• తాజా వార్తలు
  •  

డిగ్రీ తరువాత చేసే కోర్సులు..!

నిజానికి డిగ్రీ(గ్రాడ్యుయేట్) చదివిన వారు ఆ తరువాత ఏమి చెయ్యాలా అనే సందేహంలో ఉంటారు. అసలు ఏలాంటి కోర్సులు ఉంటాయో కూడా చాలా మందికి తెలియదు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు వారికి తెలిసిన కొన్ని కోర్సుల్లోనే చేరుతారు. కొద్దికాలం క్రితం వరకు ఏది చదివినా ఉద్యోగం వస్తుందిలే అనే నమ్మకం ఉండేది. కానీ పెరిగిన జీవన శైలీ, అధునాతన సాంకేతిక పరిజ్ఞ్యాణం వల్ల ప్రతి ఒక్కరు చదువుకోవడంతో ఉద్యోగాలు దొరకడం కష్టతరం అయ్యింది. దీనికి తోడు ప్రతిభకు పెద్దపీట వేస్తున్నారు. అరకొర చదువులతో నెగ్గుకురావడం చాలా కష్టంగా మారింది. దీనికి అనేక కారణాలు ఉన్నా... నలుగురికి భిన్నంగా ఉండే  వాటిని ఎంచుకోవడం చాలా ఉత్తమం. చాలా తొందరగా ఉద్యోగాలు దొరకడంతో పాటు భవిష్యత్ తరాలకు మార్గదర్శి అయ్యే అవకాశం కూడా ఉంది. అసలు డిగ్రీ తరువాత ఉండే కోర్సులు ఏమిటో తెలుసుకుందాము.

1) ప్రోఫెసనల్ కోర్సులు:- ఎంసిఏ, ఎంబీఏ, సిఏ, సిఎస్, సిఎంఏ కోర్సులు చేసిన వారు సాఫ్ట్ వేర్ లుగా, మార్కెటింగ్, ఫైనాన్సు ఉద్యోగాలలో స్థిరపడవచ్చు.

2) పీజీ కోర్సులు:- ఎంఏ, ఎంకాం, ఎంఎస్సి, ఇంటిగ్రేటెడ్ పిహెచ్ డి కోర్సులు చేసినవారు అటు ప్రభుత్వ రంగ ఉద్యోగాలతోపాటు ఇటు ఉపాధ్యాయులుగా, ఫైనాన్సు విభాగాల్లో కూడా స్థిరపడవచ్చు.   

3) టీచింగ్  కోర్సులు:- బీఈడి, బీపీఈడి, స్పెషల్ ఎడ్యుకేసన్, లాంగ్వేజ్ పండిట్ ఉపాధ్యాయులుగా స్థిరపడవచ్చు.  ప్రస్తుతం వేళల్లో జీతాలు అర్జించడంతో పాటు ఇలాంటి ఓడిడుకులు లేనటువంటి ఉద్యోగాలు ఇవి. కొన్ని కార్పోరేట్ సంస్థలు తప్ప ప్రతి ఒక్కరితో గౌరవాన్ని పొందే వృత్తి ఇది. 

4) జాబ్ ఓరిఎంటేడ్  కోర్సులు:- హాస్పిటాలిటి, లా, జర్నలిజం, ఫారెన్ లాంగ్వేజస్, ఫ్యాషన్ డిజైనింగ్ ప్రస్తుతం కోర్సులకు చాలా డిమాండ్ ఉంది. చదివిన వెంటనే ఉద్యోగాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి.భవిష్యత్ గురించి డోకా లేనటువంటి కోర్సులు ఇవి. 

5) ఫారెన్ లాంగ్వేజ్  కోర్సులు:- ఫ్రెంచ్, జర్మన్, రష్యన్ భాహుభాషా కోవిదులు చాలా తక్కువగా దొరుకుతారు. పెద్ద పెద్ద కంపెనీలు అదేపనిగా తమ అబ్యర్తులకు పట్టుబట్టి ఇతర లాంగ్వేజ్  కోర్సులు నేర్పిస్తున్నాయి. వివిధ దేశాల్లో తమ కార్య కలాపాలను విస్తరించుకోవడానికి భాష కూడా ప్రధానా కారణంగా మారుతోంది. దీనితో వీరికి లక్ష్యల్లో జీతాలు కూడా అందుతున్నాయి. 

6) ప్రభుత్వ రంగ ఉద్యోగాలు:- యూపీఎస్పీ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఎస్ఎస్ సి, బ్యాంకు ఉయోగాలు కాస్తా తెలివితో వ్యవహరించి వేటి గురించి ఆలోచించకుండా సమయస్పూర్తితో వ్యవహరిస్తే ప్రభుత్వ రంగ ఉద్యోగాలు చేజారిపోవు.

ఇవన్ని కాకుండా మనకు తెలియని ఇంకా అనేక రకాల కోర్సులు ఉన్నాయి. అంతే కాకుండా మారిన జీవన శైలికి అనుగుణంగా తమకు తాము బాస్ లుగా కూడా అయ్యే అనేక తరునోపాయాలు కూడా చాలా ఉన్నాయి. ఎంత బ్రతుకు బ్రతికి ఇలాంటివా అనుకోకుండా గొర్రెలు, ఈము కోళ్ళు, పుట్ట గొడుగుల పెంపకం, పాడి పరిశ్రమ, కోళ్ళు, తేనెటీగలు, కూరగాయల సాగు, నర్శరీ వంటి వాటితో పాటు చిన్నపాటి బిజినెస్ లు చేయడంతో తమ కాళ్ళ మీద నిలబడుకోవడంతో పాటు ఇంకో ఇద్దరికీ మీరే ఉపాధి కల్పించే అవకాశం ఉన్నది. ముక్యంగా వీటిని సమర్ధవంతంగా నిర్వహించడానికి తగిన ఓర్పుతోపాటు... ఎదుటివారిని ఆకట్టుకునే లక్ష్యణాలు పుష్కలంగా ఉండాలి. అంతే కాదు మనం దేనినైతే పెట్టడలచుకున్నామో వాటి గురించిన పూర్తి అవగాహణ పెంచుకోవడంతో పాటు సమాచారాన్ని ఇతరుల నుంచి రాబట్టుకుని వారి సలహాలను పాటిస్తే మిమ్మల్ని మించిన వారు ఉండరు. ప్రస్తుతం చాలా మంది యువత ఇలాంటి అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు సాగుతోంది. వీటికి ప్రభుత్వ సాయం కూడా పుష్కలంగా లభిస్తుంది. 

 

జన రంజకమైన వార్తలు