• తాజా వార్తలు
  •  

ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారిలో 60% నిరుద్యోగులే

మన రాష్ట్రం లో ఇంజినీరింగ్ మరియు మెడికల్ లకు కలిపి ఒకటే ఎంట్రన్స్ టెస్ట్. కానీ మెడిసిన్ పూర్తి చేసిన వారు ఏదో ఒక రకంగా స్థిరపడుతుంటే ఇంజినీరింగ్ చేసిన వారు మాత్రం ఎందుకూ పనికి రాకుండా పోతున్నారు. అవును ఇది నిజం. అల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ( AICTE ) చెబుతున్న గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా సంవత్సరానికి 8 లక్షల మందికి పైగా ఇంజినీరింగ్ పట్టా తీసుకుని బయటకు వస్తుంటే వారిలో సుమారు 60% మంది నిరుద్యోగులే. అంటే సంవత్సరానికి సుమారుగా 5 లక్షల మంది విద్యార్థులు ఇంజినీరింగ్ పూర్తి చేసి కూడా ఏ పనీ చేయకుండా ఖాళీగా తిరుగుతున్నారన్నమాట. మ్యాన్ పవర్ అనేది ఎంత లాస్ అవుతుందో తెలుసా? 20 లక్షల మంది పని చేయకపోతే ఎంత నష్టం వస్తుందో వీరి వలన అంత నష్టం వస్తుంది. అదే ఈ 20 లక్షల మంది పని చేస్తే అది దేశాభివ్రుద్ది కి ఎంతగానో ఉపయోగపడుతుంది కదా! మరి లోపం ఎక్కడుంది. కేవలం ధనార్జనే ప్రధాన ధ్యేయం గా నిబందనలకు విరుద్దంగా ప్రవేశాలు కల్పిస్తున్న ఇంజినీరింగ్ కళాశాల లోనే అంతా లోపం ఉంది. దీనికి రాజకీయ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. దాదాపు సగానికి పైగా కాలేజీ లలో విద్యా ప్రమాణాలు సరిగ్గా లేవు. భారత మానవ వనరుల అభివృద్ది శాఖ దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మానవ వనరులు అది కూడా యువత లో ఈ స్థాయి లో వృధా అవుతుంటే దానిని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం పై ఉన్న విషయాన్ని గుర్తించింది. దీనిలో భాగంగా భారత సాంకేతిక విద్య లో ఒక భారీ మార్పుకు శ్రీకారం చుట్టబోతోంది.
2018 జనవరి నుండీ దేశ వ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్ కళాశాలలు అన్నింటికీ కామన్ గా ఒకే ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించే యోచనలో ఉంది. మెడికల్ కు కూడా ఇలాగే దేశ వ్యాప్తంగా నీట్ పరీక్ష ఉన్న సంగతి మనకు తెలిసిందే. అది అనేక విమర్శలను ఎదుర్కొంటున్న నేపథ్యం లో మరి ఈ ఇంజినీరింగ్ ఎంట్రన్స్ ను ప్రభుత్వం ఏ విధంగా నిర్వహించగలదో చూడాలి. ఈ పరీక్ష తో పాటు వార్షిక టీచర్ ట్రైనింగ్ ను మరియు కరిక్యులం రివిజన్ ను కూడా తప్పనిసరి చేసే యోచనలో భారత మానవ వనరుల శాఖఉంది. భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఏ మేరకు సత్ఫలితాలను ఇస్తుందో చూడాలి.

జన రంజకమైన వార్తలు