• తాజా వార్తలు
  •  

ఇక శాంసంగ్ ఫోన్లకు కొత్త ఓఎస్... టైజన్ 4.0


దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ లెజెండ్ శాంసంగ్‌ కొత్త ఓఎస్ తో తన స్మార్టు ఫోన్లను తీసుకురానుంది. టైజెన్ అనే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ తో ఇప్పటికే దక్షిణకొరియాలో మొబైల్స్ లాంచ్ అయ్యాయి. శాన్‌ ఫ్రాన్సిస్కోలోని 5వ టైజెన్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2017 సందర్భంగా ఈ ప్రణాళికలను శాంసంగ్‌ తన ప్లాన్లు వెల్లడిస్తూ త్వరలో ప్రపంచవ్యాప్తంగా ఈ టైజన్ 4.0 ఓఎస్ బేస్డ్ గా స్మార్టు ఫోన్లను తీసుకురానున్నట్లు ప్రకటించింది.

అలాగే ఆర్టిక్‌ 053 మాడ్యూల్, తేలికపాటి ఐఓటీ చిప్సెట్ లను కూడా లాంచ్‌ చేయనున్నట్టు చెప్పింది. ఈ ఆర్టిక్‌ 053 మాడ్యూల్ లో ఇంటిగ్రేటెడ్‌ రియల్‌టైం ప్రాసెసర్‌ 320 ఎంహెచ్‌జెడ్‌, ఏఆర్‌ఎం కోర్‌టెక్స్‌ 4 కోర్‌, 1.4 ఎంబీ ర్యామ్ 8 ఎంపీ ఫ్లాష్ ఉంటాయి. టైజెన్‌ 4.0 ప్లాట్‌ఫాంలో ఐవోటీ డెవలపర్స్‌ కోసం స్మార్ట్‌ఫోన్లు, టెలివిజన్లతోపాటు, థర్మోస్టాట్లు, స్కేల్స్‌,బల్బ్స్‌ ఇతర ఉత్పత్తులను అభివృద్ధి కొరకు కీలకమార్పులు చేసినట్టు తెలిపింది.

ఇందుకోసం వివిధ దేశాల్లో ఇతర సంస్థలతో కలిసి పనిచేయనుంది. చైనాలో బ్రాండ్‌ లింక్‌, కొరియాలో స్మార్ట్ హోమ్ పరికర తయారీదారు కొమాక్స్‌, అమెరికాలోసర్వీస్ ప్రొవైడర్ గ్లిమ్స్‌ తో ఒప్పందంచేసుకున్నట్టు శాంసంగ్ ప్రకటించింది. తాజాగా ఇంటర్నెట్‌ ఆఫ్‌ ధింక్స్‌(ఐఓటీ) లోకి ఎంట్రీ ఇస్తున్నామని ,ఇది ఐవోటి భవిష్యత్తు లో మరిన్ని అవకాశాలకు దారి చూపుతుందని తాము భావిస్తున్నామని శాసంగ్ చెప్తోంది.

జన రంజకమైన వార్తలు