• తాజా వార్తలు
  •  

జీఎస్టీతో లక్ష ఉద్యోగాలు తక్షణం రెడీ అనేది నిజమేనా ?

 జులై 1 నుంచి దేశ‌వ్యాప్తంగా ఒకే ప‌న్ను  విధానం ఉండేందుకు సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ గూడ్స్‌, స‌ర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ)ని ప్ర‌వేశ‌పెట్ట‌బోతుంది. ఈ కొత్త ట్యాక్స్ సిస్ట‌మ్‌తో ఇండియాలో ల‌క్ష జాబ్‌లు వ‌స్తాయ‌ని రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలు అంచ‌నా వేస్తున్నాయి.  రాబోయే ఏడాది కాలంలో ఈ జాబ్‌లు వ‌స్తాయ‌ని చెబుతున్నాయి.
ఏయే సెక్టార్ల‌లో? 
ప‌లు రిక్రూటింగ్ ఏజెన్సీలు, ప్లేస్‌మెంట్ సంస్థ‌ల లెక్క‌ల ప్ర‌కారం జీఎస్టీ త‌క్ష‌ణం ల‌క్ష జాబ్‌ల‌ను తీసుకురాబోతోంది. ఆటోమొబైల్స్‌, లాజిస్టిక్స్‌, హోం డెకార్‌, ఈ-కామ‌ర్స్‌, మీడియా, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, సిమెంట్‌,. ఐటీ, క‌న్స్యూమ‌ర్ డూర‌బుల్స్‌, ఫార్మా, టెలికం రంగాల్లో ఈ జాబ్‌లు రాబోతున్నాయ‌ని అంచ‌నా.  
జీఎస్టీతో జాబ్‌లు ఎలా వ‌స్తాయి? 
జీఎస్టీ ఇంప్లిమెంటేష‌న్‌తో జాబ్స్ క్రియేష‌న్ రెండు ర‌కాలుగా ఉండబోతోంది. ఆటోమైబైల్స్‌, లాజిస్టిక్స్‌, భోం డెకార్స్ వంటి  అనార్గ‌నైజ్డ్ సెక్టార్లు ఆథ‌రైజ్డ్ సెక్టార్లుగా మార‌తాయి. ఆయా రంగాల్లో స్కిల్స్ ఉన్న‌వారికి డిమాండ్ పెరిగి వారికి ఉద్యోగావ‌కాశాలు పెరుగుతాయ‌ని ఇండియ‌న్ స్టాఫింగ్ ఫెడ‌రేష‌న్స్ ప్రెసిడెంట్ రితూపర్ణ చ‌క్ర‌వ‌ర్తి చెప్పారు.  ఇండియాలో జాబ్ క్రియేష‌న్‌లో జీఎస్టీ 10  నుంచి 13% యాన్యువ‌ల్ గ్రోత్ తీస‌కొస్తుంద‌న్నారు.  
* ఇక రెండో ర‌కం జీఎస్టీ బేస్డ్ అకౌంటింగ్‌, ఫైనాన్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేష‌న్ రంగాల్లో వ‌చ్చేజాబ్‌లు. జీఎస్టీ అనేది ఇండియ‌న్ బిజినెస్‌కు పూర్తిగా కొత్త కాబ‌ట్టి దీని ఫంక్ష‌నింగ్ బాగా జ‌ర‌గాలంటే టాక్సేష‌న్‌, అకౌంటింగ్‌, డేటా ఎనాల‌సిస్ వంటి రంగాల్లో జీఎస్టీ ఎక్స్‌ప‌ర్ట్‌ల‌కు  రాబోయే మూడు నాలుగు నెల‌ల్లో విప‌రీత‌మైన డిమాండ్ రానుంది. 
జీఎస్టీ అమ‌లైన తొలి మూడు నెల‌ల్లోనే ల‌క్ష జాబ్‌లు వ‌స్తాయ‌ని, జీఎస్టీలో యాక్టివీటి పెరిగాక మ‌రో 50 వేల‌కు పైగా జాబ్‌లు వ‌స్తాయ‌ని గ్లోబ‌ల్ హంట్స్ ఎండీ సునీల్ గోయ‌ల్ చెప్పారు.  

జన రంజకమైన వార్తలు