• తాజా వార్తలు

ఏపీ, తెలంగాణల్లో అందరినీ డిజిటల్ లిటరేట్స్ చేయడానికి కేంద్రం ప్లాన్ ఇదీ

ఇండియాను డిజిటల్‌ పథం తొక్కించేందుకు మోడీ కట్టుకున్న కంకణానికి న్యాయం చేయడంలో భాగంగా దేశ ప్రజల్లో డిజిటల్ అక్షరాస్యత పెంపొందించడానికి ఎస్‌ఏపీ ఇండియా, ఎల్‌అండ్‌టీ, ఐటీసీ సంయుక్తంగా సామాజిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా యువత, గ్రామీణ ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. దీనికోసం ‘కోడ్‌ ఉన్నతి’ పేరుతో ఒక కొత్త సామాజిక బాధ్యత ప్రాజెక్టును ప్రారంభించారు.
ఎస్ఏపీ నుంచి సాఫ్ట్ వేర్ నిపుణులు
గ్రామీణ ప్రాంత ప్రజలకు, యువతలో ఉద్యోగ నైపుణ్యానికి అవసరమైన కంప్యూటర్‌ విద్యపై శిక్షణ ఇస్తారు. దీని కోసం ఎస్‌ఏపీ సాఫ్ట్‌వేర్‌తోపాటు నిపుణులను అందిస్తే.. ఎల్‌అండ్‌టీ, ఐటీసీ చారిటబుల్‌ ట్రస్ట్‌లు మారుమూల గ్రామలకు వెళ్లి కోడ్‌ ఉన్నతి కేంద్రాలను ఏర్పాటు చేసి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తాయి.
100 శిక్షణ కేంద్రాలు
వివిధ రాష్ట్రాల్లో 100 శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని, ఇప్పటికే రాజస్తాన్‌లో 33, మహారాష్ట్రలో 3 కేంద్రాలు ప్రారంభించినట్టు ఎస్‌ఏపీ వెల్లడించింది. వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలురాష్ట్రాల్లో ప్రారంభించనున్నట్టు ఎస్‌ఏపీ ఇండియా అధ్యక్షుడు, ఎండీ దీప్‌సేన్‌ గుప్తా తెలిపారు.

జన రంజకమైన వార్తలు