• తాజా వార్తలు
  •  

కంప్యూటర్ సంబంధిత కోర్సులు

నేడు ఇంటా బయట కంప్యూటర్ల వాడకం తప్పనిసరైంది. ప్రైవేటు సంస్థల నుంచి ప్రభుత్వ కార్యాలయాల వరకు, వివిధ వాణిజ్య, వ్యాపార సంస్థలు తమ రోజువారీ విధుల కోసం కంప్యూటర్లపై ఆధారపడుతున్నారు. సాఫ్ట్ వేర్ కంపెనీల సంగతి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ నేపథ్యంలో కంప్యూటర్ సంబంధిత కోర్సులు అభ్యసించినవారికి అపార అవకాశాలు స్వాగతం పలుకుతున్నాయి.

 
కోర్సులు :

సర్టిఫికెట్ కోర్స్ ఇన్ కమ్యూనికేషన్ అండ్ ఐటీ స్కిల్స్  కమ్యూనికేషన్ స్కిల్స్ ఫర్ బీపీవో, ఐటీ సంబంధిత రంగాలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వీటిని ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ అందిస్తోంది.

వెబ్‌సైట్ :

www.ignou.ac.in

మన రాష్ట్రంలో సెట్విన్ కంప్యూటర్ సంబంధిత సర్టిఫికెట్ కోర్సులను ఆఫర్ చేస్తోంది. కోర్సుల వివరాలు..
సర్టిఫికెట్ కోర్స్ ఇన్ కంప్యూటర్ హార్డ్‌వేర్ (వ్యవధి: మూడు నెలలు)

అర్హత :

పదో తరగతి పాస్/ఫెయిల్ సర్టిఫికెట్ కోర్స్ ఇన్ కంప్యూటర్ అకౌంటెన్సీ (బేసిక్, అడ్వాన్స్‌డ్) (వ్యవధి: 45 రోజులు)

అర్హత :

బేసిక్ కోర్సుకు ఇంటర్, అడ్వాన్స్‌డ్‌కు బీకాంలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వెబ్‌సైట్:

www.setwinapgov.org

అవకాశాలు :

హార్డ్ వేర్ కోర్సులు పూర్తిచేస్తే కంప్యూటర్ సర్వీసెస్ రంగాల్లో, సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో అవకాశాలుంటాయి. అకౌంటెన్సీ కోర్సులు పూర్తిచేసినవారు వివిధ వ్యాపార, వాణిజ్య కార్యాలయాల్లో అకౌంటెంట్‌గా పనిచేయొచ్చు.

వేతనాలు :

ప్రారంభంలో నెలకు రూ.10,000 అందుకోవచ్చు.

 

జన రంజకమైన వార్తలు