• తాజా వార్తలు
  •  

FB సొంత యాప్ "లైఫ్ స్టేజి " ను ఎందుకు చంపేస్తుంది?

ఒక సంవత్సరం క్రితం ఫేస్ బుక్ రూపొందించిన తన స్వంత యాప్ అయిన లైఫ్ స్టేజి ను ఫేస్ బుక్ ఆపివేసింది. యువకులు ప్రత్యేకించి టీనేజర్ లు వారి ఫ్రెండ్స్ తో కనెక్ట్ అవ్వడానికీ మరియు సంభాషించడానికీ రూపొందించిన ఈ యాప్ ను పేస్ బుక్ అర్థాంతరంగా మూసివేయడం అంటే విశేషమే. అసలు ఎందుకు ఫేస్ బుక్ ఈ యాప్ ను మూసివేసింది? దానికి గల కారణాలు ఏమిటి? తదితర విషయాలను ఈ ఆర్టికల్ లో విశ్లేషిద్దాం.

ఈ లైఫ్ స్టేజి యాప్ అనేది స్నాప్ చాట్ ను పోలిన ఒక చాటింగ్ యాప్.  మైకేల్ సేమన్ అనే ఒక యువకుడు దీనిని రూపొందించాడు.  యూజర్ లు ఒక్కొక్కరికి ప్రైవేటు మెసేజ్ లు పంపే బదులు ఫోటో లను మరియు వీడియో లను క్లాస్ మేట్స్ అందరితో ఒకేసారి పంపే విధంగా ఇది డిజైన్ చేయబడింది. ప్రత్యేకించి 21 సంవత్సరాలు ఆ లోపు యువకుల కోసమే పేస్ బుక్ ఈ యాప్ ను రూపొందించింది, అసలు టీనేజర్ ల కోసమే ప్రత్యేకంగా ఇలాంటి ఒక యాప్ ఉంది అనే విషయమే చాలా మందికి తెలియదు. దీని ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే యువతీ యువకులు తమ స్కూల్ డేస్ లోని స్నేహితులతో కనెక్ట్ అవడం.

అయితే పేస్ బుక్ రూపొందించిన ఈ లైఫ్ స్టేజి యాప్ అనేది అంతగా పాపులర్ కాలేదు. దీనిలో కొన్ని సమస్య లున్నాయి. అందులో ముఖ్యమైనవి ప్రైవసీ కి సంబందించినవి. యూజర్ ల యొక్క ప్రైవసీ కి సంబంధించి ఇందులో ఏ విధమైన జాగ్రత్తలు లేవు. అలాగే 21 సంవత్సరాలు ఆ లోపు యువత మాత్రమే వాడాలి అనే నిబంధన ఏదీ లేకపోవడం వలన అందరూ ఉపయోగిస్తూ దీనియొక్క ప్రధాన ఉద్దేశ్యాన్ని దేబ్బతీస్తున్నారు. అలాగే ఈ యాప్ లో ఉన్నటువంటి కాంటెంట్ ఇతరులు చూసే విధంగా ఉండడం తో యూజర్ లు దీని పట్ల అంతగా ఆసక్తి చూపించడం లేదు. ఇది కేవలం US లో ఉన్న యువతను ఉద్దేశించి మాత్రమె తయారు చేయబడింది.

ఈ లైఫ్ స్టేజి అనే యాప్ ఆగష్టు 4 న యాప్ స్టోర్ నుండి తొలగించబడింది. ఇప్పటివరకూ దీనిని అప్ డేట్ చేయలేదు. ఇది యాప్ స్టోర్ లో ఉన్నది కొద్ది కాలమే అయినా ఏ రోజూ కూడా టాప్ చార్ట్ లో లిస్టు చేయలేదు. ఈ నేపథ్యం లోనే పేస్ బుక్ దీనిని తొలగించినట్లు తెలుస్తుంది.

 

జన రంజకమైన వార్తలు