• తాజా వార్తలు
  •  

సాంకేతిక ఉద్యోగానికి రాచ బాట... మీ లింకెడ్ ఇన్ ప్రొఫైల్ కి ఈ 31 టిప్స్ పాటిస్తే...

సాంకేతిక ఉద్యోగానికి రాచ బాట... మీ లింకెడ్ ఇన్ ప్రొఫైల్ కి ఈ 31 టిప్స్ పాటిస్తే...

మీకు లింక్డ్ ఇన్ లో ఎకౌంటు ఉందా? మీ లింక్స్ ఇన్ ప్రొఫైల్ ఏమంత ఆకర్షణీయంగా అనిపించడం లేదా? మీకు మంచి ఉద్యోగం లభించాలంటే మీ ప్రొఫైల్ ను ఖచ్చితంగా మార్చుకోవాలి అని అనిపిస్తుందా? అయితే ఈ వ్యాసం మీ కోసమే. లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ను మార్చు కోవడం ద్వారా మీరు ఉద్యోగ సంస్థ ల దృష్టిని ఆకర్షించడానికి మేము మీకు 31 రకాల మార్పులను సూచిస్తున్నాము. మీ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ లో ఈ మార్పులను చేసుకుని చూడండి.విజయం మీ సొంతం

1. ప్రొఫైల్ సంపూర్ణం గా ఉండాలి

మీ ప్రొఫైల్ సంపూర్ణం గా ఉండేట్లు చూసుకోండి. మీ ప్రొఫైల్ ఎంత సంపూర్ణంగా ఉంటె రిక్రూటర్ లు మీ పట్ల అంత ఆసక్తి చూపిస్తారు. సంపూర్ణత నేది అత్యంత ముఖ్యమైన అంశం. మీ ప్రొఫైల్ లో మీ గురించి సమగ్ర సంచారం ఉన్నపుడే కదా మీ నైపుణ్యాలు, ఆసక్తులు, అనుభవాలు, అర్హతలు తెలిసేది. కాబట్టి మీ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ లో ఉన్న ప్రతి కాల మ్ను పూర్తీ చేయండి.

2.  కస్టమ్ యుఆర్ఎల్ ను పొందండి  

మీ ప్రొఫైల్ కు ఒక కస్టమైజ్డ్ URL ను కలిగి ఉండడం కూడా ముఖ్యమైనదే. ప్రత్యేకించి ఇది లింక్డ్ ఇన్.కాం/మీ పేరు అయితే బాగుంటుంది. దీనిని పొందడం కూడా చాల సులభం. మీ ప్రొఫైల్ లో ఉన్న ఎడిట్ సెక్షన్ లో క్రింద ఉన్న గ్రే విండో లో ఉన్న బేసిక్ ఇన్ఫర్మేషన్ లో మీరు మీకు నచ్చిన URL అడ్రస్ ను మార్చుకోవచ్చు.

3. మంచి ఫోటో ను ఎంచుకోండి

కొన్ని కంపెనీలు మీ ప్రొఫైల్ పిక్చర్ ని బట్టి మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తాయి కాబట్టి మీ ప్రొఫైల్ పిక్చర్ ఎంచుకునే టపుడు కొంచెం జాగ్రత్త గా అలోచించి మంచి పిక్చర్ ను ఉంచడం మంచిది. ప్రత్యేకించి మీరు ఎలాంటి కంపెనీ లో ఉద్యోగం చేయాలనుకుంటున్నారో స్పష్టత ఉంటె దానిని బట్టి మంచి ఫోటో ను మీ ప్రొఫైల్ పిక్చర్ గా ఉంచుకోవచ్చు.

4. హెడ్ లైన్

మీ ప్రొఫైల్ యొక్క  హెడ్ లైన్ చూస్తే మీ ఉద్యోగం మరియు కంపెనీ పేరు కనపడవలసిన అవసరం లేదు, కానీ మీరు కనుక జాబు కోసం వెతుకుతుంటే మీ హెడ్ లైన్ తప్పకుండా ఆకర్షణీయంగా ఉండవలసిన అవసరం ఉంది. మీకున్న అర్హతలు, ప్రత్యేకతలు మొదలైనవి అన్నీ మీ హెడ్ లైన్ లోనే ప్రతి బింబించేలా ఉండగలిగితే చాలు.

5. జాబు డిస్క్రి ప్షన్

మీరు ఎలాంటి జాబు ను వేదుకుతున్నారో దాని గురించి వివరించడం మంచిది. తద్వారా మీకు తగిన రిక్రూటర్ లు మీకు వచ్చే అవకాశం ఉంది.

6.సమ్మరీ స్పేస్ ను వేస్ట్ చేయవద్దు

మీ సమ్మరీ 3 - 5 పేరా లు ఉంటె సరిపోతుంది. మీ విద్యార్హతలు, అనుభవం, విశిష్టత లు, ఆసక్తులు మొదలైనవి అన్నీ ఆ పేరా లలో ఉండేట్లు చూసుకోవాలి.

