• తాజా వార్తలు
  •  

టెకీల జాబ్స్ కోసం నాస్ కామ్ స్పెష‌ల్ యాప్- స్టార్ట‌ప్ జాబ్స్

అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ఏ ముహూర్తాన అధ్య‌క్షుడయ్యాడో కానీ ఇండియ‌న్ టెక్కీల‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు. హెచ్‌1 బీ వీసాలు టైట్ చేసి, ఇప్ప‌టికే అక్క‌డున్న ఇండియ‌న్ బేస్డ్ ఐటీ కంపెనీల‌ను కూడా అమెరిక‌న్ల‌కే ఉద్యోగాలివ్వాలంటూ రోజుకో కొత్త రూల్ తెస్తున్నాడు. దీంతో టెక్నాల‌జీ ప్రొఫెష‌న‌ల్స్ త‌మ జాబ్ ఎన్నాళ్లుంటుందో? పోతే మ‌ళ్లీ ఎక్క‌డ వెతుక్కోవాలో అని ఆందోళ‌న చెందుతున్నారు. ఇలా ఆవేద‌న ప‌డుతున్న టెక్కీల కోసం నాస్కామ్.. స్టార్ట‌ప్ జాబ్స్ అనే కొత్త యాప్ తీసుకొచ్చింది.
పెద్ద కంపెనీలే క‌స్ట‌మ‌ర్లు
బెంగళూరుకు చెందిన హెచ్ఆర్ టెక్ స్టార్టప్ ఈ-పోయిస్ సిస్టమ్స్ ఈ యాప్ ను డెవ‌ల‌ప్ చేసింది. లండన్ బిజినెస్ స్కూల్ ఓల్డ్ స్టూడెంట్స్ సచిన్ అగర్వాల్, బిశాన్ సింగ్ ఈ స్టార్టప్ ను స్థాపించారు. హెచ్‌పీ, సిమెన్స్, ఫ్లిప్ కార్ట్, ఫస్ట్ సోర్స్, ఓలా, హెచ్ డీఎఫ్‌సీ, రిల‌య‌న్స్ దీనికి కస్టమర్లు. మార్కెట్లో తమకు సూట‌బుల్ జాబ్స్‌ను సెర్చ్ చేసుకోవ‌డంలో ఈ యాప్ టెక్ ప్రొఫెష‌న‌ల్స్‌కు బాగా ఉప‌యోగప‌డుతుంది.
ఎలా ప‌ని చేస్తుంది?
ఎక్కడ ఖాళీలున్నా ఈ యాప్ వెంటనే టెక్నాలజీ ప్రొఫిషనల్స్ కు అలర్ట్ లను పంపిస్తుంది. టెక్నాలజీ, సేల్స్, మార్కెటింగ్ ఆపరేషన్స్ లాంటి స్టార్టప్స్ లో ఎంపికచేసిన జాబ్ ఓపెనింగ్స్ ను యాప్ ఆఫర్ చేస్తోంది. అభ్యర్థులు ఈ యాప్ లో తమ వీడియో ప్రొఫైల్స్ అప్ లోడ్ చేసుకోవచ్చు. దీంతో కంపెనీలు ఆ ప్రొఫైల్స్ చూసి ఇంట‌ర్వ్యూల‌కు పిలిచే ఛాన్స్ ఉంటుంది. ఏ కంపెనీ తమ ప్రొఫైల్ చూసినా వెంట‌నే క్యాండేట్‌కు స్టేటస్ అప్ డేట్స్ కూడా వ‌స్తాయి.

జన రంజకమైన వార్తలు