సాధారణంగా డిగ్రీ పూర్తైన తర్వాత ఎవరైనా ఏం చేస్తారు? కొంత మంది ఉద్యోగ ప్రయత్నం చేస్తారు. కొంతమంది పిజి చేస్తారు. కానీ వారు సంపాదించిన డిగ్రీ కానీ తర్వాత సంపాదించే పిజి కానీ వారి యొక్క ఉద్యోగ ప్రయత్నం లో ఎంత వరకు ఉపయోగపడుతున్నాయి అని అడిగితే? ఎవ్వరి దగ్గరా సమాధనం ఉండదు. ఎందుకంటే మన విద్యార్థులు సంపాదించిన డిగ్రీ లు విద్యార్హత లకు తప్ప ఎందుకూ పనికి రావనేది అందరూ ఒప్పుకునే నిజం. నేటి పోటీ ప్రపంచంలో ఏ ఉద్యోగార్థునికైనా ముఖ్యంగా ఉండవలసినవి రెండు. అవి
ముందుగా ఇంజినీరింగ్ పుర్తి అయిన తర్వాత ఐటి రంగంలో ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఐటి లేదా కంప్యూటర్ సైన్స్ లో బిటెక్ పూర్తి చేసిన విద్యార్థులు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ లు గా స్థిర పడతారనేది మనందరికీ తెలిసిన విషయమే. అయితే సంవత్సరానికి ఎంతమంది సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా బయటకు వస్తున్నరని అడిగితే మనకు సమాధానం దొరకడం చాలా కష్టం. ఎందుకంటె ఆ ఉద్యోగానికి కావల్సిన నైపుణ్యాలు ఆ విద్యార్థికి తెలియక ఉండవచ్చు లేదా కళాశాలలో నేర్పించి ఉండకపోవచ్చు. అప్పుడు ఆ నైపుణ్యాలను నేర్చుకునే ఉద్దేశము తో మరో రెండు సంవత్సరాలు వృథా చేస్తున్నారు. అలా కాకుండా పిజి చేసినట్లైతే సబ్ జెక్ట్ తొ పాటు సమయం కూడా కలిసి వస్తుంది. లేదా కోర్సు సమయంలోనే సమాంతరంగా కంప్యూటర్ అప్ప్లికేషన్ కోర్సులు చేయవచ్చు అనేది మరొక ప్రత్యామ్నాయం. దీని వలన బి టెక్ పుర్తైన వెంటనే మంచి ఉద్యోగం పొందే అవకాసం ఉంటుంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ మంచి ఉద్యోగం సంపాదించాలంటె కంప్యూటర్ లో వీలైనన్ని ఎక్కువ కోర్సులు నేర్చుకో వలసి ఉంటుంది. సాధారణ డిగ్రీ విద్యార్థులది కూడా ఇదే పరిస్థితి. అన్ని కాంపెటీటివ్ పరీక్షలలోనూ కంప్యూటర్ పరిజ్ఞానాన్ని తప్పనిసరి సబ్జెక్ట్ గా చేసారు. కాబట్టి ఎవరైనా సరే జీవితంలో ఒక మంచి ఉద్యోగంలో చేరాలి అనుకుంటే మాత్రం కంప్యూటర్ పరిజ్ఞానాన్ని నేర్చుకుని తీరాల్సిందే. |