• తాజా వార్తలు

అమీర్ పేట కార్నర్

మీర్ పేట్ అమీర్ పేట్ అమీర్ పేట్ .........

ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో డిగ్రీ కానీ బి. టెక్ గానీ పూర్తి  చేసిన తొంబై శాతం మంది విద్యార్థులు గమ్య స్థానం. మన రాష్ట్రాలలో ఎన్ని ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయో మనందరికీ తెలిసిన విషయమే. అన్ని కళాశాలల లోని విద్యార్థులు క్యాంపస్ ఇంటర్వ్యూ లకు హాజరవుతూ ఉంటారు. అయితే వారిలో ఎంత మందికి ప్లేస్ మెంట్ లు లభిస్తున్నాయి? కేవలం 10 %మంది మాత్రమే క్యాంపస్ ఇంటర్వ్యూలలో సెలెక్ట్ అవుతున్నరనేది జగమెరిగిన సత్యం. ఈ పరిస్థితికి కారణాలు ఏంటి అన్న విషయాన్నీ పక్కన పెడితే మిగతా 90 శాతం మంది విద్యార్థులు ఆ తర్వాత ఏం  చేస్తున్నారనేది మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. వీరిలో కొంత మంది ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరి కొంత మంది కళాశాలలో నేర్చుకోలేక పోయిన విషయాలను నేర్చుకునే పనిలో బిజీ గా ఉంటూ తద్వారా కార్పోరేట్ కంపెనీ ల లో ఉద్యోగాలకు ప్రయత్నిస్తూ ఉంటారు. విచిత్రమేంటంటే ఈ రెండు రకాల విద్యార్థులు ఉండేది అమీర్ పేట్ లోనే! మరికొంత మంది విద్యార్థులు ఉన్నత చదువులకు వెళుతూ ఉంటారు. దీని ని విచిత్రం అనాలో లేక మరేదో అనాలో తెలియదు కానీ వీరి గమ్యం కూడా అమీర్ పేటే!

ఇంతకీ వీళ్ళంతా అమీర్ పేట లో ఏం  చేస్తారు? కార్పోరేట్ కంపెనీలలో ఉద్యోగం అంటే విద్యార్థికి  అనేక రకాలైన నైపుణ్యాలు అవసరమై ఉంటాయి. కానీ ఆ నైపుణ్యాలు లేని విద్యార్థులు అమీర్ పేట్ లో వాటిని నేర్చుకుంటూ ఉంటారు. వీటిలో కమ్యూనికేషన్ స్కిల్స్, వివిధ రకాల అధునాతన కంప్యూటర్ ప్రోగ్రాం లు, ఇంగ్లీష్ నైపుణ్యాలు ఇలా చాలా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించే విద్యార్థులు దానికి సంబందించిన కోర్సులు కానీ కోచింగ్ ను కానీ నేర్చుకుంటూ ఉంటారు. ఇవన్నీ నేర్పించే కోచింగ్  సెంటర్ లు అన్నీ అమీర్ పేట్ లో నే ఉంటాయి.కోచింగ్ సెంటర్ ల సంగతి సరే  మరి ఇంతమంది విద్యార్థులకు వసతి ఎలా? అక్కడి హాస్టల్ వసతులు ఎలా ఉంటాయి? అక్కడి కోచింగ్ సెంటర్ లలో ఏ ఏ కోర్సులు అందుబాటులో ఉంటాయి? ప్రతిరోజూ అక్కడ ఎలాంటి విశేషాలు జరుగుతూ ఉంటాయి? అక్కడ ఎలాంటి మోసాలు జరుగుతూ ఉంటాయి? కొత్తగా అమీర్ పేట్ వైపు అడుగులు వేసే విద్యార్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలా ప్రతిరోజూ అక్కడ జరిగే విషయాలన్నీ తెలుసుకుంటే ఎలా ఉంటుంది? అందుకే మా ఈ వెబ్ సైట్ లో ప్రత్యేకంగా అమీర్ పేట్ కార్నర్ అనే విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్ డేట్ ల కోసం క్లిక్ చేస్తూనే ఉండండి.

జన రంజకమైన వార్తలు