7. నంబర్స్ ను ఉపయోగించండి

మీ రెజ్యుం లో గత అనుభవాలను రాసేటపుడు అవసరం ఉన్న చోటల్లా నంబర్ లను వాడడం మంచిది. ఉదాహరణకు నేను ఫలానా కంపెనీ లో 5 సంవత్సరాలు పనిచేశాను, అప్పుడు సుమారు 100 మంది ఉద్యోగులను మేనేజ్ చేయగలిగాను లేదా నా అనుభవం లో 5000 మంది వ్యాపార వేత్తలను కలిశాను ఇలా అన్నమాట .

8. Be Welcoming

మీ ప్రొఫైల్ ను చూసి మీరు నటిస్తున్నారని అనుకోకూడదు అంటే మీ ప్రొఫైల్ ను చూడగానే ఆహా అనిపించాలి. మీ ప్రొఫైల్ ను లోతుగా స్టడీ చేయాలి అనిపించాలి.

9. అనవసరమైన పదాలు వాడకండి.

Responsible, creative, effective, analytical, strategic, patient, expert, organizational, driven mariyu innovative ఇలాంటి పదాలు సాధారణంగా అందరూ వాడుతూ ఉంటారు. కాబట్టి ఇవి కాకుండా ఇంకా ఏమైనా మంచి పదాలు ఆలోచించండి.

10. మీ ప్రొఫైల్ ను మీ రెజ్యూమ్ లాగా భావించండి.

 మీ రెజ్యూమ్ ని ఎంత జాగ్రత్త గా రాస్తారో తెలుసుకదా! అలాగే మీ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ను కూడా అంతే జాగ్రత్తగా మీ గురించి సమగ్ర సమాచారం తెలిసే విధంగా ఉంచండి.

11. ప్రథమ పురుష అంటే మీ పేరు ఉపయోగించడం

మీ రెజ్యూమ్ రాసేటపుడు ఎప్పుడూ ఉత్తమ పురుష లోనే రాస్తారు. అంటే నేను, నా .... ఇలాగ. అలా కాకుండా లింక్డ్ ఇన్ ప్రొఫైల్ లో ఉత్తమ పురుష కి బదులు ప్రథమ పురుష ను అంటే మీ పేరు ఉంచడం మంచిది.

12. వ్యక్తిగత వివరాలు చెప్పండి

మీ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ అనేదానిని రెజ్యూమ్ లేదా CV లాగా భావించే కంటే మీరు ఎదుటి వ్యక్తీ తో సంభాషిస్తుంటే ఎలా మాట్లాడతారో మీ ప్రొఫైల్ ను కూడా అలాగే ఉంచడం మంచిది.

13. మీ విజయాలను చూపించండి.

మీ ప్రొఫైల్ లో మీరు సాధించిన విజయాలను (వృత్తి మరియు వ్యక్తిగత జీవితం లో) ప్రస్తావించడం ద్వారా రిక్రూటర్ లకు మీ పై ఒక మంచి అభిప్రాయాన్ని కలిగించవచ్చు.

14. ప్రస్తుత ఉద్యోగ స్థితి ని ప్రస్తావించడం

మీరు ఉద్యోగం చేస్తున్నా లేదా నిరుద్యోగి గా ఉన్నా సరే మీ ప్రస్తుత స్థితి ని మీ ప్రొఫైల్ లో ప్రస్తావించడం మంచిది. మీ గత అనుభవాలతో పాటు ప్రస్తుత స్థితి ని కూడా ప్రస్తావిస్తే మంచిది.

15. మీ సమ్మరీ కి మల్టిమీడియా ను యాడ్ చేయండి.

ఒక పిక్చర్ అనేది వేయి పదాలకు సమానం. కాబట్టి మీ ప్రొఫైల్ లో అవసరం అయిన చోట ఫోటో లు, వీడియో లు, స్లయిడ్ షో లు ఉంచితే తప్పేమీ లేదు.

16. మీపని అనుభవానికి మల్టిమీడియా

మీ ప్రతి పని అనుభవానికీ ఈ మల్టిమీడియా ను ఉపయోగించుకోవచ్చు. అంటే మీ గత అనుభవాలను ఒక ప్రజెంటేషన్ లాగా ఇవ్వడం లాంటివి చేయవచ్చు.

17.ప్రాజెక్ట్ లు, భాషలు మొదలైనవి యాడ్ చేయడం

మీరు గతం లో చేసిన ప్రాజెక్ట్ ల వివరాలు, మీకు తెలిసిన భాషల వివరాలు అడిషనల్ ప్రొఫైల్ లో యాడ్ చేయడం మంచిది.

18. నెలకు ఒక లింక్డ్ ఇన్ రికమెండేషన్ ను ను రిక్వెస్ట్ చేయండి.

