• తాజా వార్తలు
  •  

ఆటోమేష‌న్‌లోనూ ఐటీ జాబ్ కొట్టాలంటే ఈ కోర్సులు నేర్చుకోండి..

ఆటోమేష‌న్‌, మెషీన్ లెర్నింగ్ ఓ వైపు.. ట్రంప్ లాంటి దేశాధినేత‌ల ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయిస్ మీద విధిస్తున్న ఆంక్ష‌లు మ‌రోవైపు ఐటీ సెక్టార్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పుడున్న జాబ్‌లే ఎప్పుడు పోతాయో ఎవ‌రికీ తెలియ‌ని ప‌రిస్థితి. మ‌రోవైపు ఐటీ కొలువు కోసం ప‌ట్టాలు చేత్తో ప‌ట్టుకుని ఫీల్డ్‌లోకి వస్తున్న ల‌క్ష‌లాది మంది గ్రాడ్యుయేట్లు ఏం చేయాలి? అయితే ఇలాంటి సిట్యుయేష‌న్‌లోనూ జాబ్ సంపాదించాలంటే బిగ్‌డేటా ఎనాల‌సిస్‌, డేటా సైన్స్ వంటి కోర్సులు నేర్చుకోవాలంటున్నారు నిపుణులు.
ఈ కోర్సుల‌పై ఇంట్ర‌స్ట్ పెరుగుతోంది
ఇండియాలో ఐటీ ప‌రిశ్ర‌మ విలువ కొన్ని ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు. ఆటోమేష‌న్‌తో మ‌న ఐటీ పరిశ్రమలో 5లక్షల ఉద్యోగాలు పోయే ప్ర‌మాద‌ముంద‌ని అమెరిక‌న్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ హెచ్‌ఎఫ్‌ఎస్ రిపోర్ట్ చేసింది . ఇలాంటి పరిస్థితుల్లో కూడా బిగ్‌డేటా, డేటా సైన్స్‌, డెవోప్‌, సైబర్‌ సెక్యూరిటీ రంగాలు అభివృద్ధి చెందుతున్నాయి. గ‌త నాలుగు నెలల్లో ఈ రంగాల్లో 50% పెరుగుదల కన్పించింది. దీంతో వీటికి సంబంధించిన కోర్సులు నేర్చుకునేవారి సంఖ్య కూడా భారీగా పెరిగింది. డెవోప్స్‌ నేర్చుకునే వారి సంఖ్య మూడునెలల్లో 109% , క్లౌడ్‌లో 70%, బిగ్‌డేటాలో 60% , డేటాసైన్స్‌లో 45% పెరిగింది.
ఫ్రెష‌ర్స్‌కు చాలా అవ‌స‌రం బిగ్‌డేటా, క్లౌడ్‌, డేటాసైన్స్‌ లాంటి వాటిల్లో చాలా మంది కొత్తవారిని తీసుకుంటున్నారు. ఒక్క డేటాసైన్స్‌లోనే 85 వేల ఉద్యోగాలు ప్ర‌స్తుతం ఆఫ‌ర్లలో ఉన్నాయి. ఈ కోర్సులు చేసిన‌వారి కోసం కంపెనీలు ర‌డీగా ఉన్నాయి. రానున్న కాలంలో బిగ్‌డేటా, డేటా అనలిటిక్స్‌లో వేల కొద్ది జాబ్‌లు వ‌స్తాయి. అందుకే ఇప్ప‌టికే ఐటీలో స్థిర‌ప‌డిన‌వారు ఇలాంటి కోర్సులు నేర్చుకుని అప్‌డేటెడ్‌గా ఉంటే ఆటోమేష‌న్‌లోనూ జాబ్‌కు సెక్యూరిటీ ప‌క్కా అంటున్నారు.

జన రంజకమైన వార్తలు