• తాజా వార్తలు
  •  

2018 లో ఈ టెక్నికల్ స్కిల్స్ ఉంటే మీరే మోస్ట్ వాంటెడ్ టెకీ

ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో సాధారణ డిగ్రీ తో ఉద్యోగం సంపాదించడం అంటే అంత సులువు కాదు. అలాగే మామూలు సాదాసీదా నైపుణ్యాలతో ఉద్యోగం సంపాదించే రోజులు కూడా పోయాయి. మారుతున్న టెక్నాలజీ కి అనుగుణంగా తమ నైపుణ్యాలను మెరుగుపరచుకుంటూ ఉంటేనే మంచి ఉద్యోగం సాధించగలరు. ఈ నేపథ్యం లో 2018 వ సంవత్సరం లో ఎలాంటి టెక్నికల్ స్కిల్స్ కీలక భూమిక పోషించనున్నాయి, కంపెనీలు ఎలాంటి స్కిల్స్ ఉన్నవారిని ఉద్యోగులుగా నియమించుకుంటున్నాయి? తదితర విషయాలను ఈ ఆర్టికల్ లో చూద్దాం.

రియాక్ట్ ( React )

ఇది ఒక జావా స్క్రిప్ట్ కు సంబందించిన స్కిల్. ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రం , ఇండివిడ్యువల్ డెవెలపర్ లు, ఇతర కార్పొరేషన్ లచే నిర్వహించబడే యూజర్ ఇంటర్ ఫేస్ లను బిల్డింగ్ చేయడానికి దీనిని ఉపయోగిస్తారు. 2017 లో దీని కోడ్ బేస్ లో అత్యధిక సంఖ్య లో కంట్రిబ్యూటర్స్ ను కలిగిన ప్రాజెక్ట్ లలో రెండవ స్థానం లో ఉన్నది. అత్యధిక ఉద్యోగార్థులు వెదుకుతున్న టెక్ స్కిల్స్ లో అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న స్కిల్స్ లో ఇది మొదటి స్థానం లో ఉన్నది. అదే విధంగా ఈ స్కిల్స్ కోసం అభ్యర్థుల రెస్యూమ్ లలో వెదుకుతున్న కంపెనీల సంఖ్య కూడా మూడింతలు పెరిగింది. ఈ స్కిల్ ఎంతటి ప్రాముఖ్యత ను కలిగి ఉన్నదో చెప్పడానికి ఈ ఉదాహరణలు చాలు.

అజూర్ (Azure)

ఇది ఒక మైక్రో సాఫ్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ సొల్యూషన్. మైక్రో సాఫ్ట్ డేటా సెంటర్ లకు చెందిన గ్లోబల్ నెట్ వర్క్ ద్వారా ఇది మేనేజ్ చేయబడుతుంది.ఇది provides software-as-a-service (SaaS), platform-as-a-service (PaaS), infrastructure-as-a-service (IaaS)  లను అందిస్తుంది. వివిధ రకాల ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లను సపోర్ట్ చేస్తుంది. వెబ్ యాప్ లను క్రియేట్ చేసుకోవడానికి ఇది పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని విరివిగా ఉపయోగించుకుంటుంది.

అమజాన్ వెబ్ సర్వీసెస్

అమజాన్ వెబ్ సర్వీసెస్ అనేది ఒక లీడింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఫ్లాట్ ఫాం. ఆఫ్ సైట్ కంప్యూటింగ్ మరియు స్టోరేజ్ కోసం దీనిని ఉపయోగిస్తారు. అనేకమంది ఎంప్లాయర్స్ తమ ఉద్యోగులలో తప్పనిసరిగా ఉండవలసిన నైపుణ్యాలలో దీనిని ఒకటిగా పరిగణిస్తారు.

అఫెన్సివ్ సెక్యూరిటీ సర్టిఫైడ్ ప్రొఫెషనల్

డేటా బ్రీచ్ లు, హ్యాకింగ్ లు, సైబర్ అటాక్ లు ఎక్కువగా జరుగుతున్న ఈ రోజులలో వీటిని నిరోధించే నైపుణ్యాలు ఉన్న అభ్యర్థుల కోసం కంపెనీలు ఎంత జీతం వెచ్చించడానికి అయినా సిద్దంగా ఉన్నాయి. ఈ అఫెన్సివ్ సెక్యూరిటీ సర్టిఫైడ్ ప్రొఫెషనల్ ( OSCP ) ఉన్నవారు ఎలాంటి సైబర్ దాడులనైనా సమర్థవంతంగా ఎదుర్కొని , తిప్పి కొట్టగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాఋ.

స్పార్క్

 అపాచీ స్పార్క్ అనే ఈ స్కిల్ ఒక ఓపెన్ సోర్స్ క్లస్టర్ కంప్యూటింగ్ ఫ్రేమ్ వర్క్ మరియు డేటా ప్రాసెసింగ్ ఇంజిన్. టెక్నాలజీ దిగ్గజాలైన నెట్ ఫ్లిక్స్, ఈ బే, యాహూ లాంటి కంపెనీలు డేటా ఎనాలిసిస్, స్ట్రీమింగ్, SQL, మెషిన్ లెర్నింగ్ లాంటి అనేక పనులకోసం దీనిని ఉపయోగిస్తున్నాయి. జావా, స్కాలా, పైథాన్ మరియు R లాంటి మల్టిపుల్ లాంగ్వేజ్ లను అప్లికేషను లను రాస్తారు.

యాంగులర్ JS ( Angular JS )      

ఇది ఒక జావా స్క్రిప్ట్ ఆధారిత  ఓపెన్ సోర్స్ ఫ్రంట్ ఎండ్ వెబ్ అప్లికేషను ఫ్రేమ్ వర్క్. గూగుల్ మరియు ఇతర కమ్యూనిటీ డెవలపర్ లచే ఇది మెయింటైన్ చేయబడుతుంది. ఇది HTML సామర్థ్యాలను తీసుకుని  ఫుల్ ఫీచర్డ్ వెబ్ అప్లికేషను లను బిల్డ్ చేస్తుంది.

R

ఇది ఒక ఓపెన్ సోర్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్రత్యేకించి స్టాటిస్టికల్ కంప్యూటింగ్ మరియు గ్రాఫిక్స్ కోసం దీనిని ఉపయోగిస్తారు. స్టాటిస్టిషియన్స్, డేటా మైనర్ లు, డేటా సైంటిస్ట్ లు సాఫ్ట్ వేర్ ను డెవలప్ చేయడానికీ,డేటా ఎనాలిసిస్ కోసం దీనిని ఉపయోగిస్తారు

జన రంజకమైన వార్తలు