• తాజా వార్తలు
  •  

విద్యా వ్యవస్థలో సరికొత్త అధ్యాయం ట్యూషన్ యాప్స్

ట్యూషన్ పోయి ట్యూషన్  యాప్స్ వచ్చే డాం డాం డాం

బైజు క్లాసెస్, ఫ్లిప్ ట్యూటర్, విద్యా నెక్స్ట్ లక్షల్లో డౌన్లోడ్ లు

రోజురోజుకీ విద్యా వ్యవస్థ సరికొత్త పోకడలను సంతరించుకుంటుంది. పూర్వకాలం లో గురుకులాలలో కొనసాగిన విద్య కాలానుగుణంగామార్పులు చెందుతూ పాఠశాల, కళాశాల ల స్థాయి కి చేరుకుంది. నేటి విద్యాలయాల లో బోధించే విద్య సరిపోకనో లేక మరే ఇతర కారణం తోనో ట్యూషన్ ల సంస్కృతి పెరిగి పోయింది. ఇది మంచిదా కాదా అనే విషయం కాసేపు పక్కన పెడితే సాంకేతికత కోణం లో చూసినపుడు ఈ ట్యూషన్ ల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. ఎందుకంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఆన్ లైన్ ట్యూషన్ ల ద్వారా ఉపాధిని పొందుతున్న వారి సంఖ్య నేడు గణనీయంగా ఉన్నది. కేవలం ఆన్ లైన్ ట్యూషన్ ల మీద ఆధార పడుతూ నెలకు సుమారు ఇరవై నుండీ ముప్పై వేల రూపాయల పైనే సంపాదించే వారి సంఖ్య కూడా నేటి విద్యా ప్రపంచం లో బాగానే ఉంది. అయితే దీనికి పరాకాష్ట అన్నట్లుగా ట్యూషన్ యాప్స్ ఇప్పుడు రంగం లోనికి దిగాయి. ఇవి విద్యార్థికీ , ట్యూటర్ కీ మధ్య ఉండే అంతరాన్ని తగ్గించడంలో విశేష ప్రభావాన్ని చూపబోతున్నాయి.

బైజు క్లాసు ల గురించి మీరు వినే వుంటారు. ఇది బెంగుళూరు కేంద్రం గా పనిచేస్తుంది. పాఠశాల స్థాయి నుండీ సివిల్ సర్వీసెస్ స్థాయి వరకూ అన్ని రకాల కోచింగ్ లనూ ఇది ఇస్తుంది.  ఆఫ్ లైన్ మోడల్ అయితే కొన్ని వేల మందికి పాఠాలు చెప్పవచ్చు. అదే ఆన్ లైన్ అయితే.... స్మార్ట్ ఫోన్ అయితే.... యాప్ అయితే .....  కొన్ని లక్షల మందికి పాఠాలు చెప్పవచ్చు.ఇదే అంశం ప్రాతిపదిక గా తీసుకుని బైజు సంస్థ ఒక సరికొత్త యాప్ ను విడుదల చేసింది. అలాగే మరొక విద్యా సంబందిత సంస్థ అయిన విద్యా నెక్స్ట్ కూడా బైజు బాటలోనే పయనించి సరికొత్త ట్యూషన్ యాప్ ను విడుదల చేసింది. యాప్ లు రెండు అయినప్పటికీ వీటి ఉద్దేశం మాత్రం ఒక్కటే. అదే ట్యూటర్ మరియు విద్యార్ధి మధ్య ఉండే అంతరాన్ని తగ్గించడమే.

సాంకేతిక ప్రపంచాన్ని స్మార్ట్ ఫోన్ లు ఏకచాత్రదిపత్యంగా ఏలుతూ ఉండడంతో ఏదైనా సరిగ్గా వినియోగదారుని చెంతకు చేరాలంటే ఇది ఒక్కటే మార్గం అని ఆలోచించిన ఈ సంస్థలు ట్యూషన్ సంబందిత యాప్ ను విడుదల చేసాయి. దీనికోసం ఇవి గేమిఫికేషన్ మరియు చాట్ ఆప్షన్ లను ఉపయోగించుకుంటాయి. ఒక ట్యూటర్ తన విద్యార్థిని ఎలా ట్రీట్ చేస్తాడో అలా ఇందులో ఆప్షన్ లు ఉంటాయి. అంటే విద్యార్ధి యొక్క సందేహాలను తీర్చడం, ప్రశ్నలు సంధించడం, పాఠాలు చెప్పడం, విద్యార్ధి తో కాసేపు సరదాగా ఉండడం ఇలా విద్యార్ధి యొక్క సమగ్ర వికాసానికి దోహద పడే విధంగా ఈ యాప్ లను డిజైన్ చేశారు. వీటి బాట లోనే మరొక సంస్థ అయిన ఫ్లిప్ క్లాస్  కూడా పయనించి ఫ్లిప్ ట్యూటర్ అనే యాప్ ను విడుదల చేసింది.

ఫ్లిప్ ట్యూటర్ నలభై వేల డౌన్ లోడ్ లను కలిగి ఉండగా బైజు 35 లక్షల డౌన్ లోడ్ లను కలిగి ఉన్నది. విద్యా నెక్స్ట్ ప్రస్తుతం 500 కంటే ఎక్కువ ట్యూటర్ లను కలిగి ఉన్నది.

విద్యార్ధి మరియు ట్యూటర్ ల మధ్య అంతరాన్ని తగ్గించే దిశగా ఈ యాప్ లు విజయం సాధించాయనే చెప్పాలి.

 

జన రంజకమైన వార్తలు