• తాజా వార్తలు
  •  

 భార‌త్‌లో తొలి ఐటీ ఎంప్లాయిస్ యూనియ‌న్ ఆవిర్భ‌వానికి కార‌ణాలేమిటి? 

క‌ర్ణాట‌క‌లో రీసెంట్‌గాఐటీ ఎంప్లాయిస్ యూనియ‌న్ ఏర్పాటైంది.  ఇది ఇండియాలో తొలి ఐటీ ఎంప్లాయిస్ యూనియ‌న్‌. కుల‌మ‌తాలు, రిజ‌ర్వేష‌న్లు, పేద‌, ధ‌నిక తేడా లేకుండా కేవ‌లం టాలెంట్‌మీద జాబ్‌లు ఇచ్చి,  ల‌క్ష‌లు ల‌క్ష‌లు జీతాలు తీసుకుంటున్న మోస్ట్ వాల్యుబుల్ లేబ‌ర్ ఉన్న ఈ ఇండ‌స్ట్రీలో  ఎంప్లాయిస్ యూనియ‌న్ పుట్టుకురావ‌డానికి కార‌ణాలేమిటి? 

ఉద్యోగాలు పోతాయనే భ‌యం
ఆటోమేష‌న్‌, రోబోటిక్స్‌, మెషీన్ లెర్నింగ్‌.. టెక్నాల‌జీలో పుట్టుకొస్తున్న ఈ కొత్త సాంకేతికత‌లు ఐటీ ఎంప్లాయిస్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆటోమేష‌న్‌తో ఉద్యోగాలు త‌గ్గిపోయే ప‌రిస్థితి ఎంతో దూరంలో లేద‌ని తెలుస్తూనే ఉంది. స్కిల్డ్ ఎంప్లాయిస్‌కు ఎలాంటి ఢోకా లేద‌ని కంపెనీలు చెబుతున్నా ఎంప్లాయిస్ న‌మ్మే ప‌రిస్థితి లేదు.  టీసీఎస్‌లో అదే జరిగింది. భారీగా ఉద్యోగాలు కోల్పోయిన ఐటీ ఎంప్లాయిస్ అప్పుడు ల‌బోదిబోమంటూ  కార్మిక సంఘాల ద‌గ్గ‌ర‌కు ప‌రిగెత్తారు.  ఈ ప‌రిస్థితుల్లో క‌ర్నాట‌క‌లో ఐటీ ఎంప్లాయిస్ యూనియ‌న్ ప్రారంభ‌మైంది.
సీపీఎం బ్యాక‌ప్ 
క‌ర్నాట‌క స్టేట్ ఐటీ/ ఐటీ ఎంప్లాయిస్ యూనియ‌న్ (KITU) ను  ట్రేడ్ యూనియ‌న్ యాక్ట్‌, క‌ర్నాట‌క ట్రేడ్ యూనియ‌న్ యాక్ట్ కింద ఏర్పాటు చేశారు. స్టేట్ లేబ‌ర్ డిపార్ట్‌మెంట్ కూడా దీన్ని యాక్సెప్ట్ చేసింది. 15 లక్ష‌ల మంది ఐటీ ఎంప్లాయిస్ ఉన్న బెంగుళూరులో ప్ర‌స్తుతం 250 మంది మాత్ర‌మే ఈ యూనియ‌న్‌లో చేరారు. అయితే ఇది మొద‌లే. ప్ర‌స్తుతం కేఐటీయూ సీపీఎం పార్టీ అనుబంధ కార్మిక సంఘ‌మైన సీఐటీయూ కింద ప‌ని చేస్తుంది. భ‌విష్య‌త్తులో మిగ‌తా పార్టీల బ్యాక‌ప్‌తో కూడా కార్మిక సంఘాలు పుట్టుకొచ్చే అవ‌కాశం లేక‌పోలేదు. 
ఇండ‌స్ట్రీకి మంచిదేనా? 
ఐటీ పూర్తిగా టెక్నాల‌జీ బేస్డ్ ఇండ‌స్ట్రీ. ఇక్క‌డ టాలెంట్‌కే విలువ‌.  కార్మిక సంఘాలు ఎంట‌ర‌యితే అన్నింటికీ అమెండ్‌మెంట్స్ మొద‌లుపెడ‌తారు. ప‌ని చేయ‌ని వాణ్ని పక్క‌న‌పెట్టాల‌న్నా చాలా హెడేక్ అవుతుంది. ఇది ఇండ‌స్ట్రీ పెర్‌ఫార్మెన్స్‌కు దెబ్బ‌. ఇండియాలో  క్వాలిటీ ఐటీ స‌ర్వీసెస్ త‌క్కువ ఖ‌ర్చులోనే దొరుకుతాయ‌ని ఇక్క‌డ కంపెనీలు పెట్టే, మ‌న‌కు బిజినెస్ ఇచ్చే విదేశీ కంపెనీలు ఇలాంటి ప‌రిణామాల‌తో కాస్త వెన‌క‌డుగు వేసే ప్ర‌మాదం లేక‌పోలేదు. ఎంప్లాయిస్ ప‌రంగా కార్మిక సంఘాలు స‌బ‌బే అయినా ఇండ‌స్ట్రీ గ్రోత్‌కు కాస్త అడ్డంకేన‌ని ఎక్స్‌ప‌ర్ట్‌లు అంటున్నారు. 

జన రంజకమైన వార్తలు