• తాజా వార్తలు
  •  

కాంపిటీటివ్ ప్రపంచంలో ఆన్ లైన్ టెస్టుల హవా

ఇప్పుడు ఏ  ఉద్యోగార్థి నోట విన్నా ఒకటే మాట. అదే ఆన్ లైన్ టెస్ట్. బ్యాంకుల దగ్గరనుండి  ఇన్సురెన్స్ కంపెనీల దాకా అన్ని పోటీ  పరీక్ష లలొను ఒకటే విధానం.అదే ఆన్లైన్ పరీక్ష. ఏ దో కొంచెం అరిథ్ మేటిక్ మరికొంచెం, ఇంగ్లీష్ నేర్చుకుని కొన్ని జి కే అంశాలను గుర్తు పెట్టు కుని  వాటిని దింపేస్తే  చాలు అనుకునే  వారికి ఇది నిజంగా గడ్డు పరిక్షే. నిజంగా ఈ ఆన్ లైన్ పరీక్షలఅంత  కష్టం గా ఉంటాయా లేక అందరూ అన  వసరంగా భయ పడుతున్నారా? ఒక్క సారి విశ్లేషిద్దాం

ఏ పోటీ  పరీక్ష లో నై నా మొత్తం నాలుగు లేదా అయిదు విభాగాలు ఉంటాయి.ఈ అయిదు విభాగాల కు సంబం దించిన   ప్రశ్నలు మొత్తం, పరీక్షా పత్రం మీద ఇవ్వబడతాయి. వాటికి  సమాధానాలు omr షీట్ మీద గుర్తించవలసి ఉంటుంది. కానీ ఆన్ లైన్ పరీక్ష లో అలా కాదు. అభ్యర్థి వివరాల దగ్గారనుంది ప్రశ్నల వరకూ అన్నీ కం పుటర్ స్క్రీన్ మీద  ప్రత్యక్షమవుతాయి. వాటికి సమాధానాలు కూడా కంప్యూటర్ లోనే గుర్తించవలసి ఉంటుంది.ఇంతే. ఈ మాత్రం దానికి అనవసరంగా కంగారు పడి  ఆన్ లైన్ టెస్ట్ అంటేనే భయపడి పొతూ ఉంటారు. రెండు పరీక్షలకు  ప్రధానమైనే తేడా కంప్యూటర్ మాత్రమే. అది కూడా సాధారణ పరిజ్ఞానం సరిపోతుంది. ఏ  మాత్రం  భయ పడవలసిన అవసరం లేదు.

ఇక్కడ ఆసక్తి కరమైన విషయం ఏంటంటే ప్రముఖ తెలుగు దినపత్రికల యొక్క అనుబంద ఆన్  లైన్ విద్యా ఎడిషన్ లన్నీ ఈ ఆన్ లైన్ మోడల్ పేపర్ లను ఒక ప్యాకీజి రూపంలో అందిస్తున్నాయి. మొత్తం మూడు పేపర్ల ధర అయిదు వందల రూపాయల వరకూ ఉంటుంది. ఒక రకంగా చూస్తే అభ్యర్తులలో ఈ ఆన్ లైన్  పరీక్షలకు పట్ల భయం కలగడానికి ఈ ధోరణి కూడా  కొంత వరకూ కారణమేమో!

 

జన రంజకమైన వార్తలు