• తాజా వార్తలు
  •  

మైక్రో బోటిక్స్ లో మొదటి సారి కోర్సును ఆఫర్ చేయనున్న ఐఐటి –ఖరగ్ పూర్

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ –ఖరగ్ పూర్  మైక్రో బోటిక్స్ లో ఒక కోర్సును ప్రారంభించింది.దీనినే మైక్రో రోబోటిక్స్ అని కూడా పిలుస్తారు.ఇది సూక్ష్మ పరిమాణం లో ఉండే రోబోట్ లతో అంతకంటే చిన్నవైన వస్తువులను హేండిల్ చేసే శాస్త్రం. ఒక భారత విద్య సంస్థలో మైక్రోబోటిక్స్ లేదా నానో రోబోటిక్స్ కు సంబందించిన ప్రవేశ పెట్టడం ఇదే మొదటిసారి.ఇండియన్ –ఫారిన్ విద్యా సంస్థల మధ్య పరిశోధనా అంశాలను బలోపేతం చేసేందుకు గ్లోబల్ ఇనిషియేటివ్ ఆఫ్ అకడమిక్ నెట్ వర్క్స్ ( GIAN) అనే కార్యక్రమం లో భాగంగా ఈ కోర్సు ఆఫర్ చేయబడింది.

రోబోటిక్స్ ను ఇంజినీరింగ్ లోని వివిధ శాఖలైన మెకానికల్ ఇంజినీరింగ్ ,ఓషన్ ఇంజినీరింగ్,మెటీరియల్ సైన్సు  తదితర విభాగాలలో బోధిస్తున్నప్పటికీ, ఒక భారత విద్య సంస్థలో మైక్రోబోటిక్స్ లేదా నానో రోబోటిక్స్ కు సంబందించిన ప్రవేశ పెట్టడం ఇదే మొదటిసారి.దీని యొక్క అప్లికేషను లను ఆటోమేటెడ్ అండర్ వాటర్ వెహికల్ ,ఆటోమేటెడ్ గ్రౌండ్ వెహికల్ లలో మనుషులు గుర్తించలేని ప్రదేశాలను గుర్తించడానికి,స్పై రోబోట్ లలోనూ,హెల్త్ కేర్ రంగం లోనూ ఉపయోగిస్తారు.

ఐఐటి-ఖరగ్ పుర నుండీ మరియు ఇతర కళాశాల లనుండీ సుమారు 60 మంది విద్యార్థులు ఇప్పటికే ఈ కోర్సు కు దరఖాస్తు చేసుకున్నారు.రోబోటిక్స్ లోనూ ప్రత్యేకించి మైక్రో రోబోటిక్స్ లోనూ వాటియొక్క వాణిజ్య అనువర్తనాలలోను పరిశోధనలు చేసే దిశలో ఐఐటి –ఖరగ్ పూర్ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.

సూక్ష్మ స్థాయి రోబోటిక్ శాస్త్రమునే మైక్రో బోటిక్స్ అని అంటారు.వీటిలో ఉపయోగించే మొబైల్ రోబోట్ ల యొక్క పరిమాణం 1 మిల్లి మీటర్ కంటే తక్కువగా ఉంటుంది.కొన్ని ప్రత్యేక మైన పనులను అత్యంత ఖచ్చితంగా చేయడానికి డిజైన్ చేసిన అత్యంత చిన్న యంత్రాన్నే  నే నానో రోబోట్ అని పిలుస్తారు.నానో మీటర్ అంటే ఒక మీటర్ లో బిలియన్ భాగం అని అర్థం.ఈ రోబోటిక్స్ అనేది ఇంజినీరింగ్ లోని వివిధ బ్రాంచ్ లైన ఎలక్ట్రికల్,ఎలక్ట్రానిక్స్,మెకానికల్,కంప్యూటర్ సైన్సు ల యొక్క సమీకృత శాస్త్రం గా చెప్పుకోవచ్చు.ఎందుకంటే రోబోట్ ల యొక్క డిజైన్ లోనూ,నిర్మాణం లోనూ,ఆపరేషన్ లోనూ,అనువర్తనాల లోనూ,కంట్రోల్ మరియు ఫీడ్ బ్యాక్ లోనూ ,ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ లోనూ పై ఇంజినీరింగ్ విభాగాలను విరివిగా ఉపయోగిస్తారు.

స్విట్జెర్లాండ్ నుండీ భారత్ ఐఐటి లనుండీ ప్రముఖ అధ్యాపకులను దీనిని బోధించడానికి ఐఐటి ఖరగ్ పూర్ ఏర్పాట్లు చేసింది.

 

జన రంజకమైన వార్తలు