• తాజా వార్తలు
  •  

టచ్ స్క్రీన్ క్రెడిట్ కార్డులు


ఇండియా క్యాష్ లెస్ గా మారుతోంది. అయితే... ఈ క్రమంలో డిజిటల్ వ్యాలట్లు వంటివి ఎన్నొచ్చినా కార్డుల వినియోగం కూడా ఎక్కువగానే ఉంది. డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు పెద్ద సంఖ్యలో వినియోగిస్తున్నారు. రెండు అంతకంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు... క్రెడిట్ కార్డులు ఉన్నవారి సంఖ్య తక్కువేమీ కాదు. దీంతో అవన్నీ వెంటపెట్టుకుని వెల్లడం కూడా ఒక్కోసారి సమస్యగానే మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కార్డుల్లో వస్తున్న కొత్త టెక్నాలజీ డిజిటల్ భారత్ కు మరింత కొత్త రూపునిస్తోంది.
ట్రెండు మారుతోంది..
కార్డులకు సంబంధించి ఇప్పుడు ట్రెండ్ మార‌బోతుంది. వాలెట్ లో అన్ని ఏటీఎం కార్డులు ఎందుకు మోసుకెళ్ల‌డం అనుకున్న‌వాళ్ల‌కు.. మ‌ల్లిపుల్ బ్యాంక్ అకౌంట్ ల‌కు ఒకే కార్డుతో పాటు ట‌చ్ స్ర్కీన్ ఏటీఎంలు వ‌చ్చేస్తున్నాయి. ఒకే కార్డుతో నాలుగైదు బ్యాంకు ఖాతాలకు సంబంధించిన లావాదేవీలు చేసుకునే వీలు కలగనుంది. ఇంతవరకు లేని ఈ విధానంపై భారతీయ టెక్ ప్రియులు చాలా ఆసక్తి చూపుతున్నారు.
ఇదీ టెక్నాలజీ..
ఈ నూతన కార్డుల వెనుక భాగంలో ట‌చ్ పార్టు ఉంటుంది. ట‌చ్ స్ర్కీన్ సహాయంతో మనకు ఏఏ కార్డులున్నాయో ఆ బ్యాంకులను సెలక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాంకు ఎంపిక చేసుకుని మ‌న‌కు కావాల్సిన సేవ‌ల‌ను పొంద‌వ‌చ్చు. బ్యాంకు పేరు, కార్డు టైప్ , పిన్ ఎంట‌ర్ చేసి మ‌న‌కు కావాల్సిన సేవ‌ల‌ను ఎంట‌ర్ చేసి స్వైప్ చేసుకోవ‌చ్చు.
ప్రస్తుతం పరిశీలన దశలోనే ఉన్న టెక్నాలజీ అందుబాటులోకి రావడానికి ఎంతో కాలం పట్టదు. ఇది అందుబాటులోకి వస్తే మరింత సులభతరంగా లావాదేవీలు జరిపే వీలుంటుంది. https://www.youtube.com/watch?v=EBaIHA2ld_o

జన రంజకమైన వార్తలు