• తాజా వార్తలు
  •  

పేదరికం కారణంగా నక్షలిజo వైపు చూస్తున్న గిరిజన యువతకు సాంకేతిక విద్య...

 

చిప్స్ మరియు సి డాక్ ప్రయోగం విజయవంతం    

మన దేశం లోనే అత్యధిక గిరిజన జనాభా కలిగిన రాష్ట్రం ఏదో తెలుసా? చత్తీస్ ఘడ్ . ఈ రాష్ట్రం దేశం లో అత్యధిక గిరిజన జనాభాను కలిగి ఉండడమే గాక మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రా లలో మొదటి వరుసలో ఉంటుంది.   ఈ రాష్ట్రం లో ని SC మరియు ST ల జనాభా రాష్ట్ర జనాభాలో 50 శాతం పైగానే ఉంటుంది. మానవ అభివృద్ది సూచీ లో ఈ రాష్ట్రం దేశం లోనే అట్టడుగు స్థానం లో ఉన్నది. మొత్తం దేశం యొక్క మానవ అభివృద్ది సూచీ కంటే కూడా ఈ రాష్ట్ర సగటు సూచీ చాలా తక్కువగా ఉంది. అలాంటి రాష్ట్రం లోని గిరిజన యువత లో ఐటి నైపుణ్యాలను పెంచడం ద్వారా రాష్ట్ర అభివృద్ది తద్వారా మానవ అభివృద్ది సూచీ ని పెంచ వచ్చు అనే భావనతో  CHiPS అనే సంస్థ సత్వర చర్యలు తీసుకోబోతుంది.

(చత్తీస్ ఘడ్ ఇన్ఫో టెక్ ప్రమోషన్ సొసైటీ. )చత్తీస్ ఘడ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి సాంకేతిక పరిజ్ఞాన సంబందిత కార్యక్రమాలన్నీ  ఈ సంస్థే నిర్వహిస్తుంది.  తాజాగా రాష్ట్ర జనాభాలో అధిక శాతంగా ఉంటూ అభివృద్ది కి మాత్రం దూరం లో ఉంటున్న గిరిజన యువతకు సాంకేతిక నైపుణ్యాలను అందించడానికి ఈ సంస్థ నడుం బిగించింది.

ఈ  కార్యక్రమం లో భాగం గా గిరిజన యువతకే గాక సమాజం లో వెనుకబడిన తరగతులకు చెందిన యువతకు, ఆధునిక సమాజానికి చాలా దూరం లో ఉన్న యువతకు  సాంకేతిక నైపుణ్యాలను అందిపుచ్చుకోవడం లో శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ పొందే విద్యార్థులు ఐటి సంబందిత రంగాలలో ఉన్నత ఉద్యోగాలను సంపాదించడమే గాక ఐటి రంగం లో వ్యాపారాలను కూడా నిర్వహించే స్థాయికి వీరిని తీర్చి దిద్దడమే ఈ కార్యక్రమ లక్ష్యంగా ఉన్నది. ఈ మహోన్నత లక్ష్యం లో ఈ CHiPS కు కేంద్ర ఐటి మరియు ఎలక్ట్రానిక్స్ శాఖ మరియు , చెన్నై కు చెందిన సెంటర్ ఫర్ అడ్వాన్సు కంప్యూటింగ్ ( CDAC ) లు తమ సహాయ సహకారాలు అందిస్తాయి. ఈ కార్యక్రమం లో రెండు సంవత్సరాల కాల వ్యవధి లో సుమారు 3000 మంది గిరిజన విద్యార్థులు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ( ICT ) లో శిక్షణ పొందుతారు. దీని కోసం రాష్ట్రం లోని వివిధ గిరిజన ప్రదేశాలలో ICT సెంటర్ లను ఏర్పాటు చేస్తారు. ఈ సెంటర్ లలో ప్రాథమిక అవసరాలైన కంప్యూటర్ లు, ప్రింటర్ లు, ప్రొజెక్టర్ లు ఇతర పరికరాలను ఏర్పాటు చేస్తారు. మొదటి విడతలో భాగం గా మూడు ప్రదేశాల లో ఈ సెంటర్ లను ఏర్పాటు చేశారు జగదల్ పూర్, రాజనంద్ గావ్, మరియు అంబికా పూర్ జిల్లాల ప్రధాన కేంద్రాల లో వీటిని ఏర్పాటు చేశారు. ఈ మూడు శిక్షణా కేంద్రాలు కూడా గత సంవత్సరం డిజిటల్ ఇండియా వీక్ సందర్భంగా ప్రారంభించ బడ్డాయి. అప్పటినుండి ఇప్పటి వరకు 329 మంది అభ్యర్థులు బేసిక్ మరియు అడ్వాన్సు కంప్యూటర్ కోర్స్ లలో ఈ మూడు కేంద్రాలలో శిక్షణ పొందారు.

కేవలం ఉద్యోగo కోసమే గాక యువతలో సాంకేతిక స్వయం ఉపాధి ని పెంపొందిoచేందుకు స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేసుకునే వీలును కూడా ఇక్కడ కల్పిస్తారు. ఈ కోర్స్ లలో శిక్షణ ఇచ్చేందుకు అభ్యర్థుల నుండి ఏ విధమైన ఫీజు ను వసూలు చేయరు. అంతా ఉచితమే.

 

జన రంజకమైన వార్తలు