• తాజా వార్తలు
  •  

టాప్ కంపెనీల్లో ఇంట‌ర్వ్యూల‌కు మిమ్మ‌ల్ని సిద్ధం చేసే అద్భుత వేదిక జోబిన్‌

టెక్నాల‌జీ రంగంలో టాప్ కంపెనీల‌యిన గూగుల్‌, ఫేస్‌బుక్‌లాంటి వాటిలో జాబ్ కొట్టాల‌న్న‌ది మీ టార్గెట్టా?  ఇంట‌ర్వ్యూ ఎలా ఉంటుందోన‌ని టెన్ష‌న్ ప‌డుతున్నారా?  మీలాంటి వారికోస‌మే  ఇంట‌ర్వ్యూ ప్రిప‌రేష‌న్ స్టిమ్యులేట‌ర్ తీసుకొచ్చింది జోబిన్  (Xobin).  Xobin  ఫ్రీ వెబ్‌సైట్‌.  

గూగుల్‌, మైక్రోసాఫ్ట్ లాంటి ఏడు టాప్ టెక్ కంపెనీల్లో  సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ జాబ్‌ల‌కు ఎలా ఇంట‌ర్వ్యూ  ఉంటుందో అలాంటి స్టిమ్యులేష‌న్స్‌ను ఈ వెబ్‌సైట్ చేయిస్తుంది. 
టెస్ట్ ఎలా ఉంటుంది? 
ప్ర‌తి టెస్ట్ స్పెసిఫిక్ టైం లిమిట్‌తో ఉంటుంది. మ‌ల్టిపుల్ ఛాయిస్‌, కోడింగ్ క్వ‌శ్చ‌న్స్ ఇస్తారు. మేథ‌మెటిక‌ల్ రీజ‌నింగ్, కోడింగ్ క్వ‌శ్చ‌న్స్‌ను మీరు ఆన్స‌ర్ చేయాలి.  ఎగ్జామ్ పూర్త‌వ‌గానే మీ రిజ‌ల్ట్‌ను చూసుకోవ‌చ్చు. ఈ ప్రాసెస్‌లో మీకు అవ‌స‌ర‌మైతే గైడ్  చేయ‌డానికి  ఒక చాట్ బోట్ కూడా ఉంటుంది. 
కంపెనీల్లో ఇంట‌ర్వ్యూలు ఎలా ఉంటాయో అచ్చం అలాంటి ప్ర‌శ్న‌ల‌నే స్టిమ్యులేట‌ర్ మీకు ఇస్తుంది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌, డెవ‌ల‌ప‌ర్ జాబ్‌ల కోసం వెళ్లేవారికి మాక్ అసెస్‌మెంట్లు కూడా పెడుతుంది. 
ఎలా వినియోగించుకోవాలి? 
Xobin వెబ్‌సైట్‌లో సైన్ అప్ చేయాలి.  మీ ఫేస్‌బుక్‌, లింక్డిన్‌, గూగుల్ ప్రొఫైల్‌తో సైన్ అప్ చేసుకోవ‌చ్చు. మీరు సైన్ అప్ కాగానే My Xobin పేజీ ఓపెన్ అవుతుంది. దీనిలో Interviews , Reports అనే రెండు ట్యాబ్‌లు ఉంటాయి.  Interviews  ట్యాబ్‌ను ట్యాప్ చేస్తే ఇంట‌ర్వ్యూలోకి వెళ‌తారు. అక్క‌డ ఇంట‌ర్వ్యూ లో పాల్గొన‌వ‌చ్చు.  రిపోర్ట్స్‌లో మీరు చేసిన టెస్ట్ తాలూకా రిజ‌ల్ట్స్ వ‌స్తాయి.
ఈ కంపెనీల ఇంట‌ర్వ్యూలు అందుబాటులో ఉంటాయి
* గూగుల్ 
* మైక్రోసాఫ్ట్  
* ఫేస్‌బుక్‌
* అమెజాన్‌
* ఎన్‌విడియా
* అడోబ్ 
* ఫ్లిప్‌కార్ట్  
* తెస్లా (త్వ‌ర‌లో రానుంది) 
 

జన రంజకమైన వార్తలు