టెక్నాలజీ అనేది రోజురోజుకీ మారిపోతుంది. ఉదాహరణకు మీరు ఒక డేటా సైంటిస్ట్ గానో లేక డేటా ఇంజనీర్ గానో పనిచేస్తున్నారనుకోండి. మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్న టూల్ నెల రోజుల తర్వాత ఉండకపోవచ్చు లేదా అప్ డేట్ అవ్వవచ్చు. మరి వాటిని అందిపుచ్చుకోవాలంటే మారుతున్న టెక్నాలజీ తో పాటు ఉద్యోగి యొక్క నైపుణ్యాలు మారాలి. ఎప్పటికప్పడు టెక్నాలజీ తో పాటే అప్ డేట్ అవుతూ ఉండాలి. కేవలం ఉద్యోగులు మాత్రమే కాదు, ఉద్యోగార్థులు కూడా ఎప్పటికప్పుడు టెక్నాలజీ తో పాటు అప్ డేట్ అవుతూ ఉంటే మీకు మంచి డిమాండ్ ఉంటుంది. లేకపోతే ఎంత చదువు ఉన్నా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న మాదిరిగా పరిస్థితి ఉంటుంది. వివిధ రకాల ఉద్యోగాలు వాటి ఉద్యోగార్థులకు లేక ఉద్యోగులకు ఉండవలసిన నైపుణ్యాల గురించి బెంట్లీ యూనివర్సిటీ ఒక పరిశోధన చేసింది. వాటిలో టాప్ 10 స్కిల్స్ ను ఇక్కడ ఇస్తున్నాం. ఈ 10 స్కిల్స్ మీలో ఉంటే టెక్నలాజికల్ కంపెనీలకు మీరు మోస్ట్ వాంటెడ్ అభ్యర్థి గా ఉంటారు. అవ్నేతో ఈ ఆర్టికల్ లో చూద్దాం.
వివరణ:
ఎక్కువ డిమాండ్ ఉన్న స్కిల్ లలో మొదటి స్థానం లో ఉంటుంది బిగ్ డేటా. దీని డిమాండ్ లో అత్యధిక పెరుగుదల ఈ మద్య ఉన్నది. బిగ్ డేటా అనేది ఒక పదం మాత్రం. అంటే బిగ్ అంటే ఎంత పెద్ద డేటా నో ఇప్పటికీ ఒక నిర్దిష్ట నిర్వచనం ఏదీ లేదు. ఇది ఒక పదం అంతే. కానీ కంపెనీలు మాత్రం ఎక్కువ మొత్తం లో ఉండే ఇన్ఫర్మేషన్ ను సాధారణ సంప్రదాయక టూల్ లతో ఆర్గనైజ్ చేయలేని ఇన్ఫర్మేషన్ ను ఆర్గనైజ్ చేసే టూల్ లేదా స్కిల్స్ నే బిగ్ డేటా స్కిల్స్ గా పరిగణిస్తాయి.
Tableau అనేది ఒక డేటా విజువలైజేషన్ టూల్. ఇది డిమాండ్ లో మూడవ స్థానం లో ఉన్నది. అడ్వాన్స్డ్ చార్ట్ లు మరియు గ్రాఫ్ లను క్రియేట్ చేసుకునే సదుపాయాన్ని ఇది కల్పిస్తుంది. దీనికి కోడింగ్ అవసరం లేదు.
ఇక డిమాండ్ విషయం లో 4 వ స్థానం లో ఉన్నది NoSQL.ఎక్కువ మొత్తం లో ఉండే డేటా ను స్టోర్ చేసి అనలైజ్ చేసే టెక్నాలజీ నే ఇది. MySQL మరియు ఒరాకిల్ డేటా బేస్ లు దీని పాత వెర్షన్ లు. ఇవి కేవలం ఒకే ఒక్క మెషిన్ పై మాత్రమే పనిచేయగలవు. అదే NoSQL మాత్రం వివిధ రకాల మెషిన్ లపై కూడా పనిచేయగలదు. మీరు ఒక్కో మెషిన్ ను యాడ్ చేసేకొలదీ స్టోరేజ్ మరియు ప్రాసెసింగ్ పవర్ పెరిగినట్లే కదా.
పైథాన్ డిమాండ్ విషయం లో 7 వ స్థానం లో ఉన్నది.ఇది చాలా ముఖ్యమైన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్.డేటా ప్రాసెసింగ్, విజువలైజేషన్ మరియు మెషిన్ లెర్నింగ్ లను ఇది హ్యాండిల్ చేస్తుంది. ఇది జావా కు మాదిరిగా ఉండే ఒక సింపుల్ మరియు సాంప్రదాయ హై పవర్డ్ లాంగ్వేజ్.
మిగతా స్కిల్స్ కూడా ఏదీ దేనికీ తీసిపోని విధంగా ఉండేవే. ఈ స్కిల్స్ మీలో ఉంటే మీరు కంపెనీల మాట వినడం కాదు, కంపెనీలే మీ మాట వింటాయి.
"