• తాజా వార్తలు
  •  

ఆండ్రాయిడ్ ఓరియో మీకు రాక‌పోవ‌డానికి ఈ 7 కార‌ణాలు ఉండొచ్చు..


ఆండ్రాయిడ్ ఓరియో.. ఆండ్రాయిడ్ 7.1.1. నూగ‌ట్ త‌ర్వాత వ‌చ్చిన లేటెస్ట్ వెర్ష‌న్‌.  దీనిలో ఎన్నో యూనిక్ ఫీచ‌ర్స్ ఉన్నాయి.  యాప్స్ 3డీ పాప్ అప్స్ కోసం పిక్చ‌ర్ ఇన్ పిక్చ‌ర్  (PiP) మోడ్,  లాక్‌స్క్రీన్ పై కొత్త నోటిఫికేష్ సిస్ట‌మ్‌, పెర్‌ఫార్మెన్స్ ఇంప్రూవ్‌మెంట్‌, కొత్త ఎమోజీలు ఇలా ఎన్నో స్పెషాలిటీస్ ఈ ఆండ్రాయిడ్ 8 వెర్ష‌న్‌లో ఉన్నాయి. గూగుల్ ఈ ఆండ్రాయిడ్ ఓ అప్‌డేట్‌ను ఇప్ప‌టికే త‌న సొంత ఫోన్ల‌యిన పిక్సెల్‌, పిక్సెల్ ఎక్స్ఎల్ యూజ‌ర్ల‌కు పంపింది.  త‌ర్వాత స్టేజ్‌లో నెక్స‌స్ 6P, నెక్స‌స్  5X వంటి నెక్స‌స్ డివైస్‌ల‌న్నింటికీ వ‌స్తుంది.  అయితే మిగ‌తా కంపెనీల ఫోన్ల‌కు ఎప్పుడొస్తుంద‌న్న‌ది తెలియ‌డం లేదు.  నోకియా 6, గెలాక్సీ ఎస్‌8లాంటి కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్ల‌కు మాత్ర‌మే ఆండ్రాయిడ్ ఓరియో అప్‌డేట్ వ‌స్తుంద‌ని స‌మాచారం. 
మీ ఫోన్‌కు ఆండ్రాయిడ్ ఓరియో అప్‌డేట్ రాక‌పోవ‌డానికి ఇవి కార‌ణాలై ఉండొచ్చు 
1. మీరు గూగుల్ ఫోన్ వాడ‌క‌పోతే.. 
పిక్సెల్‌, నెక్స‌స్ లాంటి గూగుల్ సొంత ఫోన్లు వాడిన‌వారికి ఆండ్రాయిడ్ ఓ అప్డేట్ వ‌స్తుంది. మీరు ఆ ఫోన్లు వాడ‌క‌పోతే మీకు ఓరియో అప్‌డేట్ వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌.
2. ఇండియ‌న్ బ్రాండ్ ఫోన్ వాడుతుంటే.. 
ఇండియ‌న్ ఫోన్ త‌యారీ కంపెనీలు త‌మ ఫోన్ల‌కు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్‌ను అంత త్వ‌ర‌గా తీసుకోరు.  కాబ‌ట్టి మీరు ఇండియ‌న్ బ్రాండ్ (మైక్రోమ్యాక్స్ లాంటివి) వాడితే  ఆండ్రాయిడ్ ఓ అప్‌డేట్ రావ‌డం క‌ష్టం.  
3. మీ ఫోన్‌లో స్టాక్ ఆండ్రాయిడ్ లేక‌పోతే.. 
స్టాక్ ఆండ్రాయిడ్‌తో ర‌న్ అయ్యే నోకియా 3, నోకియా 5, నోకియా 6 , మోటోరోలా లాంటి మోడ‌ల్స్‌కు ఆండ్రాయిడ్ ఓ అప్‌డేట్ ఫాస్ట్‌గా వ‌స్తుంది. ఈ టైప్ ఆండ్రాయిడ్ మీ ఫోన్‌లో లేక‌పోతే మీకు అప్‌డేట్ రావ‌డం క‌ష్ట‌మే.
4. చైనీస్ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్ వాడుతుంటే..
ఆండ్రాయిడ్ 8 (ఓరియో) అప్డేట్ కూడా రిలీజ‌య్యేస‌రికి రెడ్‌మీ నోట్ 4 ఇప్ప‌టికి ఆండ్రాయిడ్ నూగ‌ట్ 7.0 అప్‌డేట్‌ను తెచ్చుకోగ‌లిగింది. అంటే ఏడాది  ఆల‌స్యంగా వ‌చ్చింద‌న్న‌మాట‌. షియోమి, హువావే లాంటి చైనీస్ బ్రాండ్స్ ఫోన్ల‌కు లేటెస్ట్ ఆండ్రాయిడ్ అప్‌డేట్  రావాలంటే సంవ‌త్స‌రం ప‌డుతుంది. కాబ‌ట్టి మీరు ఈ బ్రాండ్ ఫోన్లు వాడుతుంటే మీకు ఓరియో అప్డేట్ రావ‌డం చాలా లేట‌యిన‌ట్లే.
5. మీ డివైస్ ఏడాదిక‌న్నా పాత‌ది అయితే.. 
మీ ఫోన్ ఆరేడు నెల‌ల పాతది అయితే మీకు ఓరియో అప్‌డేట్ రావ‌డం క‌ష్ట‌మే. అయితే హైఎండ్ మోటో ఫోన్‌, నెక్సస్ లాంటి ఫోన్లు, ఫ్లాగ్‌షిప్ ఫోన్ల‌కు మాత్రం కాస్త పాత‌దైనా అప్‌డేట్ వ‌చ్చే అవ‌కాశం ఉంది.  
6. క‌స్ట‌మ్ సాఫ్ట్‌వేర్ ఇన్‌కంపాటబుల్ అయితే.. 
కొన్ని ఆండ్రాయిడ్ డివైస్‌లు ఆండ్రాయిడ్ క‌స్ట‌మైజ్డ్ వెర్ష‌న్ల‌ను వాడుతుంటాయి. అలాంటి వాటికి లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌డేట్ రావ‌డం క‌ష్టం.  బ్లాట్‌వేర్‌, క‌స్ట‌మ్ ఫీచ‌ర్స్ ఇన్‌కంపాటబులిటీ ఇందుకు కార‌ణాలు. 
7. ఆండ్రాయిడ్ ఫ్రాగ్మెంటేష‌న్ ప్రాబ్ల‌మ్ 
స్లో అప్‌డేట్ ఎడాప్ష‌న్ వ‌ల్ల కూడా లేటెస్ట్ ఓఎస్ అప్‌డేట్స్ రాక‌పోవ‌చ్చు. ఈ స్లో అడాప్ష‌న్ ప్రాబ్లం ఇప్ప‌టిది కాదు.  దీనివల్లే ఇప్ప‌టికీ చాలా ఫోన్లు ఆండ్ఆర‌యిడ్ కిట్‌కాట్‌, లాలీపాప్ లాంటి చాలా పాత వెర్ష‌న్లు వాడుతుంటాయి. ఓఈఎం క‌స్ట‌మైజేష‌న్స్ వల్ల వీటికి అప్‌డేట్స్ చాలాచాలా లేట్‌గా వ‌స్తుంటాయి. 

జన రంజకమైన వార్తలు