విండోస్ 10 మార్కెట్లోకి వచ్చి రెండుళ్లనరేళ్లవుతోంది. 2015లో విండోస్ 10 లాంచ్ చేసినప్పుడు విండోస్ 7, 8 వాడుతున్నవారికి ఫ్రీగా విండోస్ 10కి అప్‌గ్రేడ్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది. అయితే దీని ప్రాసెస్ కొంత గందరగోళంగా ఉండడంతో చాలామంది యూజర్లు ఇప్పటికి అప్డేట్ చేసుకోలేదు. అంతేకాదు చాలా మంది యూజర్లు విండోస్ 7 లేదా విండోస్ 8తో కంఫర్టబుల్‌గా ఫీలవడం కూడా దీనికి ఓ కారణం. ఇదిలా ఉంటే 2016 జూన్ నాటికి ఈ ఫ్రీ అప్‌గ్రడేషన్ ఆఫర్ అయిపోయింది. కానీ ఇప్పటికీ ఫ్రీగా అప్‌గ్రేడ్ చేసుకోవడానికి ఆ పాత్ యాక్టివ్‌గా ఉంది.
విండోస్ 7ఉంటే..
విండోస్ 7 లేదా విండోస్ 8 జెన్యూన్ ఓఎస్ వాడుతున్నవారు మీడియా క్రియేషన్ టూల్ ఉపయోగించి విండోస్ 10కు ఫ్రీగా అప్గ్రడే్ చేసుకోవచ్చు. ఇది ఆటోమేటిగ్గా యాక్టివేట్ అవుతుంది. విండోస్ 7 ప్రో కీతో విండోస్ 10 ప్రో యాక్టివేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు విండోస్ 7 లేదా 8 ఇన్స్టాల్ చేసుకోకపోతే మీరు డైరెక్ట్‌గా మీ కీతో విండోస్ 10ని యాక్టివేట్ చేసుకోవచ్చు.
విండోస్ 7 లేకపోతే..
మీ దగ్గర విండోస్ 7 కీ లేకపోతే కొన్ని వెబ్సైట్లు వాటిని 5 డాలర్ల నుంచి అమ్ముతున్నాయి. కొన్నిసైట్లు ఓఈఎం కీస్ కోసం వీటిని మైక్రోసాఫ్ట్ నుంచి బల్క్‌గా కొంటాయి. వాస్తవంగా అవి వ్యక్తిగత అవసరాలకు పనికిరావు. కాబట్టి ఇవి పని చేయకుండా పోయే అవకాశం ఉంది. అందువల్ల వాటిని యూజర్లు సొంత ఇష్టం మీద కొనుక్కోవడం మంచిది.
* ఇప్పటికీ మీరు ఇలాంటి కీ వాడాలనుకుంటే ముందుగా విండోస్ 7ను సిస్టమ్‌లో ఇన్స్టాల్ చేసుకోండి. ఈ కీతో దాన్ని యాక్టివేట్ చేసి అప్పుడు మీడియా క్రియేషన్ టూల్ ఉపయోగించి విండోస్ 10కి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.
* ఈ పద్ధతిలో మీ కీని డిజిటల్ లైసెన్స్‌గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఒరిజినల్ కీ తీసేసినా (రివోక్ చేసినా) ఈ డిజిటల్ లైసెన్స్ ఉంటుంది.
* ఆ తర్వాత మీ లోకల్ అకౌంట్‌ను మైక్రోసాఫ్ట్ అకౌంట్‌గా మార్చుకుంటే మీ డిజిటల్ లైసెన్స్ కూడా మైక్రోసాఫ్ట్ అకౌంట్‌కు లింకవుతుంది.
ఎప్పటివరకు ఉంటుంది?
వాస్తవానికి విండోస్ 10ను ఇలా ఫ్రీగా అప్‌గ్రేడ్ చేసుకోవడానికి లూప్ హోల్‌ను మైక్రోసాఫ్ట్ కావాలనే ఉంచింది. ఎందుకంటే 100 కోట్ల డివైస్‌లను విండోస్ 10తో రన్ చేయాలన్నది మైక్రోసాఫ్ట్ టార్గెట్. విండోస్ 10 మార్కెట్ షేర్ ఈ మధ్య భారీగా పెరుగుతోంది. కాబట్టి టార్గెట్ రీచ్ అయితే మైక్రోసాఫ్ట్ ఈ లూప్ హోల్‌ను ఎప్పుడైనా క్లోజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి విండోస్ 7, విండోస్ 8 యూజర్లు విండోస్ 10కి ఫ్రీగా అప్‌గ్రేడ్ కావాలంటే త్వరపడాలి.