• తాజా వార్తలు

2045 నాటికి సగం ఉద్యోగాలు రోబోలవే

రోబో సినిమా తెలుసు కదా! ఒక ప్ర‌త్యేక సామ్రాజ్య‌మే సృష్టిస్తారు రోబోల‌తో!  ఏ ప‌ని చేయాల‌న్నా రోబోతో సాధ్య‌మే అన్న‌ట్లు చూపిస్తారు. కానీ అది సినిమా! ఊహ‌కంద‌నవి చాలా సృష్టించొచ్చు. అయితే త్వ‌ర‌లోనే రోబో సామ్రాజ్యం రాబోతుంద‌ట‌. ఆ సామాజ్యం ఎంత‌గా  విస్త‌రించ‌బోతుందంటే మ‌నుషుల‌కు ఉద్యోగాలు దొర‌క‌నంత‌గా!  ఇది నిజం! కానీ ఇలా జ‌ర‌గాలంటే చాలా ఏళ్లు ప‌డుతుంది. 2045 నాటికి ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా ల‌భిస్తున్న ఉద్యోగాలు స‌గానికి పైగా రోబోలే చేసే రోజులు రాబోతున్నాయ‌ట‌.  అన్ని ఉద్యోగాలు రోబోలు చేసే రోజులు రావ‌డంతో మ‌నుషుల‌కు నిరుద్యోగ స‌మ‌స్య మ‌ళ్లీ ఎదుర‌వుతుంద‌ట‌.  ఇది విడ్డూరంగా ఉన్నా టెక్నాల‌జీ విప‌రీతంగా పెరుగుతున్న నేప‌థ్యంలో భ‌విష్య‌త్‌లో  మ‌నుషుల కంటే రోబోల‌కే ఎక్కువ విలువ ఉంటుంద‌ని వాటికే ఉద్యోగాలు ల‌భిస్తాయ‌ని నిపుణుల మాట‌.

వ‌చ్చే 30 ఏళ్ల‌లో ఈ ప్ర‌పంచంలో స‌గం మంది ఉద్యోగులు మిష‌న్ల‌కు త‌మ జాబ్‌లు కోల్పోవాల్సి వ‌స్తుంద‌ని  హోస్ట‌ల్‌లోని రైస్ యూనివ‌ర్సిటీ ప‌రిశోధ‌క‌లు తెలిపారు. ఆటోమెటెడ్ డ్రైవింగ్‌, సెక్స్ రోబోలు కూడా త్వ‌ర‌లోనే త‌యారు కాబోతున్నాయ‌ని ఈ విశ్వ విద్యాల‌యం వెల్ల‌డించింది.  దీని వ‌ల్ల నిరుద్యోగం పెరిగే అవ‌కాశం ఎలా ఉన్నా... ఈ రోజుల్లోలా ఇంత బిజీగా మ‌నుషులు ఉండ‌ర‌ని తెలిపింది.  ఇది ఊహాజ‌నిత‌మే అయినా త్వ‌ర‌లోనే కార్య‌రూపం దాల్చే అవ‌కాశాలున్నాయ‌ట‌. దీంతో మ‌నుషులు బ‌ద్ద‌క‌స్తులుగా మారిపోయి యంత్రాల‌కు ప‌ని బాగా పెరిగిపోతుంద‌ట‌. 

అయితే ఉద్యోగాలు లేక‌పోవ‌డంతో చాలా స‌మ‌స్య‌లు ఎదుర్కొనే అవ‌కాశాలున్నాయ‌ట‌. ముఖ్యంగా మాన‌సిక ఒత్తిడి ఈ స‌మ‌స్య‌లో ప్ర‌ధాన‌మైంద‌ని ఆ యూనివ‌ర్సిటీ తెలిపింది. ఏళ్ల త‌ర‌బ‌డి గంట‌ల కొద్దీ ఆఫీసుల్లో ప‌ని చేయ‌డం అల‌వాటు అయిన వారికి ఇలా ఖాళీగా కూర్చొవ‌డం వ‌ల్ల ఎంతో అస‌హ‌నం, చిరాకు, కోపం పెరిగిపోతాయ‌ని ఒక స‌ర్వేలో తేలింది.  ముఖ్యంగా యునైటెడ్ కింగ్‌డ‌మ్ ఈ రోబోల తాకిడిని అధికంగా ఎదుర్కోబోతోంద‌ని ఈ స‌ర్వే చెబుతోంది.

 

జన రంజకమైన వార్తలు