• తాజా వార్తలు
  •  

ఈ ప‌రిస్థితుల్లో SAP తో కెరీర్ క‌రెక్టేనా?

సాంకేతిక విద్య‌... ప్ర‌పంంచాన్ని శాసిస్తున్న రంగ‌మ‌ది. కంప్యూట‌ర్లు విస్త‌రించాక‌.. ప్ర‌పంచం చిన్న‌బోయింది. ఏం కావాల‌న్నా.. ఏం చేయాల‌న్నా అన్ని చిటికెలోనే!! దీనికంత‌టికి కార‌ణం కంప్యూట‌ర్లు.. వాటిని న‌డిపించే సాంకేతిక నిపుణులు! కంప్యూట‌ర్ బూమ్‌తో ఒక‌ప్పుడు యువ‌త ఊగిపోయింది. మాకు సాఫ్ట్‌వేర్ జాబే కావాలి అని ప్ర‌తి కంపెనీ గ‌డ‌పా తొక్కింది. అమీర్‌పేట ఆ పేటా.. ఈ పేటా అని లేకుండా ఏ కోర్సు ప‌డితే ఆ కోర్సులు నేర్చ‌కుంది. జావా ద‌గ్గ‌ర నుంచి మొద‌లుకుని ఎలా ఎన్నో క్రాష్‌కోర్సులు సాష్ట్‌వేర్ రంగంలో దూసుకొచ్చాయి. ప‌రిస్థితికి త‌గ్గ‌ట్టుగా ట్రెండ్‌కు స‌రితూగేట్టుగా కోర్సులు కూడా మారిపోయాయి. అలా వ‌చ్చేందే ఎస్ఏపీ (సిస్ట‌మ్‌, అప్లికేష‌న్స్‌, ప్రొడెక్ట్స్‌). ఇది సాఫ్ట్‌వేర్ రంగాన్నిఒక ఊపు ఊపేసింది. ఇప్పూడూ ఇదే లీడింగ్‌లో ఉంది. ఐతే ఎస్ఏపీని నేర్చుకుని సాఫ్ట్‌వేర్ కెరీర్‌ను కొన‌సాగించ‌డం ఇప్ప‌టి ప‌రిస్థితుల్లో స‌రైన‌దేనా?

కంపెనీలు కోరుకుంటున్నాయ్‌..
ఎస్ఏపీ నిపుణులు కావాల‌ని పెద్ద పెద్ద కంపెనీలు కోరుకుంటున్నాయి. అందుకే ఈ అర్హ‌త ఉన్న వారికే మాగ్జిమ‌మ్ జాబ్స్ ఇస్తున్నాయి. దీనికి కొన్ని కార‌ణాలు కూడా ఉన్నాయి. ఇంప్లిమెంటింగ్‌, కస్ట‌మైజింగ్‌లో ఎస్ఏపీ స్పెష‌లిస్టులు ముందుంటారు. పెద్ద పెద్ద కంపెనీలు ప్రాజెక్టులు న‌డ‌వాలంటే ఎస్ఏపీ మాడ్యుల్ త‌ప్ప‌నిస‌రి. గ్లోబ‌ల్ బిజినెస్‌ల‌కు కూడా ఇప్పుడు ఇదే మాడ్యుల్‌ను ఉప‌యోగిస్తున్నారు. అందుకే ఇప్ప‌టికే ఎస్ఏపీకి గిరాకీ ఉంది. ఇంకా క్రాష్‌కోర్సులు న‌డుస్తున్నాయి. ముఖ్యంగా అనుభ‌వం ఉన్న ఎస్ఏపీ నిపుణులు ఎంత పాకేజ్ పెట్టి ద‌క్కించుకునేందుకైనా కంపెనీలు పోటీప‌డుతున్నాయి.

ఎక్స్‌టెండెడ్ నెట్‌వ‌ర్క్‌
ఎస్ఏపీకి ఆద‌ర‌ణ ఉన్నా.. కూడా సాఫ్ట్‌వేర్‌లు కొత్త పుంత‌లు తొక్కుతున్న ఈ కాలంలో అదొక్క‌టే స‌రిపోద‌నేది నిపుణుల అభిప్రాయం. మ‌నుగ‌డ సాగించాలంటే ఎస్ఏపీకి అద‌నంగా మ‌రింత అప్‌డేటెడ్ సాఫ్ట్‌వేర్‌ల‌ను అధ్య‌య‌నం చేయాల్సి ఉంద‌ని సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్ల‌కు నిపుణులు స‌ల‌హా. ఎస్ఏపీలో ఉన్న వైవిధ్యం, దాని నేచ‌ర్‌, ఏ కంపెనీకి అయినా సెట్ అయ్యే సానుకూల‌త వల్ల ఎక్కువ‌మంది ఉప‌యోగిస్తున్నార‌ని.. అయితే రాబోయే రోజుల్లో మ‌రింత వైవిధ్యంగా సాఫ్ట్‌వేర్లు ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెబుతున్నారు. నిజానికి ఎస్ఏపీ అనేది సాఫ్ట్‌వేర్ రంగానికి చాలా అవ‌స‌రం. అయితే ఇది మ‌రింత మెరుగుప‌డితేనే రాబోయే రోజుల్లో ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది. ఎస్ఏపీ ఈఆర్‌పీని సాధార‌ణంగా పెద్ద పెద్ద కంపెనీలు మాత్ర‌మే ఉప‌యోగిస్తున్నాయి. అయితే అంద‌రికి ఇలాంటి సాఫ్ట్‌వేర్ అందుబాటులోకి రావాల్సి ఉంది. ఒక పెద్ద కంపెనీలో స్వ‌ల్ప వ్య‌వ‌ధికి ప‌ని చేయాల‌నుకుంటే ఎస్ఏపీకి మించింది లేదు. అదే సుదీర్ఘ కాలం అని ఆలోచిస్తే ఇందులో స్పెష‌లైజేష‌న్ చేయ‌డం మేలు.

జన రంజకమైన వార్తలు