• తాజా వార్తలు
  •  

కొత్త ఫీచ‌ర్లు.. కొత్త లుక్‌తో యాపిల్ యాప్ స్టోర్

యాపిల్ .. త‌న యాప్ స్టోర్‌కు కొత్త హంగులు అద్దింది. కొత్త ఫీచ‌ర్లు, స‌రికొత్త లుక్‌తో యాప్ స్టోర్‌ను రీ డిజైన్ చేసింది. న్యూయార్క్‌లో జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ వైడ్ డెవ‌ల‌ప‌ర్స్ కాన్ఫ‌రెన్స్ (WWDC 2017)లో ఈ కొత్త యాప్ స్టోర్ డిజైన్‌ను ఆవిష్క‌రించింది. గేమ్స్‌, యాప్స్ కోసం డెడికేటెడ్ ట్యాబ్స్ కొత్త స్టోర్‌లో స్పెష‌ల్ ఫీచ‌ర్లుగా క‌నిపిస్తున్నాయి. వీటితోపాటు టుడే అనే కొత్త ట్యాబ్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. యాప్ స్టోర్ ఓపెన్ చేయ‌గానే టుడే ట్యాబ్ క‌నిపిస్తుంది.
ప్ర‌తి యాప్‌కు సొంత ప్రొడ‌క్ట్ పేజీ
యాప్ స్టోర్‌లోని ప్ర‌తి యాప్‌కు ప్ర‌త్యేకంగా ఓ పేజీని రూపొందించింది. ఆ యాప్‌కు సంబంధించిన వీడియోలు, డెవ‌ల‌ప‌ర్ కోట్స్‌, రివ్యూస్ ఈ పేజీలో చూడొచ్చు. ఐఓఎస్‌కే ప్ర‌త్యేక‌మైన మాన్యుమెంట్ వాలీ 2ని యాపిల్ ఇక్క‌డ యూజ్ చేసింది. ప్ర‌తి రోజూ new app of the day, new game of the dayల‌ను ప్ర‌జంట్ చేయ‌నుంది. మెడిటేష‌న్ వంటి థీమ్స్ లిస్ట్‌ను కూడా యాప్ స్టోర్లో ఇంట్ర‌డ్యూస్ చేసింది. ఈ వారంలో ముందుగా వ‌చ్చిన స్టోరీల‌ను చూడొచ్చు.
భారీగా పెరిగిన డౌన్‌లోడ్స్
యాపిల్ యాప్ స్టోర్ నుంచి యాప్స్ డౌన్‌లోడ్ ఇటీవ‌ల కాలంలోబాగా పెరిగింది. ఐ ఓఎస్ డెవ‌ల‌ప‌ర్లు 155 దేశాల్లోని యాపిల్ యూజ‌ర్ల‌కు ఈ యాప్‌ల‌ను అందిస్తున్నారు. గ‌త ఏడాది కాలంలో యాప్‌ల డౌన్‌లోడ్స్ సంఖ్య ఏకంగా 70% పెరిగింద‌ని యాపిల్ ప్ర‌క‌టించింది. యాప్స్ ద్వారా డెవ‌ల‌ప‌ర్లు 70 బిలియ‌న్ డాల‌ర్లు (4 కోట్ల.. కోట్ల రూపాయ‌లు) సంపాదిస్తుండ‌డం న‌మ్మ‌శ‌క్యంగాని నిజ‌మ‌ని యాపిల్.. త‌న రీడిజైన్డ్ యాప్ స్టోర్‌ను ఆవిష్క‌రిస్తున్న సంద‌ర్భంగా ప్ర‌క‌టించింది.

జన రంజకమైన వార్తలు