• తాజా వార్తలు
  •  

భార‌త్‌లో పిల్ల‌ల సాంకేతిక విద్య కోసం గూగుల్ 8.4 మిలియ‌న్ డాల‌ర్ల సాయం

పిల్ల‌ల‌కు చ‌దువు అంటేనే ఇప్పుడు సాంకేతికత‌తో ముడిపెట్టిన అంశంగా మారింది. ఈ స్థాయి విద్య‌లోనైనా కంప్యూటర్ ఒక భాగ‌మైపోయింది. ఇప్పుడు కిండ‌ర్‌గార్డెన్ విద్యార్థుల‌కు కూడా ట్యాబ్‌ల ద్వారా చ‌దువు చెబుతున్నారు. భార‌త్‌లో పాఠ‌శాల స్థాయి నుంచే సాంకేతిక విద్య విస్త‌రిస్తోంది. ఇప్పుడు ప‌ట్ట‌ణాల్లో ఎక్కువ‌గా ఉన్న సాంకేతిక విద్య నెమ్మ‌దిగా చిన్న గ్రామాల‌కు కూడా పాకుతోంది. ఈ నేప‌థ్యంలో భార‌త్‌లో సాంకేతిక విద్య కోసం నిధులు అందించాల‌ని ఇంట‌ర్నెట్ దిగ్గ‌జం గూగుల్ నిర్ణ‌యించింది. విద్యార్థుల సాంకేతిక విద్య‌కు చేయూత ఇవ్వ‌డానికి 8.4 మిలియ‌న్ డాల‌ర్లు గ్రాంట్‌గా అందించడానికి గూగుల్ సంస్థ ముందుకొచ్చింది. భార‌త్‌లో పిల్ల‌ల చ‌దువు కోసం కృషి చేస్తున్న నాలుగు నాన్ ప్రొఫిట్ సంస్థ‌ల‌కు ఈ గ్రాంట్ అందించాల‌ని గూగుల్ నిర్ణ‌యించింది.
గ్రామీణ ప్రాంతాల పిల్లలు ఏ వ‌స‌తులు లేకుండా చ‌దువుకోవాల్సి వ‌స్తుంద‌ని... దీని వ‌ల్ల వాళ్లు భ‌విష్యత్‌లో సాంకేతిక విద్య నేర్చుకోవ‌డానికి చాలా ఇబ్బంది ప‌డుతున్నారని గూగుల్ చెబుతోంది. వారికి ఫౌండేష‌న్ మంచిగా ఉంటే మున్ముందు వారు టెక్మిక‌ల్‌గా సౌండ్‌గా ఉంటార‌నేది గూగుల్ మాట‌. ప్రాత‌మ్ బుక్స్ స్టోరీ వీవ‌ర్స్ (3.6 మిలియ‌న్ డాల‌ర్లు), ప్రాత‌మ్ ఎడ్యుకేష‌న్ ఫౌండేష‌న్ (3.1 మిలియ‌న్ డాల‌ర్లు), మిలియ‌న్ స్వార్క్స్ ఫౌండేష‌న్ (1.2 మిలియ‌న్ డాల‌ర్లు), లెర్నింగ్ ఇక్వాలిటీ (5 ల‌క్ష‌ల డాల‌ర్లు) సంస్థ‌ల‌కు గ్రాంట్లు అందించిన‌ట్లు గూగుల్ చెప్పింది. పిల్ల‌ల సాంకేతిక విద్య‌ను విస్తరించ‌డానికి తాము రెండేళ్ల పాటు ఈ ఎంజీవోల‌కు సాయం చేస్తామ‌ని ఆ సంస్థ వెల్ల‌డించింది.
స‌మాజ సేవ కోసం పాటుప‌డుతున్న నాన్ ఫ్రొఫిట్ సంస్థ‌ల కోసం ఉద్దేశించిన 50 మిలియ‌న్ డాల‌ర్ల నిధి నుంచి ఈ గ్రాంట్లు మంజూరు చేసిన‌ట్లు గూగుల్ పేర్కొంది. భార‌త్‌లో 260 మిలియ‌న్ల మంది విద్యార్థులు ఉంటే వారిలో ఐదో త‌ర‌గ‌తి చ‌దువుతున్న విద్యార్థులు.. రెండో త‌ర‌గ‌తి లెక్క‌లు కూడా చేయ‌లేక‌పోతున్నార‌ని.. దీనికి కార‌ణంగా సాంకేతిక లోప‌మేన‌ని ఆ సంస్థ తెలిపింది. ఈ గ్యాప్‌ను తొల‌గించేందుకే తాము త‌క్కువ త‌ర‌గతుల నుంచే సాంకేతిక విద్య‌ను ప్రోత్స‌హిస్తున్న‌ట్లు తెలిపింది. ఎడ్యుకేష‌న్ మెటీరియ‌ల్ లేక‌పోవ‌డం వ‌ల్ల విద్యార్థులు ఎంతో కోల్పోతున్నార‌ని వారి అవ‌స‌రాలు తీర్చ‌డానికే గూగుల్ ముదుకొచ్చి సాయం అందిస్తోంద‌ని పేర్కొంది.

జన రంజకమైన వార్తలు