ఎవరైనా మీ గురించి పొగడినట్లయితే దానిని స్నాప్ షాట్ తీసి మీ ప్రొఫైల్ లో ఉంచమని అడగండి. తద్వారా మీకు మరిన్ని అవకాశాలు వచ్చే అవకాసం ఉంటుంది. ఇలాంటి సిఫార్సు నెలకు ఒక్కటైనా ఉంటె మంచిది.

19. సిఫార్సులను స్ట్రాటజిక్ గా ఉంచమనండి

మీరు ఉంచుతున్న సిఫార్సులు ఎంత స్ట్రాటజిక్ గా ఉంటే అంత మంచిది.

20. అనవసరం అనుకున్న సిఫార్సులను తీసేయండి.

కొన్ని సిఫార్సులను చూస్తే మీకు ఇది అనవసరం అనిపిస్తే వాటిని మీ ప్రొఫైల్ నుండి తొలగించడానికి సందేహించకండి. ఏదైనా నిర్మాణాత్మకం గా ఉండేట్లు చూసుకోండి.

21. మీ ఎందోర్స్ మెంట్ లను మేనేజ్ చేసుకోవడం

మీరు మీ ఎండార్స్ మెంట్ లను ఎంత సమర్థవంతంగా మేనేజ్ చేస్తున్నారు అనే దానిపై కూడా మీ ఉద్యోగ అవకాశాలు ఆధార పడి ఉంటాయి.

22. మీ స్టేటస్ ను అప్ డేట్ చేయండి.

పేస్ బుక్ మాదిరిగా మీ స్టేటస్ ను ఎప్పటికప్పుడు అప్ డేటెడ్ గా ఉంచుతూ నిరంతరం ఆక్టివ్ గా ఉండడం ముఖ్యం

23. మీలో ఉన్న రచయిత ను బయటకు తీయండి.

మీ రంగం లో జరుగుతున్న మార్పులు పోకడల గురించి ఎప్పటికప్పుడు మీ ప్రొఫైల్ లో విశ్లేషిస్తూ ఉండండి.

24. బ్లాగ్ ను యాడ్ చేయడం

మీకు వర్డ్ ప్రెస్ బ్లాగ్ లాంటివి ఉన్నట్లయితే వాటిని మీ ప్రొఫైల్ కు యాడ్ చేయండి. కొత్త పోస్ట్ వచ్చినపుడల్లా ఇది మీకు తెలియ జేస్తుంది.

25. గ్రూప్ లలో సభ్యునిగా ఉండండి.

లింక్డ్ ఇన్ ప్రొఫైల్ గ్రూప్ లలో సభ్యునిగా ఉండడం వాళ్ళ వివిధ రకాల అభిప్రాయాల తో పాటు అవకాశాలు కూడా పంచుకోవచ్చు.

26. కనీసం 50 కనెక్షన్స్ కలిగి ఉండడం.

మీ ప్రొఫైల్ లో కనీసం 50 కనెక్షన్స్ ను కలిగి ఉండండి. 50 నుండి 100 కనెక్షన్స్ ఉన్నా తప్పు లేదు.

27. మీకు తెలియని వారిని యాడ్  చేయవద్దు.

50 కనెక్షన్స్ కలిగి ఉండాలి కదా అని మీకు తెలియని వారిని యాడ్ చేసుకోవడం వలన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి. తెలియని వారిని యాడ్ చేసుకోవద్దు.

28. సింహావలోకనం చేసుకోండి.

మీ ప్రొఫైల్ పూర్తీ అయిన తర్వాత ఒక్క సారి మిమ్మల్ని మీరు వేరే వ్యక్తీ గ భావించి మీ ప్రొఫైల్ ను సింహావలోకనం చేయండి. మీకు మీరే మంచి విమర్శకులు కాగలరు.

29. మీ ప్రొఫైల్ ను సీక్రెట్ గా ఉంచండి.

చాలా మంది లింక్డ్ ఇన్ ప్రొఫైల్ అంత సురక్షం గా ఉండదు అనుకుంటారు. అది నిజం కాదు. మీ ప్రొఫైల్ ఎవరికైనా కనపడకూడదు అనుకుంటే మీరు సెట్టింగ్ లలో కి వెళ్లి ఆ వ్యక్తీ కి కనపడకుండా చేయవచ్చు.

30. కాంటాక్ట్ సమాచారం

మీ ఏఎ మెయిల్ అడ్డ్రెస్ ను ఇవ్వడం మరిచి పోవద్దు. చాలామంది అంతా బాగానే చేస్తారు కానీ దీనినే మర్చిపోతూ ఉంటారు. కాబట్టి మీరు ఆ పొరపాటు చేయకండి.

31. ఉత్సాహం గా ఉండండి.

మీ ప్రొఫైల్ చూస్తే మీ ఉత్సాహం కనపడాలి. వివిధ రకాల కార్యక్రమాలలో మీరు ఎంత ఉత్సాహంగా పాల్గొంటారో ప్రస్తావిస్తే మంచి అవకాశాలు ఉంటాయి.

 

జన రంజకమైన వార్తలు