• తాజా వార్తలు
  •  

2025లో ఐటీ కంపెనీలు ఎలా ఉంటాయి?

ఐటీ.. ఇండియ‌న్ ఎకాన‌మీలో ఈ సెక్టార్ పాత్ర చాలా పెద్ద‌ది. ఎంతో మంది దేశ‌, విదేశాల్లో ఐటీ కొలువుల‌తో స్థిర‌పడ్డారు. రియ‌ల్ ఎస్టేట్ అభివృద్ధికి ఐటీ సెక్టార్‌తోనే తొలి అడుగులుప‌డ్డాయి. ప‌ర్చేజింగ్ ప‌వ‌ర్ పెర‌గ‌డం, ప్ర‌పంచ ప్ర‌సిద్ధి చెందిన బ్రాండెడ్ కంపెనీలు, ల‌గ్జ‌రీ కార్ల కంపెనీలన్నీ ఇండియా బాట ప‌ట్ట‌డం వీట‌న్నింటినీ ప్ర‌త్య‌క్షంగానో ప‌రోక్షంగానో ఐటీ సెక్టారే కార‌ణం. అందుకే మ‌ధ్య‌లో ఒడిదుడుకులు వ‌స్తున్నా ఇప్ప‌టికీ యూత్ ఫ‌స్ట్ ఛాయిస్ ఐటీ కొలువే. అలాంటి ఐటీ ఇండ‌స్ట్రీ 2025 నాటికి ఎలా ఉండ‌బోతుంద‌ని కొంత‌మంది ఎక్స్‌ప‌ర్ట్‌లు ఒపీనియ‌న్ అడిగితే వాళ్లు ఏం చెప్పారంటే..
పెద్ద పెద్ద క్యాంప‌స్ లు ఉండ‌వు
ఐటీ కంపెనీలంటే పెద్ద పెద్ద క్యాంప‌స్‌లు. గ్రీన‌రీ, భారీ బిల్డింగ్స్‌, లాంజ్‌లు, రిక్రియేష‌న్ ఫెసిలిటీస్‌.. ఇవ‌న్నీ ఉంటున్నాయి. కానీ 2025 నాటికి ఇలాంటి క్యాంప‌స్‌లేవీ ఉండ‌క‌పోవ‌చ్చు. ఓపెన్ ఆఫీస్‌లా.. ఓ పెద్ద షాప్‌లా మారినా ఆశ్చ‌ర్చ‌పోనక్క‌ర్లేద‌ట‌. ఆటోమేష‌న్ ప్ర‌భావంతో ఎంప్లాయిస్ సంఖ్య త‌గ్గుతుంద‌ని, దీంతో పెద్ద క్యాంప‌స్‌ల అవ‌స‌రం ఉండ‌ద‌ని, ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్‌, బిల్డింగ్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్‌, మెయింట‌నెన్స్ కాస్ట్ త‌గ్గిపోతుంద‌ని చెప్పారు. 
వ‌ర్క్ అవ‌ర్స్ త‌గ్గుతాయి
రిపిటీటివ్‌, ఈజీ టాస్క్‌లను ఆటోమేష‌న్‌తో కంప్లీట్ చేస్తారు. కాబ‌ట్టి యావ‌రేజ్‌న ఎంప్లాయి వ‌ర్కింగ్ అవ‌ర్స్ 30 గంట‌లకు మించ‌కపోవ‌చ్చు.  ఎక్కువ శాతం  ప‌ని మొబైల్‌ఫోన్ మీద కూడా చేసేలా ఉంటుంది. ఎక్స్‌ప‌ర్ట్‌లు త‌మ టీమ్ మెంబ‌ర్ల‌తో మీట్ అవ‌డానికిం కంపెనీలు వ‌ర్క్‌పాడ్ల‌ను క్రియేట్ చేస్తాయి. వాళ్లు జ‌స్ట్ క‌లిసి డిస్క‌స్ చేసుకుని డిస్ప‌ర్స్ అయిపోవ‌డ‌మే. 
రీస్కిల్లింగ్ త‌ప్ప‌నిస‌రి 
ఎంప్లాయి ఎప్ప‌టిక‌ప్పుడు త‌న స్కిల్క్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి నిబంధ‌నగా మారుతుంది. ఎందుకంటే అప్‌డేటెడ్‌గా లేని ఎంప్లాయికే పింక్ స్లిప్ ఫ‌స్ట్ అందుతుంది. కాబ‌ట్టి ఏజ్‌తో ప‌నిలేకుండా ప్ర‌తి ఎంప్లాయి త‌న స్కిల్స్‌ను ఎన్‌రిచ్ చేసుకోవాల్సిందే. ఇప్ప‌టిలా అది ఎంప్లాయ‌ర్స్ ప‌ని కాదు.
ఆటోమేష‌న్ ప్రభావం
ఆటోమేష‌న్ ఎఫెక్ట్ బాగా పెరుగుతుంది. ఆర్టిఫిషియ‌ల్  ఇంటిలిజెన్స్ (AI) టెక్నాల‌జీతో ప‌నిచేసే బాట్స్ చాలా ప‌నుల్లో మ‌నుషుల‌ను రీప్లేస్ చేస్తాయి. ముఖ్యంగా పెద్ద‌గా స్కిల్స్ అవ‌స‌రం లేని జాబ్స్‌లో మ‌నుషుల‌కు బ‌దులు రోబోల వాడ‌కం పెరుగుతుంది. ఇది ఉద్యోగాల‌పైన ప్ర‌భావం చూపిస్తుంది. 

బీ యువ‌ర్ ఓన్ బాస్ 
ఎవ‌రో మీకు జాబ్ ఇస్తారు.. శాల‌రీ ఇస్తారు అయినా మీకు మీరే బాస్‌లా ఉండాలంటే స్వ‌తంత్రంగా నిర్ణయాలు తీసుకునే క్యాప‌బులిటీ ఉండాలి. రెస్పాన్సిబులిటీస్‌ను తీసుకోవాలి. అంతేకాదు మిమ్మ‌ల్ని మీరు కంటిన్యూయ‌స్‌గా మార్కెట్ చేసుకోవాలి. లేదంటే రేసులో వెనక‌బ‌డ‌తారు. కంపెనీలు కూడా ఇలా సెల్ఫ్‌బిల్డింగ్ ఎంప్లాయిస్‌నే లైక్ చేస్తాయి. పెర్‌ఫార్మెన్స్ బేస్డ్‌గానే ఎంప్లాయ‌ర్ మీ జాబ్‌ను కొన‌సాగిస్తారు కాబ‌ట్టి క‌చ్చితంగా మీ స్కిల్స్ పెంచుకోవాలి. ఎందుకంటే అప్పుడే ఆటోమేష‌న్ వ‌చ్చినా మీ జాబ్‌కు సెక్యూరిటీ ఉంటుంది. ఎందుకంటే మీరు హైలీ స్కిల్డ్ కాబ‌ట్టి. 

జన రంజకమైన వార్తలు