వాట్స్అప్ ఎదుర్కోనున్న సవాళ్ళు ఏమిటి? తదితర  విషయాలను ఈ ఆర్టికల్ లో చర్చిద్దాం.

వాట్స్ అప్, ఫేస్ బుక్ మెసెంజర్, ఇన్ స్టా గ్రం లలో ఉన్న టెక్నాలజీ తనదే అంటున్న బ్లాక్ బెర్రీ

ఒక దశాబ్దం వెనక్కు వెళితే బ్లాక్ బెర్రీ యొక్క  మెసెంజర్ అప్లికేషను బాగా పాపులర్ అయింది. సరిగ్గా ఆ మెసెంజర్ అప్లికేషను లో ఉన్న ఫీచర్లు, డిజైన్ లనే ఫేస్ బుక్ తనయొక్క మెసెంజర్, వాట్స్ అప్, ఇన్ స్టా గ్రం లలో వాడుకుంటుందని బ్లాక్ బెర్రీ అంటుంది. దీనికి సంబంధించి తమ వద్ద కీలక ఆధారాలు కూడా ఉన్నాయనీ, ఫేస్ బుక్ పై చట్ట పరమైన చర్యలు తీసుకోవడానికి ఇప్పటికే తమ షేర్ హోల్డర్స్ తో కూడా మాట్లాడడం జరిగందనీ బ్లాక్ బెర్రీ చెబుతుంది.

వాట్స్ అప్ ను బ్యాన్ చేయమని బెదిరిస్తున్న బ్లాక్ బెర్రీ

ఫేస్ బుక్ తన ప్రైమరీ యాప్ తో పాటు వాట్స్ అప్, ఫేస్ బుక్ మెసెంజర్, వర్క్ ప్లేస్ చాట్, ఇన్ స్టా గ్రం లను కూడా నిషేదించాలని బ్లాక్ బెర్రీ వాదిస్తుంది.

బిలియన్ల లో నష్టాన్ని చూపిస్తున్న బ్లాక్ బెర్రీ

రాజీ చేసి కేసు ఉపసంహరించుకునేందుకు బ్లాక్ బెర్రీ ఎంత డిమాండ్ చేస్తున్నదీ అధికారికంగా తెలియనప్పటికీ ఒక సమాచారం ప్రకారం ఈ సంఖ్య బిలియన్ల లోనే ఉండవచ్చని అంచనా!

ఇంతకీ ఫేస్ బుక్ కాపీ చేసింది అంటున్న ఫీచర్లు ఏవి?

బ్లాక్ బెర్రీ చెబుతున్న దాని ప్రకారం అనేక ఫీచర్లను ఫేస్ బుక్ కాపీ చేసింది. మల్టిపుల్ ఇన్ కమింగ్ మెసేజ్ లను ఇన్ బాక్స్ లో చూపించడం, అన్ రీడ్ మెసేజ్ ఇండికేటర్ ను ఐకాన్ యొక్క పై భాగం లో చూపించడం, ఫోటో టాగ్ ను సెలెక్ట్ చేసుకోవడం, ప్రతీ మెసేజ్ కూ వరుసగా టైం స్టాంప్ లను చూపించడం లాంటి ఫీచర్లను ఫేస్ బుక్ కాపీ చేసినట్లు బ్లాక్ బెర్రీ చెబుతుంది.

మరి దీనిపై ఫేస్ బుక్ ఏమంటుంది?

బ్లాక్ బెర్రీ యొక్క స్థితి కూడా తమ మెసెంజర్ అప్లికేషను యొక్క స్థితి లానే ఉందనీ, తమ సూట్ ద్వారా ఆదాయం సృష్టించుకోవడం చేతగాక ఇతరుల ఆదాయ మార్గాలకు దెబ్బకొట్టడం ద్వారా ఆదాయం పొందాలని బ్లాక్ బెర్రీ చూస్తుందనీ మేమేమీ దానికి లొంగే ప్రసక్తి లేదనీ న్యాయం బద్దంగా పోరాడతామనీ ఫేస్ బుక్ చెబుతుంది.

ఫేస్ బుక్ , బ్లాక్ బెర్రీ ల మధ్య ఇక ఏం జరుగునుంది?

ఫేస్ బుక్ ఇచ్చిన ప్రకటన చూస్తే బ్లాక్ బెర్రీ కి ఏ మాత్రం తలొగ్గే ప్రసక్తి లేదని స్పష్టం అవుతుంది. మరొకవైపు బ్లాక్ బెర్రీ కూడా ఇంతే దృఢమైన స్టేట్ మెంట్ లను ఇస్తుంది. ఈ నేపథ్యం లో ఇక రానున్న కాలంలో ఈ రెండింటి మధ్య చట్ట పరమైన యుద్ధం జరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది.

బ్లాక్ బెర్రీ ఇంతకుముందు ఇలా చేసిందా?

2017 వ సంవత్సరంలో కూడా ఇలాగే నోకియా పై బ్లాక్ బెర్రీ పేటెంట్ కు సంబందించిన కేసు ను వేసింది. ఒక డజను పైగా ఆవిష్కరణలను తన అనుమతి లేకుండా నోకియా వాడుకుంటుందని కేసు ను ఫైల్ చేసింది. అలాగే గత సంవత్సరం క్వాల్ కాం పై కూడా ఇదే రకమైన కేస్ ను వేసిన  బ్లాక్ బెర్రీ దానికి పరిహారంగా 940 మిలియన్ డాలర్ లను పొందింది.

జన రంజకమైన వార్తలు