• తాజా వార్తలు

ఫ్రెష‌ర్స్‌ను ఫైర్ చేసి..ఇంకా  ఫ్రెషర్స్‌ను రిక్రూట్ చేసుకుంటున్న ఐటీ కంపెనీలు

ఇండియ‌న్ ఐటీ ప‌రిశ్ర‌మ చిత్ర‌మైన ప‌రిస్థితిని ఎదుర్కొంంటోంది. ఒక‌ప‌క్క ఫ్రెష‌ర్స్‌ను జాబ్‌లు పీకి ఇంటికి పంపేస్తున్న మ‌రో ప‌క్క వంద‌ల సంఖ్య‌లో అంత‌కంటే ఫ్రెష‌ర్ల‌ను రిక్రూట్ చేసుకుంటున్నాయి. ఐటీ ఇండ‌స్ట్రీకి ప్ర‌స్తుతానికి ఏమీ ఢోకా లేక‌పోయినా గ్రోత్ అయితే బాగా తగ్గింది.ఆటోమేష‌న్‌తో ఉద్యోగాలు తగ్గుతాయంటున్న కంపెనీలు.. స్కిల్డ్ ఎంప్లాయిస్‌కు ఎలాంటి ఢోకా ఉండ‌ద‌ని చెప్పుకొస్తున్నాయి. ఈ ప‌రిస్థితుల్లో టెక్ మ‌హీంద్రా వంటి చాలా ఐటీ కంపెనీలు ఫ్రెష‌ర్స్‌ను జాబ్‌ల్లోంచి తీసేస్తున్నాయి.

ట్రైనింగ్ నుంచే మొద‌లు

క్యాంప‌స్ ఇంట‌ర్వ్యూల‌నీ, అవ‌నీ,ఇవ‌నీ ఫ్రెష‌ర్స‌ను జాయిన్ చేసుకుంటున్న‌కంపెనీలు త‌ర్వాత అందులో చాలామందిని వ‌దిలించుకోవ‌డానికి ప్లాన్స్ చేస్తున్నాయి.  ట్రైనింగ్ పిరియ‌డ్‌లో కావాల‌ని ఫెయిల్ చేయ‌డం, లేదంటే పోస్టింగ్ ఇచ్చేట‌ప్పుడు వారి ఛాయిస్‌కు భిన్నంగా ఎక్క‌డో పోస్టింగ్ ఇవ్వ‌డం వంటివి చేసి ఫ్రెష‌ర్స్‌ను ప్రెజ‌ర్ చేస్తున్నాయి. కొన్ని కంపెనీల‌యితే పోస్టింగ్ తీసుకుని అక్క‌డికి చేరేలోగానే రిజైన్ చేయ‌మని మెయిల్ పెట్ట‌డ‌మో ఫోన్ చేయ‌డ‌మో చేస్తున్నాయ‌ట‌.

మ‌రోవైపు భారీ రిక్రూట్‌మెంట్

మ‌రోవైపు పెద్ద ఐటీ కంపెనీలు భారీ ఎత్తున ఫ్రెష‌ర్స్‌ను తీసుకుంటున్నాయి.  ప్ర‌స్తుతానికి వివిధ ఐటీ కంపెనీల్లో ఎవాయిల‌బుల్‌గా ఉన్న ఓపెన్ పొజిష‌న్లు ఇవీ..

* యాక్సెంచ‌ర్ - 5,396

* క్యాప్‌జెమిని - 2,649

ఐబీఎం ఇండియా- 675

* గోల్డ్‌మ్యాన్ సాక్స్ - 320

* డెల్ - 285

* మైక్రోసాఫ్ట్ - 25

* ఒరాకిల్ - 1124

ఈ భారీ రిక్రూట్‌మెంట్స్‌ను ఇన్ఫోసిస్ కో ఫౌండ‌ర్ క్రిస్ గోపాల‌కృష్ణ‌న్ స‌మ‌ర్థించారు. మాసివ్ లే ఆఫ్స్ త‌న‌కేమీ క‌నిపించ‌లేద‌ని, బెస్ట్ పెర్‌ఫార్మ‌ర్ల కోసం  గ‌ట్టిగా ప్ర‌య‌త్నించేట‌ప్పుడు మామూలు స్కిల్స్ ఉండేవాళ్లు లేఆఫ్ అయ్యే అవ‌కాశం ఉంద‌న్నారు. టీమ్‌లీజ్ అనే ఐటీ స్టార్టింగ్ ఫ‌ర్మ్ జీఎం ధింగ్రా మాట్లాడుతూ ఈ  మూడు నెల‌ల్లో ఫ్రెష‌ర్ల రెజ్యూమ్స్ 30 శాతం పెరిగాయ‌ని చెప్పారు.  3 -5%  ఫ్రెష‌ర్స్ త‌మ పూర్ పెర్‌ఫార్మెన్స్‌తో ఏడాదిలోగానే ఇంటికెళ్లిపోతార‌ని, అయితే ఈ సంవ‌త్స‌రం ఆ ప‌ర్సంటేజ్ 7వ‌ర‌కు పెరిగింద‌ని చెప్పారు. మొత్తంగా చూస్తే ఐటీ ఇండ‌స్ట్రీలో ఫ్రెష‌ర్స్‌కు ఎప్పుడు ప్లేస్‌మెంట్ దొరుకుతుందో, ఎప్పుడు పింక్ స్లిప్ చేతికొస్తుందో అర్ధంకాని ప‌రిస్థితి నెల‌కొంది.

 

 

జన రంజకమైన వార్తలు