• తాజా వార్తలు
  •  

ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌ల్లో రిక్రూట్‌మెంట్‌కు లేటేస్ట్ ట్రెండ్స్ ఇవే...

ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌ల్లో జాయిన్ అవ్వాలంటే అదో పెద్ద ప్రాసెస్‌. ముందు నోటిఫికేష‌న్, ఎంట్రెన్స్ టెస్ట్‌, కౌన్సిలింగ్, వెబ్ చెకింగ్ ఇలా చాలా చాలా వ‌చ్చేశాయి. ఇటీవ‌లే ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌ల్లో రిక్రూట్‌మెంట్‌కు కూడా ఎన్నో కొత్త కొత్త ట్రెండ్స్ వ‌చ్చాయి. అవేంటో చూద్దామా...

కోర్ సెక్టార్ జాబ్స్

ముంబ‌యి, గ‌వ‌హాటి, రూర్కీ, ఖ‌ర‌గ్‌పుర్ లాంటి ఇండియ‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఐఐటీ)ల నుంచి మెరిక‌ల్లాంటి విద్యార్థుల‌ను రిక్రూట్ చేసుకోవ‌డానికి ఐటీ కంపెనీలు పోటీప‌డుతున్నాయి. ఇటీవ‌లే ఈ ప్ర‌క్రియ 25 శాతానికి పైగా పెరిగింది.  కోర్ ఇంజ‌నీరింగ్ సెక్టార్ నుంచి  విద్యార్థులను తీసుకోవ‌డానికి ఆ కంపెనీలు ముందుకొస్తున్నాయి. మాన్యుఫాక్చ‌రింగ్‌, ఇఫ్రాస్ట్ర‌క్చ‌ర్‌, పెట్రోలియం, మైనింగ్ త‌దిత‌ర విభాగాలు ఎక్కువ‌గా ఉంటున్నాయి. 

ఐఐటీ స్టార్ట‌ప్‌లు
ఐఐటీల్లో ఉండే బెస్ట్ టాలెంటెడ్ క్యాండిడేట్స్‌ను తీసుకుని స్టార్ట‌ప్ చేయ‌డానికి ప్ర‌ముఖ కంపెనీలు ప్ర‌య‌త్నిస్తున్నాయి. క్యాంప‌స్ ఇంట‌ర్వ్యూల ద్వారా ఇలాంటి మెరిక‌ల్లాంటి వారిని ఎంపిక చేసి వారికి ఉద్యోగాలు ఇవ్వ‌డానికి ఆ కంపెనీలు ప్ర‌య‌త్నిస్తున్నాయి. అవ‌స‌ర‌మైతే ఎంత శాల‌రీలు ఇచ్చైనా తీసుకోవ‌డానికి కంపెనీలు వెన‌కాడ‌ట్లేదు.

డేటా ఎన‌లిస్ట్‌, ఏఐ, యుఎక్స్‌, ఏఆర్ ఇంజ‌నీర్ల‌కే ప‌ట్టం
ఇప్పుడు ఎక్కువ కంపెనీలు డేటా ఎన‌లిస్ట్‌లు, ఏఐ, యుఎక్స్, ఏఆర్ లాంటి ఇంజ‌నీర్ల కోసం  కంపెనీలు క్యూ క‌డుతున్నాయి. ఎంత ప్యాకేజ్ ఇచ్చినా కూడా ఎలాగైనా ఈ ఇంజ‌నీర్ల‌ను హేర్ చేసుకోవ‌డానికి గూగుల్‌, యాహూ, విప్రో, టీసీఎస్ లాంటి సంస్థ‌లు ప్ర‌య‌త్నిస్తున్నాయి. దీని కోసం క్యాంప‌స్ ప్లేస్‌మెంట్ల ద్వారానే అంద‌ర్ని ఏరేస్తున్నాయి. 

రూ.39 ల‌క్ష‌లు పైనే
స‌రైన క్యాండిడేట్ ఉంటే జీతాల గురించి అస్స‌లు ప‌ట్టించుకోవ‌ట్లేదు కంపెనీలు. ఇటీవ‌ల న్యూట‌నిక్స్ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీ ఒక ఉద్యోగికి రూ.39.48 ల‌క్ష‌ల ప్యాకేజీ ప్ర‌క‌టించింది. బిట్స్ పిలాని యూనివ‌ర్సిటీ నుంచే ఎక్కువ‌మంది విద్యార్థులు ప్లేస్‌మెంట్స్ ద్వారా ఉద్యోగాల‌కు సెల‌క్ట్ అవుతున్నారు. ఇప్ప‌టికే 586 మంది స్టూడెంట్స్ ఇలాగే  ఎంపిక‌య్యారు. 

పేటీఎం, ఎక్సోటెల్ కూడా.
ఒక‌ప్పుడు క్యాంప‌స్ ప్లేస్‌మెంట్లు అంటే కేవ‌లం గూగుల్‌, విప్రో, టీసీఎస్ లాంటి సంస్థ‌లు మాత్ర‌మే చేసేవి. కానీ ఇప్పుడు ఆన్‌లైన్ పేమెంట్ సంస్థ‌లైన పేటీఎం లాంటివి కూడా ముందుకొస్తున్నాయి. పేటీఎంతో పాటు ఎక్సోటెల్‌, పెప్ప‌ర్ ఫ్రై లాంటి ఆన్‌లైన్ సంస్థ‌లు త‌మ‌కు కావాల్సిన కంప్యూట‌ర్ ఫ్రొఫెష‌న‌ల్స్ కోసం ఎంత ఖ‌ర్చైన పెట్ట‌డానికి వెనుకాడ‌ట్లేదు. ఈ సంస్థ‌లు 10 వేల మంది స్టూడెంట్స్‌ను ప్లేస్‌మెంట్ల కోసం పిలిచాయి. 

ఓవ‌ర్‌సీస్ ఆఫ‌ర్లు త‌గ్గిపోయాయి..
ఒక‌ప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్ అంటే చాలు ఏ అమెరికానో బ్రిట‌నో వెళ్లిపోయేవాళ్లు. కానీ ఈ ట్రెండ్ మారింది. భార‌త్‌లోనే ఒక మంచి జాబ్ కోసం అంతా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇదే ఆహ్వానించ‌ద‌గ్గ ప‌రిణామం. 

జన రంజకమైన వార్తలు