• తాజా వార్తలు
  •  

అమెరికాలో టాప్ జాబ్ క్రియేట‌ర్‌గా టీసీఎస్‌ రికార్డ్

ఇండియ‌న్ టాప్ ఐటీ కంపెనీ ల్లో ఒక‌టైన  టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) అమెరికాలో దుమ్ము రేపుతోంది. అమెరికాలో ఐటీ స‌ర్వీసెస్ సెక్టార్‌లో టాప్ 2 ఎంప్లాయ‌ర్స్‌లో టీసీఎస్ చోటు ద‌క్కించుకుంది.   గ‌త ఐదేళ్ల రికార్డుల‌ను బేస్ చేసుకుని కేంబ్రిడ్జి గ్రూప్  ఓ స్ట‌డీ కండెక్ట్ చేసింది. దీనిలో  టీసీఎస్ టాప్‌లో నిలిచింది.  
ప‌దేళ్ల‌లో 12,500 మందికి జాబ్స్‌
2012 నుంచి 2016 వ‌ర‌కు ఐదేళ్ల‌లో టీసీఎస్  12,500 మందికి పైగా అమెరికన్లకు జాబ్‌లు ఇచ్చింది. అంతేకాదు కంపెనీ ఎంప్లాయిస్‌లో అమెరిక‌న్స్ వాటాను బాగా పెంచుతోంది. ఈ గ్రోత్ రేట్ దాదాపు 57%.  యూఎస్ ఎంప్లాయిస్ గ్రోత్ రేట్‌లో టీసీఎస్ టాప్ పొజిష‌న్‌లో నిలిచింది.  ఈ ఇయ‌ర్ ఐటీ స‌ర్వీసెస్‌లో ఎక్స్‌ప‌ర్ట్‌ల ప్లేస్‌మెంట్స్ ఇంత‌కంటే ఎక్కువే ఉండొచ్చ‌ని అంచ‌నా వేసింది.  
2 ల‌క్ష‌ల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్ 
న‌ల‌భై సంవ‌త్స‌రాలుగా అమెరికాలో ఉన్న టీసీఎస్‌.. మూడేళ్లుగా అక్క‌డ ఇన్వెస్ట్‌మెంట్‌ను భారీగా పెంచింది. ఎంప్లాయిమెంట్‌, ఇన్నోవేష‌న్ ల్యాబ్స్ ఎస్టాబ్లిష్‌మెంట్‌, అక‌డ‌మిక్ పార్ట‌నర్‌షిప్స్, స్టెమ్ ఎడ్యుకేష‌న్ ప్రోగ్రాం నిర్వ‌హ‌ణ‌కు మూడేళ్ల‌లో 3 బిలియ‌న్ డాల‌ర్లు (ల‌క్షా 93వేల కోట్ల రూపాయ‌లు) ఖర్చు చేసింది.  కంపెనీ ప్ర‌తి క్వార్ట‌ర్‌లోనూ 800 -900 ఓపెన్ పోస్టుల‌ను టెక్సాస్‌, ఓహియో, కాలిఫోర్నియా, నార్త్ క‌రోలినా, న్యూయార్క్ వంటి ప్రాంతాల్లోని అమెరిక‌న్ల కోసం సిద్ధంగా ఉంచుతుంది.  యూఎస్‌లోని 75 కాలేజీల‌తో క్యాంప‌స్ ప్లేస్‌మెంట్స్ కోసం టై అప్ కూడా చేసుకుంది.  

జన రంజకమైన వార్తలు